హెచ్ఆర్సీని ఆశ్రయించిన భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమ మంగళవారం హైదరాబాద్లోని మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అనుకోకుండా జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని విమర్శించారు. ఒకే ఘటనపై మూడు కేసులు నమోదు చేయడం దారణమని అన్నారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని భూమా నాగిరెడ్డి అన్నారు.