రాజ్యసభలో స్పృహ తప్పి పడిపోయిన కేవీపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో స్పృహ తప్పి పడిపోయారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆదేశాలతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా చైర్మన్ పోడియం వద్ద నిలబడి ఆయన నిరసన తెల్పుతుండడంతో ఆయన అస్వస్థకు గురైయ్యారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా పెద్దల సభలో కేవీపీ తనదైన శైలిలో నిరసన తెల్పుతున్నారు.
నినాదాలేవీ చేయకుండా నిశ్శబద్దంగా నిరసన కొనసాగించారు. 'యువ్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్' అని రాసున్న ప్లకార్లును రెండు చేతులతో ఎత్తి పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద నిలబడి నిరసన తెలిపారు. సభా కార్యకలాపాలు జరిగినంతసేపు కదలకుండా బొమ్మలా నిలబడేవున్నారు. మిగతా పార్టీల ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తించగా, కేవీపీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన నిరసన వ్యక్తం చేయడం విశేషం.