Lakes Protection
-
KTR: ఆక్రమణలపై ‘ట్రిపుల్ ఆర్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ‘ట్రిపుల్ ఆర్’ అస్త్రం ప్రయోగించనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణా భివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడిం చారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యు లు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, అక్బరుద్దీన్ తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలోని చెరువులు దశాబ్దాలుగా కబ్జాలకు గురవడంతో అవి కుంచించుకుపోయా యని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నవాటిని పరిరక్షిస్తామని, తర్వాత ఆక్రమణలు తొలగించి సుందరీ కరిస్తామని మంత్రి తెలిపారు. చెరువుల పరిరక్షణలో భాగంగా ట్రిపుల్ ‘ఆర్’ విధానాన్ని అమలు చేస్తామని, ఆక్రమణల తొలగింపు(రిమూవ్), పున రావాసం(రిహాబిలిటేషన్), తిరిగి ఆక్రమణ కాకుండా నిలిపివేయడం(రిటైన్) పద్ధతిలో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి చెరువు పరిరక్షణకు మాస్టర్ ప్లాన్ నగరంలోని ప్రతి చెరువుకూ ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ప్రత్యేక కమిషనర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని కేటీఆర్ పేర్కొ న్నారు. చెరువుల సుందరీకరణలో భాగంగా మురు గునీటి శుద్ధీకరణ కోసం 31 ఎస్టీపీలు రెండేళ్లలో నిర్మిస్తామని, వీటిని ఎఫ్టీఎల్ బయట ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధి లోని 127 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు తయా రు చేశామని, ఇందులో 48 చెరువుల అభివృద్ధి దాదాపు పూర్తయిందని వెల్లడించారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.407.30 కోట్లు మంజూరు కాగా, వీటిలో రూ.218 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. -
కొలనుకు కొలువు
‘మై ఎర్త్ మై రెస్పాన్సిబులిటీ’ పేరుతో నగరవాసులకు ముఖ్యంగా విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నారు హైదరాబాద్ నివాసి మధులిక. గత కొంత కాలంగా నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రకృతిని అర్థం చేసుకోవడం, పర్యావరణ హితమైన చర్యల ఆవశ్యకతను యువతకు చెబుతున్నారు. ప్రముఖులూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. యువతను పర్యావరణ పరిరక్షణ దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నారు మధులిక. గుండె ‘చెరువై’ంది... రాజస్థాన్‌లోని పిలానీలో జన్మించిన మధులిక సింగపూర్ వెళ్లడానికి ముందు ఐసిఎఫ్ఐఐ, శారదా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సింగపూర్ వెళ్లి భారతదేశానికి తిరిగివచ్చినప్పుడు హైదరాబాద్‌లో స్థిరపడటానికి నిర్ణయించున్నారు 37 ఏళ్ల మధులిక. తొలుత పర్యావరణం కోసం మాత్రమే పనిచేయాలనుకున్నారు. మొదట్లో స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఉత్పాదక వనరుల గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన కలిగించేవారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న నెక్నంపూర్ చెరువు దుస్థితి చూసినప్పుడు ఆమె ఆలోచన చెరువుల అభివృద్ధివైపు మళ్లింది. ‘‘మనకు ప్రాణాధారమైనవి, నిర్లక్ష్యానికి గురవుతున్నవాటిలో నదీజలాలు, సరస్సులు, చెరువులు ప్రధానమైనవి. దీనివల్ల నీటి ఆధారంగా బతికే ఎన్నోరకాల జీవులు అంతరించిపోతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల మానవ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉంది. ఒక్క అడుగుతో మొదలు.. నగరాల్లోని చెరువులను కాపాడుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి. ఇప్పటికే చాలా చెరువులు కబ్జాదారుల కోరల్లోనే ఉన్నాయి. ఉన్న చెరువులు చెత్తా చెదారం, కాలుష్యంతో నిండి ఉండేవి. వాటి దగ్గరకు వెళ్లాలన్నా ఆ దుర్గంధానికి నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. అలాంటి చెరువులను శుభ్రం చేయాలి. అందంగా తీర్చిదిద్దాలి.. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో సమాజంలో ఒక కొత్త దృష్టికోణం తీసుకురావడానికి 2014 నవంబర్‌లో ధ్రువాంశ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ‘ధ్రువ్ అంటే తార. చీకటిలో ఉన్నవారికి మార్గం చూపిస్తుంది’ అని అర్థం. ‘మై ఎర్త్ మై రెస్పాన్సిబిలిటీ’ అనే నినాదంతో విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికి జీవవైవిధ్యం ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. చేస్తున్న పని సమాజానికి ఉపయోగపడేదైతే నలుగురూ వచ్చి చేరుతారనడానికి ధృవాంశ్ ఉదాహరణగా నిలిచింది. ఈ సంస్థలో కొంతమంది భాగస్వాములుగా చేరారు. కాలుష్యకారకాలైన చెత్తను తొలగించడం, బురదగా ఉన్నచోట మట్టి పోయడం, ఇళ్లలోని వేస్ట్‌ను కంపోస్ట్ ఎరువుగా మార్చడం, చెరువుల చుట్టూ మొక్కలు నాటడం చేస్తున్నాం. నీటిపై తేలియాడే వ్యవసాయ క్షేత్రాలు హైదరాబాద్ నగరానికి చేరువలో 450 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నెక్నెంపూర్ లేక్ ఇప్పుడు జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా పేరుగాంచింది. ఈ సరస్సు అభివృద్ధి అంత సులువుగా జరగలేదు. అందుకు తగిన శ్రమ చేయడంతో నేడు అనుకూల ఫలితాలు వచ్చాయి. ముందు చెరువు ప్రాంతం కబ్జాకు గురికాకుండా అక్రమార్కులకు అడ్డుకట్ట వేశాం. ఈ క్రమంలో బిల్డర్లు లంచం ఇవ్వడానికి వచ్చిన పరిస్థితులూ ఉన్నాయి. ఈమెకెందుకీ పని అన్నట్టు చాలామంది అనుమానంగా చూసేవారు. కొన్ని బెదిరింపులూ రాకపోలేదు. కానీ, వెనక్కి తగ్గలేదు. పచ్చదనం, పరిశుభ్రతను సాధించాం. హెచ్.ఎమ్.డిఎ తో కలిసి నీటిపై తేలియాడే వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేశాం. ఇందులో కూరగాయలు, పూల మొక్కలతో ఆకర్షణీయమైన పచ్చదనాన్ని తీసుకువచ్చాం. దేశంలోనే నీటిపై తేలియాడే ఈ వ్యవసాయ క్షేత్రం అతి పెద్దదిగా పేరొందింది. ఈ చెరువును నేను కాదు ఎంచుకున్నది, నన్నే ఈ చెరువు ఎంచుకుంది అని భావిస్తాను’ అని చెప్పారు మధులిక. నెక్నంపూర్ చెరువు పునరుద్ధరణకు పాటుపడినందుకు అనేక పర్యావరణ అవార్డులు గెలుచుకున్నారు మధులిక. పట్టణంలోని చెరువులన్నింటినీ అభివృద్ధి చేయడానికి, విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన తీసుకు రావడానికి నిరంతరం పాటుపడుతున్నారు. ఆమె లక్ష్యం సిద్ధిస్తే ఒకనాడు లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ కి పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది. – నిర్మలారెడ్డి -
కాలుష్య కాసారాలు!
కందనూలు : జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం, నాగనూల్ చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పట్టణం నుంచి వెలువడే మురుగును మొత్తం ఈ చెరువుల్లోకి మళ్లించడంతో తమ అసలు స్వరూపాన్ని, వైభవాన్ని కోల్పోతున్నాయి. పట్టణం విస్తరించడం, జనావాసాలు పెరుగుదల నేపథ్యంలో నిత్యం వందల లీటర్ల మురుగు వెలువడుతోంది. మినీ ట్యాంక్‌బండ్‌గా కేసరిసముద్రం కేసరి సముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి కృషితో ప్రభుత్వం రూ.8కోట్లు నిధులు కూడ మంజూరు చేసింది. దీనితో చెరువు కట్ట విస్తరణ, చెరువు మధ్యలో విగ్రహం, పచ్చిగడ్డి పరచడం వంటి పనులు జరుగుతున్నాయి. కాని పట్టణంలో నుండి చెరువులోకి వచ్చే మురుగు నీరుకు అడ్డుకట్ట వేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల మురికి కుంపాలా తయారవుతోంది. ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి.. ప్రసిద్ధిగాంచిన కేసరి సముంద్రం చెరువు మరో ట్యాంకు బండ్‌గా మారక ముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెరువులో కలుస్తున్న మురుగును శుద్ధి చేసేందుకు ప్లాంట్ పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నాగనూలు పంచాయతీ పరిధిలోని నాగనూలు చెరువు దుర్గంధభరితంగా మారింది. కాలకృత్యాలు తీర్చుకోవడం, జంతుకళేభరాలను పారవేయడం వల్ల మరీ అధ్వానంగా మారింది. పాలకులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
చెరువుల్లో మట్టిని ఎలా తరలిస్తారు?
అలా చేస్తే చెరువుల రక్షణ మాటేమిటి? హైకోర్టు మండిపాటు సాక్షి, హైదరాబాద్: జగిత్యాల నుంచి నిజామాబాద్‌కు కొత్తగా తలపెట్టిన బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణం కోసం సమీపంలో ఉన్న చెరువుల్లోని మట్టిని సదరు కాంట్రాక్టర్ అనుమతి లేకుండా తరలిస్తుండటంపై హైకోర్టు మండిపడింది. ఇలా చేస్తే చెరువుల రక్షణ మాటేమిటని ప్రశ్నించింది. అలా ఎంత మట్టిని కాంట్రాక్టర్ తరలించారో చెప్పాలని రైల్వే అధికారులను ఆదేశించింది. అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వేలైన్ నిర్మాణం కోసం సంబంధిత కాంట్రాక్టర్ నిజామాబాద్ జిల్లా మక్ల్కూర్ మండల పరిధిలోని సింగ సముద్రం, లోలం చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్నారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ పి.నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని పలుమార్లు విచారించిన ధర్మాసనం గతవారం మరోసారి విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అనుమతుల్లేకుండా చెరువుమట్టిని తరలించినందుకు కాంట్రాక్టర్‌పై చర్యలు మొదలు పెట్టామని, రూ.85 లక్షలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. మట్టి తరలింపుపై ప్రభుత్వ, రైల్వే లెక్కల మధ్య తేడా ఎందుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వ, రైల్వేశాఖ న్యాయవాదులను ఆదేశించింది.