విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
చక్రవర్తి (40) ఐటీ టెక్నికల్ మేనేజర్. శుభ్ర (32) ఐటీ బిజినెస్ అనలిస్ట్. ఈ దంపతులు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం, నాణ్యమైన జీవితం కోరుకుంటూ 2019లో విదేశానికి వెళ్లిపోయి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కెనడా శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 2022 మార్చిలో వీరు టొరంటోకు వెళ్లిపోయారు. ఇదొక్క ఉదాహరణ మాత్రమే.
విద్యార్థులు ఉన్నత విద్య పేరుతో వెళ్లి, కోర్సు ముగిసిన అనంతరం అక్కడే అవకాశాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. ఇక్కడ కెరీర్ మొదలు పెట్టిన వారు కూడా విదేశీ అవకాశాల కోసం అన్వేíÙస్తున్నారు. కానీ, వలసపోవడం అంత సులభ ప్రక్రియ కాదు. దానికి చాలా సమయం తీసుకుంటుంది. అనుకున్న గడువు కంటే ముందుగా ఆరంభించాలి. దీనికి ఎన్నో పత్రాలు సమరి్పంచాలి. ముందస్తు ప్రణాళిక మేరకు నడుచుకుంటే అనుకున్న విధంగా విదేశీయానం సుఖవంతమవుతుంది. ఈ దిశగా ఆలోచన చేసే వారు నిపుణుల సూచనలు తెలుసుకోవడం వల్ల మెరుగైన ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది.
‘ప్యూ రీసెర్చ్’ అధ్యయనం ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉద్యోగ వలసలు భారత్ నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ‘‘2020లో 1.79 కోట్ల మంది అంతర్జాతీయ వలసవాదుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 1.12 కోట్ల మంది మెక్సికో, 1.08 కోట్ల మంది రష్యా మూలాలు కలిగి ఉన్నారు’’అని ‘ప్యూ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. మన దేశం నుంచి ఏటా లక్షల సంఖ్యలో విదేశాలకు వలస పోతున్నట్టు ఈ నివేదికలోని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
‘‘విదేశీయాన ప్రక్రియను ముందుగా ప్రారంభించాలి. అప్పుడు అది సులభతరం అవుతుంది. ఏదైనా ఊహించని ఘటన ఎదురైనా ఎదురుకావచ్చు. మరో ఆరు నెలల్లో వెళ్లాలని అనుకుంటే ఇప్పుడే ఆ ప్రక్రి యను ప్రారంభించాలి’’అనిక్యానమ్ ఎంటర్ప్రైజెస్ సీఈవో క్యాలబ్రెస్ సూచించారు. క్యానమ్ అనేది న్యూయార్క్‌కు చెందిన బహుళజాతి పెట్టుబడుల నిర్వహణ సంస్థ.
వివరాలతో సరైన ప్రణాళిక ఎలా..?
చక్రవర్తి, శుభ్ర 2019లో కెనడా వెళ్లాలని ప్లాన్ చేసుకోగా, 2020లో కరోనా రాకతో ఆలస్యం అయింది. కాకపోతే భారత్‌లో వారు పనిచేస్తున్న కంపెనీయే ఇద్దరు బదిలీకి ఏర్పాట్లు చేయడంతో ఆలస్యమైనా సాఫీగా విదేశానికి తరలిపోయారు. కానీ, ప్రతి ఒక్కరికీ ఇలా జరగాలని లేదు. ‘‘కొందరు విద్యార్థులుగానే విదేశాలకు వెళ్లి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగంలో చేరిపోతారు.
కొందరు స్వదేశంలోనే విద్య పూర్తి చేసుకుని నిపుణులుగా తర్వాత విదేశీ ఉద్యోగానికి వెళ్లిపోతుంటారు. కొందరు వ్యాపారవేత్తలుగా వెళ్లి వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. చివరిగా పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా విదేశీ పౌరసత్వం సొంతం చేసుకోవచ్చు’’అని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన గ్లోబల్‌గేట్ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అభినవ్ లోహియా వివరించారు. విదేశంలో ఉద్యోగం సంపాదించి వలసపోవడం అన్నింటిలోకి ప్రముఖమైనది.
‘ఎక్స్‌పాట్ ఇన్సైడర్ 2021’ సర్వే ప్రకారం విదేశాల్లో పనిచేస్తున్న 59 శాతం మంది భారతీయులు కెరీర్లో మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లినవారే. అంతర్జాతీయంగా ఈ రేటు 47 శాతంగానే ఉంది. ఇలా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో 23 శాతం మంది సొంతంగా ఉద్యోగాన్ని వెతుక్కోగా, 19 శాతం మందిని అంతర్జాతీయ సంస్థలు సొంతంగా నియమించుకున్నాయి. 14 శాతం మందిని వారి సంస్థలే పంపించాయి. కేవలం 3 శాతం మంది వ్యాపారం పేరుతో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు.
బ్రిటన్ను తీసుకుంటే భారత్ నుంచి ఎక్కువమంది స్కిల్డ్ వర్కర్ వీసా ద్వారానే అక్కడికి వెళుతున్నారు. 2022లో భారతీయులు 1,03,000 యూకే వీసాలను సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 148 శాతం ఎక్కువ. 2022లో యూకే జారీ చేసిన వర్కర్ వీసాల్లో 46 శాతం భారతీయులకే దక్కాయి. జాబ్ ఆఫర్ ఉన్న వారికే స్కిల్డ్ వర్కర్ వీసా జారీ చేస్తారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా ఉండాలి’’అని ఏవై అండ్ జే అసోసియేట్స్ డైరెక్టర్ యాష్ దుబాల్ తెలిపారు.
స్టూడెంట్ వీసా ద్వారా విదేశాలకు వెళ్లడం మరో మార్గం. ఇది పరోక్ష మార్గం కిందకు వస్తుంది. సాధారణంగా స్టూడెంట్ వీసా గడువు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ఏడాది గడువుతో కూడిన విజిట్ పాస్ పొందొచ్చు. ఈ కాలంలో ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఉద్యోగం పొందిన ఆరు నుంచి రెండేళ్ల అనంతరం (వివిధ దేశాల్లో వివిధ కాల వ్యవధి) శాశ్వత నివాస హోదా పొందొచ్చు. స్టూడెంట్ వీసా ఖర్చు అన్నది వివిధ దేశాల మధ్య మారిపోతుంటుంది.
కొన్ని దేశాల్లో పౌరసత్వం కొనుగోలు చేసుకోవడం మరొక మార్గం. పరిమితి మేరకు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈబీ–5 వీసా తీసుకోవచ్చు. అమెరికాలో ఈబీ–5 వీసా కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్íÙప్ సర్వీస్ ప్రాయోజిత ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికాకు స్వల్ప వ్యవధిలోనే పౌరసత్వం ద్వారా వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇది. విద్యార్థులు అయితే యూనివర్సిటీ ర్యాంకింగులు చూడాలి. కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వాన్ని పరిశీలించాలి. వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్లేవారు ముందే విజయావకాశాలను అంచనా వేసుకోవాలి.
వ్యయాలు చూడాలి..
ఏ దేశానికి, ఏ రూపంలో వెళ్లాలనే దాని ఆధారంగా ఖర్చు మారిపోతుంది. ఓ కంపెనీలో పనిచేసే నిపుణుడు అదే కంపెనీ ఉద్యోగిగా వేరే దేశానికి వెళ్లేట్టు అయితే టికెట్, రవాణా చార్జీలను పెట్టుకుంటే చాలు. ఇమిగ్రేషన్ చార్జీలను కంపెనీలే భరిస్తాయి. వీసా, లీగల్ ఫీజు వంటి ఇతర వ్యయాలు కూడా ఉంటాయి. ‘‘నా స్నేహితులు కొందరు ఉద్యోగం కోసం ఇక్కడకు (కెనడాకు) వచ్చారు. తగిన ఉద్యోగం వెతుక్కునేందుకు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండాల్సి వచి్చంది. ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ. కనుక ఇక్కడకు వచ్చే వారు ముందుగానే ఈ ఖర్చుల గురించి తెలుసుకోవాలి. అందుకు సరిపడా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుని రావాలి.
తమ ఖర్చులకు సరిపడా డబ్బులున్నట్టు ఆధారాలు కూడా చూపించాలి’’అని శుభ్ర తెలిపారు. కెనడాకు వెళ్లాలంటే ఒక వ్యక్తికి ఎంతలేదన్నా 15,500 కెనడియన్ డాలర్లు కావాలి. అదే దంపతులకు అయితే 21,000 డాలర్లు, పిల్లలతో వెళ్లాలంటే 30,000 డాలర్లు అవసరమవుతాయి. అమెరికాకు వెళ్లాంటే గ్రీన్ కార్డ్ కోసం కనీసం 1.8 మిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. అదే ఆ్రస్టేలియాకు వెళ్లాలంటే నలుగురు సభ్యుల కుటుంబానికి 30,000 నుంచి 40,000 ఆ్రస్టేలియన్ డాలర్లు కావాలి.
‘‘ఈబీ–5 వీసా కోసం పెట్టుబడి వేర్వేరుగా ఉంటుంది. అమెరికా అయితే ఈబీ–5 వీసా ఖర్చు 8 లక్షల డాలర్లు. కెనడా అయితే 12 లక్షల కెనడియన్ డాలర్లు. ఈబీ–5 వీసాకు ముందు లోతైన పరిశీలన ఉంటుంది. సంబంధిత వ్యక్తి చేసే పెట్టుబడులకు మూలాలు, ఎంత మందికి ఉపాధి కలి్పస్తున్నారన్నది చూస్తారు. దీనికి అదనంగా
అమెరికాలో పరిపాలనా, న్యాయపరమైన చార్జీలు 75,000 డాలర్లు అవుతాయి. అటార్నీ ఫీజులు 10,000–20,000 డాలర్లు పెట్టుకోవాలి. అదే యూకే అయితే స్కిల్డ్ వర్కర్ వీసా కోసం దరఖాస్తు ఫీజు 625 నుంచి 1,423 బ్రిటిష్ పౌండ్లు ఉంటుంది. హెల్త్‌కేర్ సర్‌చార్జీ మరో 624 బ్రిటిష్ పౌండ్ల వరకు ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ, హోటల్ తదితర చార్జీలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
వెళ్లే ముందుగా..
‘‘విదేశానికి వలస వెళ్లే వరకు రెండు దేశాల కరెన్సీని దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే కొత్త దేశానికి వెళ్లి సెటిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నివసించే దేశానికి సంబంధించి పన్ను నిబంధనలు, పౌర చట్టాల గురించి తెలుసుకోవాలి. విదేశాల్లో నివాస ప్రమాణాలు చాలా ఎక్కువ. కనుక తగినన్ని నిధులు సిద్ధం చేసుకుని వెళ్లాలి. పెద్ద మొత్తంలో ఖర్చులు ఎదురుకావచ్చు’’ అని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్ రావు సూచించారు. ఇక బీమా తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. చాలా దేశాల్లో దీన్ని తీసుకోవడం తప్పనిసరిగా అమల్లో ఉంది.
తీసుకునే బీమాలో వేటికి కవరేజీ ఉంది, లేనిదీ తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత భారత్‌లో కేవైసీల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా పెట్టుబడులు కలిగిన ఆరి్థక సంస్థలకు విదేశాల్లోని చిరునామా ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా హోదా మార్చుకోవాలి. అప్పుడు స్వదేశంలో పెట్టుబడులు, పన్నుల బాధ్యతలు కొనసాగించుకోవచ్చు. విదేశాలకు తరలిపోయే వారు స్వదేశంలో విలువ తరిగిపోయే ఆస్తులను వదిలించుకుని వెళ్లడమే సరైనది. విలువ పెరిగే రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యతలను ఎవరో ఒకరు చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకుని, అన్నీ విచారించుకుని, తగిన ప్రణాళికతో బయల్దేరితే విదేశీయానం సుఖవంతమవుతుంది.