
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు కారణంగా బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాలకు ఎన్ని బస్సులు వేసినా సీట్లు సరిపోవడం లేదు. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు ఘర్షణలకు దిగుతున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చెప్పుతో కొట్టుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. హైదరాబాద్ జిల్లాలోని హాకీంపేటకు చెందిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. బొల్లారం స్టాప్ వద్ద ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఓ మహిళ మరో మహిళకు సపోర్ట్ రావడంతో వారి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. సీటు తమదంటే తమ దంటూ గొడవకు దిగారు. మాటలు కాస్త కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు బూట్లతో దాడి చేసుకున్నారు.
ఈ సందర్బంగా బస్సు కండక్టర్ వారిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. కండక్టర్‌ను వారు పట్టించుకోకుండా దాడి చేసుకున్నారు. అనంతరం, చేసేదేమీ లేకపోవడంతో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో బస్ కండక్టర్ ఫిర్యాదు చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బస్సులో సీటు కోసం బూట్లతో కొట్టుకున్న మహిళలు
హైదరాబాద్ - హకీమ్ పేట డిపోకి చెందిన ఆర్టీసి బస్సులో.. బొల్లారం స్టాప్ వద్ద ఎక్కి బస్సులో సీట్ కోసం కొట్టుకున్న ముగ్గురు మహిళలు
బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు pic.twitter.com/NXmtKd0tIo— Telugu Scribe (@TeluguScribe) March 16, 2025
Video Credit: Telugu Scribe
Comments
Please login to add a commentAdd a comment