kurukshetra sabha
-
విజయవాడ వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కావాలా?
♦ కురుక్షేత్ర సభకు అడ్డంకులు సృష్టించారు ♦ ఏపీకి రాకుండా చంద్రబాబుకుట్రపన్నారు ♦ నాకు ప్రాణహాని ఉంది.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హన్మకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు వెళ్లేందుకు పాస్‌పోర్టు తీసుకోవాలా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. ఏపీకి వెళ్లకుండా సీఎం చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణలో రక్షణ ఉంటోందని, కానీ తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 23 ఏళ్లుగా సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడిగా దేశమంతా పర్యటిస్తున్నానని తెలిపారు. పది రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సాగుతోందని పేర్కొన్నారు. కానీ సీఎం చంద్రబాబు తనను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు అనుమతించడంలేదని చెప్పారు. తాను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి తెలంగాణ సరిహద్దులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో వదిలి పెట్టారన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగితే పై నుంచి ఆదేశాలున్నాయని పోలీసులు చెప్పారన్నారు. అరెస్టు చేసినప్పుడు కేసులు పెట్టలేదన్నారు. 8న ఉదయం విజయవాడలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే అక్కడ వేల మంది పోలీసులను మోహరించారని తెలిపారు. 9న వరంగల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు సూర్యపేట నుంచి వస్తుండగా తమను టీఎస్29–4878 కారు వెంబడించిందని తెలిపారు. ఈ కారులో ఎవరు ఉన్నారో తనకు తెలియదన్నారు. కాజీపేటకు రాగానే తనతో ఉన్న వారిని ఆ కారు వద్దకు పంపించి ఆరా తీయగా తాము పోలీసులమని చెప్పారని, ఆధారాలు, గుర్తింపుకార్డులు చూపాలని కోరగానే పారిపోయారని వివరించారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపిందా..? ఇతరులను పంపించారా..? చంద్రబాబు ప్రైవేట్ సైన్యమా..? ఆ వ్యక్తులెవరో తేల్చాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలని, 24 గంటల్లో ఆ వ్యక్తులు ఎవరో తేల్చాలన్నారు. ఈనెల 7న కురుక్షేత్ర మహాసభకు అడ్డంకులు సృష్టించారన్నారు. కోర్టు సభకు అనుమతిచ్చినా సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వలేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని, మానవ హక్కుల కమిషన్, కోర్టుకు వెళతానని చెప్పారు. సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కుమార్‌మాదిగ, పుట్ట రవి, వేల్పుల వీరన్న, నకిరకంటి యాకయ్య, బొడ్డు దయాకర్, పుట్ట భిక్షపతి, సురేందర్, రాజు, నరేష్,ఈర్ల కుమార్, కరుణ పాల్గొన్నారు. -
గుంటూరులో 144 సెక్షన్
గుంటూరు: గుంటూరులో కురుక్షేత్ర సభ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో నేడు జరగనున్న కురుక్షేత్రం మహాసభకు కార్యకర్తలు రాకుండా పోలీసుల ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. సభకు వెళ్లే దారుల్లో పలు చోట్లు పోలీస్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్ట్‌లు చేస్తున్నారు. కృష్ణ జిల్లా నుంచి సభకు వస్తున్న పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నందిగామ, పిడుగురాళ్ల, గూడవల్లి, మాచర్ల ప్రాంతాల్లో పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు అర్బన్ జిల్లా వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుల అరెస్ట్‌లకు, నిర్బంధాలకు భయపడేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లోను కురుక్షేత్ర మహాసభ జరిపితీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సభకు అనుమతి ఇవ్వకపోవడం చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు. అంతకుముందు కురుక్షేత్ర మహాసభ కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులను అనుమతి కోరగా.. అదే సమయంలో ఎమ్మార్పీఎస్ నాయకులకు అనుమతి ఇస్తే అదే ప్రాంతంలో మేము కూడ మహాసభ ఏర్పాటు చేస్తామని మాలమహానాడు నేతలు అనడంతో.. పోలీసులు రెండు వర్గాలకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. -
కురుక్షేత్ర సభను అడ్డుకునే అర్హత సీఎంకు లేదు
గాంధీనగర్ (విజయవాడ) : నవ నిర్మాణ దీక్ష పేరుతో జాతీయ రహదారులను దిగ్బంధనం చేసి సభలను నిర్వహించిన సీఎం చంద్రబాబుకు మాదిగల కురక్షేత్ర సభను అడ్డుకునే అర్హతలేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు అన్నారు. ఈ నెల 7న మందకృష్ణ మాదిగ నిర్వహించే కురుక్షేత్ర మహాసభకు ఏపీ ఎమ్మార్పీఎస్ మద్దతు ఇస్తుందన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలను అణచివేయాలని చూస్తే టీడీపీకి పతనం తప్పదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతం అన్న చంద్రబాబు వర్గీకరణ విషయంలో రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారన్నారు. తెలంగాణాలో టీడీపీ నాయకత్వం వర్గీకరణ చేయాలని బల్లగుద్ది చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం బల్లకింద దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మాదిగలు తమ హక్కుల సాధన కోసం సభలు, సమావేశాలు పెట్టుకుంటే సీఎం జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కురుక్షేత్ర మహాసభకు పెద్దఎత్తున మాదిగలు తరలిరావాలన్నారు. సమావేశంలో ఏమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జెన్నీ రమణయ్య, సువర్ణరాజు, శ్రీరాం దేవమణి, విక్టోరియా, నల్లూరి శేఖర్‌బాబు, రాజా, లక్ష్మణరావు, బాబూరావు పాల్గొన్నారు.