లండన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
రాయికల్(జగిత్యాల): లండన్‌లోని టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం కేసీఆర్ 63వ పుట్టిన రోజు సందర్భంగా వెస్ట్ లండన్‌లోని దుర్గాదేవి ఆలయంలో 63 రకాల పూలతో ప‍్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. తెలంగాణలో రక్తదాన శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, ఆయన సతీమణి ప్రభలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, అడ్వైజరీ బోర్డు చైర్మన్ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి సృజన్, మీడియా ఇన్‌చార్జి శ్రీకాంత్, నవీన్‌రెడ్డి, సత్యంరెడ్డి, శ్రీకాంత్, పెద్దిరాజు పాల్గొన్నారు.