kurmachalam Anil
-
బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ
రాయికల్(జగిత్యాల): సుమారు రెండువందల సంవత్సరాల పాటు మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ప్రస్తుతం భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపావళి పర్వదినాన ఆయన ఎన్నికవడంపై యూకేలో స్థిరపడిన ప్రవాస భారతీయులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. రిషి ఎన్నికపై ప్రవాసీయులు ‘సాక్షి’తో తమ మనోభావాలు పంచుకున్నారు. వారి మాటల్లోనే.. ఆర్థిక విధానాలతోనే ప్రజాదరణ మాది హైదరాబాద్. నేను ఉద్యోగ రీత్య బ్రిటన్‌లో పనిచేస్తున్నా. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్ర ధానిగా పీఠం అధిరోహించడం ఆనందంగా ఉంది. యూకేలో కరోనా మహమ్మారి సమయంలో రిషి రూపొందించిన ఆర్థిక సంస్కరణలతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆర్థిక విధానాలతో యూకేలో పూర్వ వైభవం తీసుకువస్తారనే ఆశతో ఎన్నుకున్నారు. – సిక్క చంద్రశేఖర్, ఎన్ఆర్ఐ, లండన్ సమర్థవంతంగా పాలిస్తారు మాది నల్గొండ జిల్లా కేతుపల్లి మండలం తుంగతుర్తి గ్రామం. భారత సంతతికి చెందిన రిషి యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో ఆనందంగా ఉంది. ఆయన అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆర్థిక మాంధ్యం నుంచి ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో ప్రజలు, కన్జర్వేటివ్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని సరిదిద్దగల శక్తి రిషికి ఉందనే నమ్మకం ఉంది. – సతీశ్‌రెడ్డి, లండన్ ప్రతిపక్షాలను సమన్వయం చేస్తారు మాది మహబూబాబాద్ జిల్లా కంబంపల్లి. యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలోని సభ్యులకు కేబినేట్లో మంత్రి పదవి ఇచ్చారు. దీనిద్వారా ఆయన రాజకీయ చాతుర్యం యూకేలోని అన్ని పార్టీలకు తెలిసింది. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సత్తా రిషి సునాక్‌కు ఉంది. ఇండియా, యూకే సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. – సతీశ్‌కుమార్, నార్తర్న్ ఐర్లాండ్ మంచి ఆర్థిక నిపుణుడు మాది హైదరాబాద్. బ్రిటన్ ప్రధాని రిషి యూకేలో మాజీ ఆర్థికమంత్రిగా పనిచేశారు. యూకేలో ఆర్థిక సంక్షోభం గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. చిన్నవయసులోనే ప్రధాని కావడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న యూకేకు పూర్వ వైభవం తెస్తారనే నమ్మకం ప్రజలు, నాయకుల్లో ఉంది. – దూసరి అశోక్‌గౌడ్, ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ యూకే ప్రెసిడెంట్ గర్వంగా ఉంది నాది కరీంనగర్ జిల్లా కేంద్రం. మొన్నటివరకు లండన్‌లో ఉద్యోగం చేశా. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉంది. ముఖ్యంగా భారత్, బ్రిటన్ల మధ్య అనేక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. యూకేలో భారతీయులకు ఒక భరోసా నెలకొల్పింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. – కూర్మాచలం అనిల్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ -
లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు
లండన్: అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను టాక్ ఆధ్వర్యంలోలండన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ అజ్మీర్గారేవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వీరవనితలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్‌ను ప్రారంభించారు. లండన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ మహిళలు అంతా ఒకేచోట సమావేశమై కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, టాక్ అధ్యక్షురాలు కంది పవిత్రారెడ్డి, సభ్యులు బుడుగం స్వాతి, జాహ్నవి, శ్రావ్య, సుప్రజ, సుమ, శ్రీలత, విజయలక్ష్మి, ప్రవళిక, ప్రవాసభారతీయులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
రాయికల్(జగిత్యాల): లండన్‌లోని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం కేసీఆర్ 63వ పుట్టిన రోజు సందర్భంగా వెస్ట్ లండన్‌లోని దుర్గాదేవి ఆలయంలో 63 రకాల పూలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. తెలంగాణలో రక్తదాన శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, ఆయన సతీమణి ప్రభలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, అడ్వైజరీ బోర్డు చైర్మన్ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి సృజన్, మీడియా ఇన్చార్జి శ్రీకాంత్, నవీన్‌రెడ్డి, సత్యంరెడ్డి, శ్రీకాంత్, పెద్దిరాజు పాల్గొన్నారు. -
లండన్‌లో కేసీఆర్ దీక్షా దివస్
రాయికల్ : లండన్‌లోని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో కేసీఆర్ దీక్షా దివస్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరై నెహ్రూ విగ్రహం నుంచి సెంట్రల్ లండన్‌లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని గాంధీజీకి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో.. నినాదంతో తలపెట్టిన కేసీఆర్ దీక్షతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ఎన్ఆర్ఐలంతా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, లండన్ ఇన్చార్జి రత్నాకర్, సభ్యులు శ్రీధర్‌రావు, సృజన్‌రెడ్డి, శ్రీకాంత్, సురేశ్, సతీశ్‌రెడ్డి, సంజయ్, వినయ్, నవీన్, బోనగిరి, సత్య, రవి, ప్రదీప్, చింత రంజన్‌రెడ్డి, అశోక్, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.