కురుబలు రాజకీయంగా ఎదగాలి
విడపనకల్లు : కురుబలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడమే కాకుండా రాజకీయంగా కూడా ఎదగాలని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు వశికేరి లింగమూర్తి కోరారు. ఎక్కువ మంది కురుబ కులస్తులు ఉన్న జిల్లా, అనంపురం జిల్లా అన్నారు. కురబలకు ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం విడపనకల్లు కురుబ సంఘం మండల అధ్యక్షుడిగా డొనేకల్లు రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈకార్యక్రమంలో కురుబ సంఘం జిల్లా నాయకులు వశికేరి రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.