Lahore Jail
-
భారతీయుడిని చంపిన పాకిస్తాన్ డాన్ హత్య
ఇస్లామాబాద్ : భారత్‌కు చెందిన సరబ్జిత్ సింగ్‌ను జైలులో చంపిన పాకిస్తాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అమీర్ సర్ఫరాజ్‌ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. సరబ్జీత్ సింగ్ ఎవరు? సరబ్జీత్ సింగ్ భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని భిఖివిండ్ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్‌లోకి ప్రవేశించారు. దీంతో గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్థాన్.. ఆయనకు మరణశిక్ష విధించింది. సరబ్జీత్ సింగ్‌పై దాడి చేసిన పాక్ డాన్ అనంతరం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో సరబ్జీత్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, 2013లో భారత్‌లో పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్న పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్జీత్పై దారుణంగా దాడి చేశారు. ఖైదీలు ఇటుకలతో సరబ్జీత్పై దాడి చేయడంతో అతని మెదడులో తీవ్రగాయాలై, చికిత్స పొందుతూ జిన్నా ఆస్పత్రిలో మరణించారు. కాగా, సరబ్జీత్ 23 ఏళ్లు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు శిక్షను అనుభవించారు. దల్బీర్ కౌర్ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం సరబ్జీత్ సింగ్ నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆతని సోదరి దల్బీర్‌కౌర్ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటారని.. ఆయనను విడుదల చేయాలంటూ దల్బీర్ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌జీత్‌ను చూసేందుకు పాకిస్థాన్ సైతం వెళ్లివచ్చారు. దల్బీర్‌కౌర్ గత ఏడాది ఛాతీ నొప్పితో పంజాబ్ అమృత్‌సర్‌కు చెందన ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘సరబ్జీత్’ పేరుతో బయోపిక్ సరబ్జీత్ సింగ్, దల్బీర్‌కౌర్ జీవితాల ఆధారంగా బాలీవుడ్లో ‘సరబ్జీత్’ బయోపిక్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ దల్బీర్ పాత్రలో నటించారు. -
గుండెపోటుతో కిర్పాల్ సింగ్ మృతి: పాకిస్థాన్
న్యూఢిల్లీ: భారత ఖైదీ కిర్పాల్ సింగ్ గుండెపోటుతో మృతి చెందాడని కేంద్ర ప్రభుత్వానికి పాకిస్థాన్ సమాచారం అందించింది. లాహోర్ జైల్లో రెండు రోజుల క్రితం కిర్పాల్ సింగ్ మృతి చెందాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 2.55 ప్రాంతంలో కిర్పాల్ గుండెపోటుతో మృతి చెందాడని పాక్ ప్రభుత్వం తమకు తెలిపిందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 25 ఏళ్లుగా లాహోర్ జైల్లో కిర్పాల్ సింగ్ శిక్ష అనుభవిస్తూ మరణించాడు. కిర్పాల్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టికి కేంద్రం తీసుకెళ్లింది. కేంద్రం ఆదేశాలతో పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న జేపీ సింగ్ బుధవారం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కిర్పాల్ మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
బందీగా ఉన్న రమేశ్‌పై హోశాఖ ఆరా
-
లాహోర్ జైల్లో... ఈ రమేష్ ఎవరు ?
ఖమ్మం : పాకిస్థాన్‌లోని లాహోర్ జైలులో మగ్గుతున్న రమేష్ (20) వివరాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పాక్ సరిహద్దు రేఖ దాటి పాకిస్థాన్ భూభాగంపై అడుగిడిన నేరానికిగాను అతడిని అక్కడి సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని లాహోర్ జైలులో నిర్బంధించారు. ఖైదీలను ఇచ్చిపుచ్చుకునే విషయమై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అక్కడి జైలులో ఉన్న రమేష్ వివరాలను పాక్ ప్రభుత్వం మన దేశ కేంద్రం హోంమంత్రిత్వశాఖకు అందజేసింది. ఆ వివరాలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు కేంద్రం పంపింది. రమేష్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అని ఉంది. కానీ, అతని వివరాలు అక్కడ లభించలేదు. దీందో అతడి ఫొటోలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పోలీసు శాఖ పంపించింది. ఇతడి ఎత్తు ఐదు అడుగులు ఏడు అంగుళాలు ఉన్నాడని, మెడపై పుట్టు మచ్చ ఉందని పాక్ పంపిన వివరాల్లో ఉంది. ఇతనిని ఎవరైనా గుర్తించినట్లుయితే తన సెల్ సెంబర్ ((94407 95318)కు తెలపాలని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ తెలిపారు.