కాటేదాన్ లో అగ్ని ప్రమాదం
కాటేదాన్ (హైదరాబాద్) : కాటేదాన్‌లోని మార్కండేయనగర్లో ఉన్న ఆర్కే ఫుడ్స్ కార్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే....బీహార్‌కు చెందిన కరీంబాయి అనే వ్యక్తి ఆర్కే ఫుడ్స్ నిర్వహిస్తున్నాడు. ఈ పరిశ్రమలో పిల్లలు తినే కుర్కురేలను తయారుచేస్తారు. అయితే ఆదివారం తెల్లవారుజామున పరిశ్రమలో షార్ట్‌సర్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సిఉంది.