అమితాభ్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
బాలీవుడ్ బిగ్ బి అమితాభ్ బచ్చన్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. బిగ్ బి పేరిట ఆస్ట్రేలియాకి చెందిన ఒక యూనివర్సిటీ మేధావి విద్యార్థులకు స్కాలర్ షిప్ ఏర్పాటు చేసింది. మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ లు ఇవ్వడం జరుగుతుంది.
అమితాభ్ ఆస్ట్రేలియాలో ఒక భారతీయ చలనచిత్రోత్సవాన్ని ప్రారంభించేందుకు వెళ్లినప్పుడేట టా ట్రోబ్ యూనివర్సిటీ ఈ స్కాలర్ షిప్ లను ప్రకటించింది. తన బ్లాగ్ లో 71 ఏళ్ల నటుడు ఈ అరుదైన గౌరవానికి ఆస్ట్రేలియా లోని విక్టోరియా రాష్ట్ర గవర్నర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత సుదృఢం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత చలనచిత్ర రంగం గురించి ఆస్ట్రేలియన్లకు తెలియచేసేందుకు విక్టోరియా ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 40 భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఫెస్టివల్ శుక్రవారం మొదలై పదకొండు రోజుల పాటు సాగుతుంది.