Labor Department officials
-
కంపెనీ యాజమాన్యంపై కేసు
గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురి మృతికి కారణం కంపెనీని తనిఖీ చేసిన పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు మరొకరి పరిస్థితి విషమం కంపెనీ ఎదుట ధర్నా, భారీ బందోబస్తు చౌటుప్పల్ : మండలంలోని మల్కాపురం శివారులోని శ్రీజయ లాబోరేటరీస్ కంపెనీలో క్లోరోఫామ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతికి కారణమైనందున కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసునమోదు చేశారు. సాయంత్రం 5గంటలకే ప్రమాదం జరిగి, ముగ్గురు మృతిచెందినప్పటికీ, రాత్రి 10గంటల వరకు కూడా మృతిచెందిన విషయాన్ని బయటికి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచడాన్ని నిరసిస్తూ, బుధవారం ఉదయం మల్కాపురం గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. కంపెనీకి తనిఖీల కోసం వచ్చిన పరిశ్రమల శాఖ అధికారులను అడ్డుకోవడంతో, చౌటుప్పల్ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిని పోలీ సులు అదుపులోకి తీసుకుని, భూదాన్ పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చిన్నకుల్లెడ గ్రామానికి చెందిన ఎ.రాజశేఖర్(24) మృతిచెం దినప్పటికీ, ఇతని పేరు బయటికి రాలేదు. ఒరిస్సాకు చెందిన మారుతి అనే వ్యక్తి చనిపోయినట్టు చెప్పారు. దీంతో పోలీసులు ఈయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు బుధవారం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. మృతదేహాలను పరిశీలించారు. పరిశ్రమల శాఖ రాష్ట్ర డెరైక్టర్ కిషన్, జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కేశవులు, శ్రీదేవి, డిప్యూటీ లేబర్ కమీషనర్ కె.భాగ్యానాయక్లు కంపెనీని సందర్శించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా,ఎస్ఐ మల్లీశ్వరి ఆధ్వర్యంలో కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కె.శ్రీని వాసరాజు(33), పి.వెంకట్రాజు(50), కె.చంద్రశేఖర్(34), టి.సత్యనారాయణ(30), రాజుమెహ్ర(22)ల ఆరోగ్యం నిల కడగానే ఉంది. రామారావు(25) పరిస్థితి విషమంగా ఉంది. ఈయన సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం.. కంపెనీలో సంపును శుభ్రం చేయిస్తుండగా, క్లోరోఫామ్ గ్యాస్ లీకై 9మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారు అక్కడ చనిపోయినప్పటికీ, కంపెనీ యాజమాన్యం పోలీసులకు కూడా సమాచారమివ్వకుండా గోప్యంగా ఉంచింది. బుధవారం మృతుల కుటుంబాలను పిలిచి నష్టపరిహారం చెల్లించింది. రాజశేఖర్ కుటుంబానికి రూ.10లక్షలు, మిగతా ఇద్దరి కుటుంబాలకు రూ.8లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్టు తెలిసింది. -
పేలుతున్న నిర్లక్ష్యం.. ప్రాణమే మూల్యం
పరిశ్రమల్లో కార్మికులకు కరువైన రక్షణ రియాక్టర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏడాదిలో దాదాపు 30 మంది మృత్యువాత పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు జిన్నారం : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల్లో 400 పైచిలుకు భారీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ రసాయన పరిశ్రమలే. సుమారు పది వేల మంది పర్మినెంటు, 35 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల్లో 50 శాతం పైగా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు పలువురు కాంట్రాక్టు కార్మికులుగా విధులను నిర్వహిస్తున్నారు. రసాయన పరిశ్రమల్లో పని చేసే వారికి తగిన అనుభవం, అవగాహన నైపుణ్యం తప్పనిసరి కాగా, చాలామంది అవే మీ లేకుండానే విధుల్లోకి చేరిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు.. ప్రమాదమని తెలిసీ జీవనభృతి కోసం ఆయా విధులు నిర్వర్తించడానికి సిద్ధమైపోతున్నారు. కార్మికుల అవసరాన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఆసరాగా తీసుకుని వారి చేత ఇష్టానుసారం పనులు చేయించుకుంటున్నాయి. ప్రాణాలు మింగేస్తున్న రియాక్టర్లు రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు ప్రమాదకరంగా మారాయి. గడచిన ఏడాదిలో దాదాపు 30 మంది కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాతపడినట్టు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. రియాక్టర్లను సరిగా నిర్వహించకపోవడం, వాటి వద్ద అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని విధుల్లో ఉంచకపోవడమే దుర్ఘటనలకు కారణమవుతోంది. కొన్నిసార్లు రియాక్టర్లు పేలి.. ఇంకొన్ని సార్లు వాటిలోకి దిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్టాలకు చెందిన కార్మికులే ఉన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు మృతి చెందితే వారిని రహస్యంగా స్వస్థలాలకు తరలించి యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. నష్టపరిహారం ఊసే లేదు. స్థానికంగా ఉన్న కార్మికులు మృతి చెందితే కార్మిక సంఘాల ఒత్తిడికి తలొగ్గి యాజమాన్యాలు ఎంతోకొంత పరిహారం ఇస్తున్నాయి. కార్మిక శాఖ ఏం చేస్తున్నట్టు? పారిశ్రామికవాడల్లోని కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నా.. కార్మిక శాఖ అధికారులు అందుకు కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. తాజాగా గడ్డపోతారం, బొల్లారం పారిశ్రామికవాడల్లోని రెండు పరిశ్రమల్లో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద కారణాలను వెలికి తీయడంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా?, పరిశ్రమను సక్రమంగా నిర్వహిస్తున్నారా?, అన్ని అనుమతులు ఉన్నాయా?, కార్మికుల భద్రతకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? అనే వాటిపై అధికారులు ఇప్పటికీ దృష్టి సారించిన దాఖలాల్లేవు. అతి తక్కువ వేతనాలకు కార్మికులను విధుల్లోకి తీసుకుని వారి చేత ప్రమాదకర పనులు చేయిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలివే.. ► అనుభవం, నైపుణ్యం గల కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం ► రియాక్టర్లు, ఇతర ప్రమాదకర యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు తగిన రక్షణ పరికరాలను అందించకపోవడం ► భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కార్మిక శాఖ తనిఖీ చేయడం లేదు ► రక్షణ విషయంలో కార్మికులకు ఎప్పటికప్పుడు తగిన అవగాహన కల్పించాలి. అది జరగడం లేదు.