kurnool visit
-
కర్నూలులో పవన్‌కు నిరసన సెగ
కర్నూలు/కర్నూలు టౌన్: కర్నూలు పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. బుధవారం కర్నూలు పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను అడ్డుకునేందుకు జేఏసీ నాయకులు కలెక్టరేట్ వద్ద నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు ర్యాలీగా వెళ్లారు. అయితే గాంధీ విగ్రహం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రజలను గూండాలు, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి సిగ్గులేకుండా పోలీస్ బలగాలతో బాలిక కేసును అడ్డుపెట్టుకుని కర్నూలుకు వచ్చారని మండిపడ్డారు. ఆయనకు అమరావతిపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదని దుయ్యబట్టారు. కాగా, జేఏసీ నేతలతో పాటు మరో వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు. మరోవైపు పవన్ సభలో ప్రసంగిస్తుండగా న్యాయవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకొని వస్తుండగా పోలీసులు అడ్డుకుని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
అప్పుడే పవన్ సీమలో అడుగు పెట్టాలి..
సాక్షి, కర్నూలు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనను విద్యార్థి, న్యాయవాదుల జేఏసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వికేంద్రీకరణకు పవన్ మద్దతు తెలిపిన తరువాతే రాయలసీమలో అడుగు పెట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ పర్యటనను అడ్డుకొని తీరుతామని విద్యార్ధి జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాగా నేటి నుంచి రెండు రోజులు పవన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులు, శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి, కోట్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ ప్రసంగించనున్నారు. -
'ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని డీజీపీ రాముడు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందన్నారు. నకిలీ మావోయిస్టులు ఎక్కువయ్యారని డీజీపీ వ్యాఖ్యానించారు. ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు తెలిపారు.