ఫన్ అండ్ ఫీయర్
లేడీస్ ఎంపోరియం... హైదరాబాద్‌లో గల్లీకి ఒకటి కనిపిస్తుంది. కానీ... ఇప్పుడు జెంట్స్కూ అదే స్థాయిలో స్టోర్స్ పెరిగిపోతున్నారుు. ప్రత్యేకించి మెడలో చైన్లు... చెవులకు లోలాకులు... చేతి వేళ్లకు వింతగొలిపే రింగులు... మణికట్టుకు ఆభరణాలను తలపించే వెరైటీలతో నగరంలో షోరూమ్‌లు వెలుస్తున్నాయి. ఫ్యాషన్, ఫంకీ, ఫన్ అండ్ ఫియర్.. ఇలా అన్నిరకాల మగవాళ్ల యాక్సెసరీస్‌తో ఆకట్టుకొంటున్నారుు. వీటితోపాటు పార్టీలో ట్రెండ్ సెట్ చేయూలనుకొనేవారికీ ఎన్నో ఐటమ్స్ వచ్చేశారుు.
సినిమాల్లో కొరియోగ్రాఫర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, డ్యాన్సర్లు ఉపయోగించే విభిన్నమైన ఐటమ్స్‌కు యుువత ఎట్రాక్ట్ అవుతోంది. శ్రీనగర్‌కాలనీలోని ‘ఎఫ్ స్టోర్’ ఇలాంటిదే. ఇయర్ అండ్ పీయర్సింగ్ స్టడ్స్, ఫంకీ థంబ్ రింగ్స్, గాగుల్స్, డాగ్ ట్యాగ్స్, డిఫరెంట్ వాలెట్స్, కౌబాయ్ హ్యాట్స్, స్కార్ఫ్స్, స్టోల్స్, రిస్ట్ బ్యాండ్స్, డెవిల్ వూస్క్లు, ఘోస్ట్ కాస్ట్యూమ్స్, హరర్ పారుుంటెడ్ నెరుుల్స్, వాంపైర్ టీత్సెట్, థీమ్డ్ వాచెస్... ఇలా ప్రతిదీ ఇక్కడ విభిన్నంగా, వినూత్నంగా కనిపిస్తారుు.
- శిరీష, చల్లపల్లి