kurubalu
-
కురుబల సంక్షేమానికి ఫెడరేషన్ కావాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల మందికి పైగా ఉన్న కురుబ సామా జికవర్గం వారి సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్‌ను ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలువురు కురుబ, కురుమ, కురువ సంఘం ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి మారక్కగారి క్రిష్ణప్ప, పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కురుబ నేతలు సోమవారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. వారి సమస్యలన్నింటినీ ఏపీ ప్రతి పక్ష నేత జగన్ సావధానంగా విన్నారు. ప్రమాదం బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు పరి హారం అందేలా కృషి చేస్తామని, తాము అధికా రంలోకి వచ్చాక కురుబ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉగాది చేసుకుంటే మాకు అనర్థమే ...!
► గంగవరదప్ప స్వామి ఆలయానికి ముళ్లకంప . ► రెండు రోజుల పాటు రాగి ముద్ద వేరుశనగ పొడి తినాల్సిందే .. ► స్నానాలు కూడా చేయరాదు . ► కురుబలలో కొంత మందికి ఈ ఆచారాలు తప్పవు . ► ఆచారం అదుపు తప్పితే అపాయమే .. ఆత్మకూరు: ఉగాది ఈ పండుగ పేరు వింటేనే అన్ని రుచులు కలిపి ఉగాది పచ్చడి చేసుకొని ఆలయాలకు కుటుంబాల సమేతంగా వెళ్లి ఆనందంగా గడుపుతారు . పండుగ వారం రోజులు ఉందనగానే బట్టలు తేవడం, ఇళ్లు శుభ్రం చేసుకొవడం వంటి పనులలో బిజీ బిజీగా గడుపుతారు . కాని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో కురుబలు కొంత మంది ఉగాది పండుగ చేసుకుంటే మాకు అనర్థం తప్పక జరుగుతుందని చెబుతున్నారు. కొన్ని శతాబ్దాల కాలం నుంచి వస్తున్న వారి ఆచారాన్ని తూచా తప్పకుండా ఇప్పటికి పాటిస్తున్నారు .కురుబలలో కొంత మంది పిల్లల, ఎబ్బిలి, పూజారి వంటి ఇంటి పేర్లు ఉన్న ఎక్కువగా గంగవరదప్ప స్వామిని ఇంటి దైవంగా భావిస్తారు. కాని ఉగాది రెండు రోజులు ఉందనగానే వారు గంగవరదప్ప స్వామి ఆలయానికి ముళ్ల కంప కొట్టి తాళం వేస్తారు . పండుగ ముగిసే వరకు మూడు రోజుల పాటు ఆలయాన్ని తెరవరు.