la trobe university
-
షారుక్‌కు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా మెల్బోర్న్కు చెందిన లా ట్రోబ్ యూనివర్సిటీ షారుక్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న షారక్.. మహిళలు, పిల్లల కోసం ‘మీర్’ అనే సంస్థను స్థాపించి.. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షారుక్ కృషిని అభినందిస్తూ.. ‘డాక్టర్ ఆప్ లెటర్స్’ను ప్రదానం చేయనున్నట్లు సదరు యూనివర్సిటీ ప్రకటించింది. త్వరలో మెల్బోర్న్లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకలకు షారుఖ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. డాక్టరేట్‌పై షారుక్ స్పందిస్తూ.. 'లా ట్రోబ్ అనేది ప్రముఖ యూనివర్సిటీ. చాలా కాలంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో సంబంధాలు కొనసాగిస్తుంది. మహిళా సమానత్వం కోసం కృషి చేస్తోంది. అటువంటి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం గౌరవంగా భావిస్తున్నా. నా పేరును సూచించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని పేర్కొన్నారు. వచ్చే నెల 9న బుందూరలోని మెల్బోర్న్ క్యాంపస్‌లో షారుక్‌కు ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేస్తారు. -
అమితాభ్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
బాలీవుడ్ బిగ్ బి అమితాభ్ బచ్చన్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. బిగ్ బి పేరిట ఆస్ట్రేలియాకి చెందిన ఒక యూనివర్సిటీ మేధావి విద్యార్థులకు స్కాలర్ షిప్ ఏర్పాటు చేసింది. మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ లు ఇవ్వడం జరుగుతుంది. అమితాభ్ ఆస్ట్రేలియాలో ఒక భారతీయ చలనచిత్రోత్సవాన్ని ప్రారంభించేందుకు వెళ్లినప్పుడేట టా ట్రోబ్ యూనివర్సిటీ ఈ స్కాలర్ షిప్ లను ప్రకటించింది. తన బ్లాగ్ లో 71 ఏళ్ల నటుడు ఈ అరుదైన గౌరవానికి ఆస్ట్రేలియా లోని విక్టోరియా రాష్ట్ర గవర్నర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత సుదృఢం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత చలనచిత్ర రంగం గురించి ఆస్ట్రేలియన్లకు తెలియచేసేందుకు విక్టోరియా ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 40 భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఫెస్టివల్ శుక్రవారం మొదలై పదకొండు రోజుల పాటు సాగుతుంది.