
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల మందికి పైగా ఉన్న కురుబ సామా జికవర్గం వారి సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్‌ను ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలువురు కురుబ, కురుమ, కురువ సంఘం ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి మారక్కగారి క్రిష్ణప్ప, పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కురుబ నేతలు సోమవారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. వారి సమస్యలన్నింటినీ ఏపీ ప్రతి పక్ష నేత జగన్ సావధానంగా విన్నారు. ప్రమాదం బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు పరి హారం అందేలా కృషి చేస్తామని, తాము అధికా రంలోకి వచ్చాక కురుబ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.