ladies fighting
-
‘ఇదేం బాదుడు’.. బస్సులో సీటు కోసం మహిళల కొట్లాట(వీడియో)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు కారణంగా బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాలకు ఎన్ని బస్సులు వేసినా సీట్లు సరిపోవడం లేదు. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు ఘర్షణలకు దిగుతున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చెప్పుతో కొట్టుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. హైదరాబాద్ జిల్లాలోని హాకీంపేటకు చెందిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. బొల్లారం స్టాప్ వద్ద ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఓ మహిళ మరో మహిళకు సపోర్ట్ రావడంతో వారి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. సీటు తమదంటే తమ దంటూ గొడవకు దిగారు. మాటలు కాస్త కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు బూట్లతో దాడి చేసుకున్నారు.ఈ సందర్బంగా బస్సు కండక్టర్ వారిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. కండక్టర్ను వారు పట్టించుకోకుండా దాడి చేసుకున్నారు. అనంతరం, చేసేదేమీ లేకపోవడంతో బొల్లారం పోలీస్ స్టేషన్లో బస్ కండక్టర్ ఫిర్యాదు చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బస్సులో సీటు కోసం బూట్లతో కొట్టుకున్న మహిళలుహైదరాబాద్ - హకీమ్ పేట డిపోకి చెందిన ఆర్టీసి బస్సులో.. బొల్లారం స్టాప్ వద్ద ఎక్కి బస్సులో సీట్ కోసం కొట్టుకున్న ముగ్గురు మహిళలుబొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు pic.twitter.com/NXmtKd0tIo— Telugu Scribe (@TeluguScribe) March 16, 2025 Video Credit: Telugu Scribe -
మన్మథుడి కోసం ఇద్దరి ప్రియురాళ్ల కీచులాట..
-
ఆర్టీసీ బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
-
డ్వాక్రా మహిళలు డిష్యుం డిష్యుం
-
డ్వాక్రా మహిళలు డిష్యుం డిష్యుం
డ్వాక్రా మహిళల మధ్య చిచ్చు రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. జుట్టు జుట్టు పట్టుకుని వీరంగం సృష్టించారు. ఇదంతా ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో.. మునిసిపల్ కమిషనర్ చూస్తుండగానే ఆయన సాక్షిగా జరిగిన తతంగం. డ్వాక్రా సంఘాలకు చెందిన మొత్తం 1.80 లక్షల రూపాయల సొమ్మును కొంతమంది స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో 80 వేలను తిరిగి కట్టేశారు. మరో లక్ష రూపాయలు ఇంకా అలాగే ఉంది. డబ్బులు పక్కదోవ పడుతున్నాయంటూ కొంతమంది కలిసి ఓ గ్రూపు నాయకురాలిపై ఆరోపణలు చేశారు. దీనిపై కార్యవర్గ సభ్యులకు తెలియకుండానే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతా కలిసి సమావేశం ఏర్పాటుచేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. దాంతో 28 డ్వాక్రా సంఘాలకు చెందిన దాదాపు 300 మంది మహిళలు ఖమ్మం మునిసిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇందులో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. మునిసిపల్ కమిషనర్ చూస్తుండగానే ఆయన సాక్షిగా కొట్టుకున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. విపరీతంగా జుట్లు పట్టుకుని, పిడిగుద్దులు కురిపిస్తూ కుమ్ములాడుకున్నారు. దీంతో కమిషనర్ వెంటనే లోపలకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వన్ టౌన్ పోలీసులు వచ్చి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు.