kuppam rural
-
వివాహేతర సంబంధం.. భర్తను చంపి భార్య ఏం నాటకమాడిందో తెలుసా?
సాక్షి, కుప్పం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ వివరాలను పలమనేరు డీఎస్పీ గంగయ్య శనివారం కుప్పం అర్బన్ పోలీసుస్టేషన్లో విలేకరులకు వివరించారు. కుప్పం మండలం, గరిగచీనేపల్లెకు చెందిన హరీష్‌కుమార్, స్నేహ భార్యాభర్తలు. కుటుంబాన్ని పోషించేందుకు హరీష్‌కుమార్ హైదరాబాద్‌లో రాళ్ల పాలిషింగ్ పనికి వెళ్లేవాడు. ఈ మధ్య పనులు లేకపోవడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. భర్త హైదరాబాద్‌లో ఉన్న సమయంలో భార్య స్నేహకు రామకుప్పం మండలం, టేకుమానుతండాకు చెందిన సతీష్‌కుమార్‌నాయక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త స్వగ్రామానికి తిరిగి రావడంతో వీరి సంబంధానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఎలాగైనా హరీష్‌ను హతమార్చాలనుకున్నారు. ఈ క్రమంలో సతీష్‌కుమార్ తన స్నేహితులైన రామకుప్పం మండలం, వీర్నమలతండా, టేకుమానుతండాలకు చెందిన అనీల్‌కుమార్‌నాయక్, శ్రీధర్‌నాయక్, చరణ్‌కుమార్‌నాయక్, బాలాజీనాయక్‌తో రూ.5 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరికి రూ.30 వేల అడ్వాన్సు సైతం ఇచ్చారు. చదవండి: (నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా...) తరువాత పథకం ప్రకారం స్నేహ భర్త హరీష్‌కుమార్‌ను గత సెప్టెంబర్ 25న కంగుంది అటవీ ప్రాంతంలోని కృష్ణాపురానికి వెళ్లి తన స్నేహితురాలి తమ్ముడు డబ్బు ఇస్తాడని తీసుకురావాలని పంపింది. విషయం తెలియని హరీష్‌కుమార్ కృష్ణపురం వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన నలుగురు హరీష్‌ను అతి కిరాతకంగా గొంతుకోసి పొదల్లోకి నెట్టి పరారయ్యారు. అనంతరం 28న స్నేహ తనకేమీ తెలియనట్లు భర్త కనబడటం లేదని కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని సీఐ శ్రీధర్ తన బృందంతో విచారణ చేపట్టారు. స్నేహ, ప్రియుడు సతీష్‌కుమార్, మరో నలుగురు హత్యకు కారణమని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. సీఐ శ్రీధర్, ఎస్ఐలు రామలక్ష్మీరెడ్డి, శివకుమార్లను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. -
‘కుప్పం ప్రజల దెబ్బకు చంద్రబాబు కళ్లు నేలకు దిగాయి’
సాక్షి, చిత్తూరు: నగరి ఎమ్మెల్యే రోజా, సింగర్ ఎస్పీ శైలజ పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం విఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కుప్పం పర్యటనపై విమర్శలు చేశారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు చంద్రబాబు.. కుప్పం చుట్టు గిరగిరా తిరుగుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు.. కుప్పం ప్రజలకు కనీసం మంచి నీటి సౌకర్యం కల్పించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కుప్పంలో ఇల్లుకట్టుకోవాలనే ఆలోచన వచ్చిందంటే.. ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారని అర్థం అవుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకునే చంద్రబాబుకు.. కుప్పం ప్రజలు వాస్తవాలను చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు నెత్తిన ఉన్న కళ్లు నేలకి దిగాయని రోజా పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు అంటున్న చంద్రబాబు వాస్తవాలను గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. కావాలంటే చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు సరదాగా ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రండి.. మీ సరదా వైఎస్ జగన్ తీర్చేస్తాడని రోజా ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్న,కరోనా,వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నప్పటికి.. ఇచ్చిన అన్ని హామీలను వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని రోజా తెలిపారు. సీఎం జగన్.. చంద్రబాబులా కుంటిసాకులు చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదని, ప్రతి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నారని రోజా అన్నారు. అందుకే ప్రజలు సీఎంగా జగన్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని రోజా పేర్కొన్నారు. -
ఎండల్లో పనులకు వెళ్లేది ఉండదని అంటివే.. ఏమై పోతివి బిడ్డా!
‘‘నన్ను కష్టపడి చదివిస్తున్నారు.. బాగా చదివి ఉద్యోగం చేసి నిన్ను, నాన్నని సాకతానమ్మా.. ఎండల్లో పనులకు వెళ్లే పనుండదని అంటివే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా తండ్రీ.. దేవుడా చేతికి అంది వచ్చిన కొడుకును దూరం చేశావే మేము ఏమి చేసేది..’’ అని ఆ తల్లి రోదిస్తున్న తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టారు. కుప్పం మండలం మల్లానూరు వద్ద రైలు కిందపడి గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన విద్యార్థి మృతిచెందాడు. దీంతో మేలుమాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాక్షి, కుప్పం రూరల్/ గంగవరం: కుప్పం మండలంలోని మల్లానూరు వద్ద శనివారం రైలు నుంచి జారి పడి విద్యార్థి మృతిచెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కథనం మేరకు.. గంగవరం మండలం మేలుమాయి క్రాస్ పూజారిండ్లులో ఉంటున్న మురుగేష్, మంజుల దంపతుల కొడుకు రోహిత్ (20) నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎన్‌బీకేఆర్‌ఎన్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుప్పంలోని వైసీ జేమ్స్ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునేందుకు శనివారం ఉదయం తిరుపతిలో రైలు ఎక్కాడు. కుప్పం మండలం మల్లానూరు వద్దకు రాగానే డోర్ వద్ద ఉన్న రోహిత్ అదుపు తప్పి రైలు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..) కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఉద్యోగం చేసి బాగా చూసుకుంటానని చెప్పిన కొడుకు రోహిత్ దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులతోపాటు తమ్ముడు కిశోర్, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని ఇరుగుపొరుగు వారు ఓదార్చే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. రోహిత్ తండ్రి మేస్త్రీ పనులు చేస్తుంటాడు. తల్లి వ్యవసాయ కూలి. తమలా కష్టాలు పడకూడదని వారు పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నారు. రోహిత్ కూడా చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. పదవ తరగతి వరకు కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో చదువుకున్నాడు. తర్వాత కుప్పం వైసీ జేమ్స్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం నాయుడుపేట ఎన్‌బీకేఆర్‌ఎన్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుప్పం వద్ద రైలు కింద పడి మృతిచెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చినా చదువుపైనే శ్రద్ధ చూపేవాడని, మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని చెప్పేవాడని, ఇలా శాశ్వతంగా దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇలాంటి ప్రభుత్వం ఉండడం మన ఖర్మ
కుప్పం : ఏ రాష్ట్రంలోనూ ఇంత దౌర్భాగ్య ప్రభుత్వం తాను చూడలేదని, ప్రభుత్వంలో పనిచేసే చీఫ్ సెక్రటరీలే ప్రభుత్వ తీరుపై బహిరంగ ఆరోపణలు చేయడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రమౌళి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చీఫ్ సెక్రటరీ అజయ్ కలాం బాహాటంగా ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారని తెలిపారు. కుప్పం అభివృద్ధిపై గతంలో రెండు సార్లు చంద్రబాబుకు లేఖలు రాశామని, అవి ఆయనకు చేరిందో లేదో తెలియదు కానీ, ఈసారి ప్రజల సమక్షంలో బహిరంగంగా సీఎం నియోజకవర్గ అభివృద్ధిపై లేఖ రాస్తానని తెలిపారు. ఏ నియోజకవర్గంలో లేని సంస్కృతి కుప్పంలో చోటుచేసుకుందని విమర్శించారు. హెచ్చుమీరుతున్న ఆగడాలు... ‘డీకేటీ భూములు, పట్టాలు, ప్రభుత్వ కార్యాలయల్లో ఏ పార్టీకి చెందినవారో తెలుసుకుని పనులు చేస్తారా..? దేవాలయ భూములను ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తారా..? మార్కెట్ యార్డు నిర్మాణంలో భూ వివాదంపై ప్రభుత్వ స్పందన ఏది..? అధికార పార్టీ వ్యక్తులు కాకపోతే వారిపై తప్పుడు కేసులు విధిస్తారా..? ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న తతంగ’మన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారిని ఎవర్నీ వదిలి పెట్టేది లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరకడం లేదని, ప్రతి విషయానికి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రం అష్టకష్టాల్లో ఉంటే బాబు సింగపూర్ టూర్ వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి సింగపూర్‌కు అనేక విమానాలున్నా ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నట్లు డ్రామాలు సృష్టించి ఢిల్లీలో ఆయనకు కనపడకుండా దాగుడుమూతలు ఆడి తిరిగి రాలేదా? అని విమర్శించారు. వినుగొండ దగ్గర కియో కార్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా 40 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తుందని, ఇలాంటి ఫ్యాక్టరీని కుప్పంలో ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మరుగుదొడ్లును కూడా కాంట్రాక్టర్లకు అమ్ముకుని అధికా ర పార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఆయన వెంట రామకుప్పం, గుడుపల్లె కన్వీనర్లు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసమూర్తి, గోవింద, శరవణ ఉన్నారు. -
చలించిన పసి హృదయూలు
కుప్పంరూరల్ ధనార్జనే ధ్యేయం గా కాలంతో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక యుుగంలో పసి హృదయూలు వూనవత్వానికి వూరుపేరుగా నిలిచాయి. వుండల పరిధిలో ని కాలనూరు గ్రావుంలో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. ప్రవూదవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ వాన రం గాయుపడింది. చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే వానరం పడుతున్న బాధను గమనించిన కొంతమంది చిన్నారులు సపర్యలు చేశారు. గాయూలకు పసుప్పొడి పూశారు. తినడానికి తీసుకున్న వుురుకులు, పెప్పరమింట్లను ఆ వానరానికి తినిపించారు. బడికి వెళ్లడం, ఆడుకోవడం తప్ప వురో ప్రపంచం తెలియుని చిన్నారులు చలించిన తీరు అందరి నీ కదిలించింది. పెద్దలుతలదించుకోవడంతో పాటు వారికి అభినందనలు తెలిపారు.