Lalit Kumar
-
విజయ్ పుట్టినరోజు.. నిర్మాత ప్రత్యేక కానుక.. నెట్టింట వైరల్..
చెన్నై సినిమా: దళపతి విజయ్ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకు పండుగ కంటే ఎక్కువ. ఆలయాల్లో పూజలు, అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకుంటారు. సినీ నిర్మాతల శుభాకాంక్షల ప్రకటనలతో హోరెత్తిస్తుంటారు. కాగా ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు. దీంతో అభిమానుల హంగామా ఇప్పటికే మొదలైంది. ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్‌కుమార్ కోలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాతగా రాణిస్తున్నా రు. ఇటీవల ఆయన మహాన్, కాత్తువాక్కల రెండు కాదల్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తాజాగా చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నిర్మిస్తున్న కోబ్రా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే నటుడు విజయ్ అంటే లలిత్‌కుమార్ చాలా అభిమానం. గత 2020 నుంచి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా సీడీ (కామన్ డిజైన్)లను విడుదల చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. అదే విధంగా ఆదివారం విజయ్ కామన్ డిజైన్‌ను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాకుండా విజయ్ బర్త్‌డేకు సంబంధించి ఓ ప్రత్యేకమైన వీడియోను సోమవారం (జూన్ 20) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరో విశేషం ఏమిటంటే విజయ్ 67వ చిత్రాన్ని లలిత్కుమారే నిర్మించబోతున్నారు. చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. தளபதியின் நாளைய தீர்ப்பு முதல் மக்களின் இன்றைய தீர்ப்பு வரை 🔥♥️ Presenting you all the #ThalapathyBirthdaySpecialPoster 💥 Advance birthday wishes to our dear most #Thalapathy @actorvijay Sir 🎂♥️ pic.twitter.com/c8sLsUptSy — Seven Screen Studio (@7screenstudio) June 19, 2022 We are not done yet, #ThalapathyBirthdaySpecialVideo from us out tomorrow at 5PM ♥️🔥 On Our YT Channel ➡️https://t.co/oJ5PdYCm5a Celebrating #Thalapathy @actorvijay ♥️🔥 pic.twitter.com/zokv1suhed — Seven Screen Studio (@7screenstudio) June 19, 2022 -
నాకు సంబంధం లేదు
బుల్లితెర నటి నీలాణి ప్రియుడి ఆత్మహత్య కేసులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీలాణికి ఇంతకుముందే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. భర్తను వదిలి పిల్లలతో నివశిస్తున్న నీలాణికి సహాయ దర్శకుడు గాంధీలలిత్‌కుమార్ పరిచయం కావడం, అతనితో ప్రేమ, సహజీవనం చేసిన విషయాలు బయటపడ్డాయి. తిరువణ్ణామలైకి చెందిన గాంధీలలిత్కుమార్కు తల్లిద్రండులు లేరు. అన్నయ్యనే పెంచి పెద్ద చేశాడు. సినిమారంగంపై ఆశతో చెన్నైకి వచ్చిన లలిత్‌కుమార్‌కు నటుడు ఉదయనిధిస్టాలిన్ సంస్థలో పని లభించింది. ఆ తరువాత సహాయ దర్శకుడిగా కొన్ని చిత్రాలకు పని చేశారు. తిరువణ్ణామలై ప్రాంతంలో ఉదయనిధిస్టాలిన్ అభిమాన సంఘం నిర్వాహకుడిగా ఉన్నాడు. కొంత కాలం తరువాత లలిత్‌కుమార్‌కు పని లేకుండా పోయింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో నిలాణీ, లలిత్‌కుమార్‌ను వదిలి ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవల టీవీ సీరియల్ షూటింగ్లో ఉన్న నీలాణి వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామని లలిత్‌కుమార్ ఒత్తిడి చేశాడు. దీనిపై ఆమె మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది లలిత్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇదిలాఉండగా నటి నీలాణితో లలిత్‌కుమార్ అనుబంధాన్ని తెలిపే వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమే.. నటి నీలాణి మంగళవారం సాయంత్రం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి లలిత్‌కుమార్ ఆత్మహత్మకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అనంతనం మీడియా ముందుకు వచ్చి లలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని, అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పానని తెలిపింది. లలిత్‌కుమార్ తన గురించి అసభ్యకరమైన దృశ్యాలను ఫేస్బుక్లో పెట్టడం, వేధించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాకుండా తన వద్ద సొమ్ము తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ కంటతడి పెట్టింది. -
96 శాతం మార్కులు.. మోదీజీ ప్లీజ్ హెల్ప్ మి..
న్యూఢిల్లీ : తనకు జరిగిన అన్యాయంపై జోక్యం చేసుకోవాలని ఓ నిరుద్యోగి ప్రధాని నరేంద్రమోదీని సాయం కోసం వేచిచూస్తున్నాడు. లలిత్ కుమార్ అనే వ్యక్తి 2013 డిసెంబర్లో నిర్వహించిన నార్త్ రైల్వే గ్రూప్-డి పరీక్షకు హాజరయ్యాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఈ విషయంపై ఆర్టీఐని ఆశ్రయించి తనకి 96 శాతం మార్కులు వచ్చినట్లు సమాచారం తెలుసుకున్నాడు. లలిత్ కుమార్ అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తున్నట్లు ఆర్ఆర్సీ అధికారులు వెల్లడించినట్లు న్యూఢిల్లీలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేర్కొన్నారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించినప్పటికీ తప్పుడు మార్గంలో మార్కులు తెచ్చుకున్నట్లు భావించిన కారణంగా అధికారులు అతడిని సెలెక్ట్ చేయలేదట. ఈ సమాచారంపై సంతృప్తిచెందని లలిత్ ఫస్ట్ అప్పలేట్ ఆధికారుకు గత ఆగస్టులో అప్పీలు చేసుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను మోసం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనకు ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. తాను ప్రస్తుతం సోషల్ వర్క్‌లో డిగ్రీ చేస్తూ, ఢిల్లీ రవాణాశాఖలో పనిచేస్తున్నట్లు చెప్పి వాపోయాడు. పేద కుటుంబం నుంచి వచ్చానని, ఈ ఉద్యోగం అనేది తనకే కాదు కుటుంబానికి ఎంతో ముఖ్యమన్నాడు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాస్తానన్నాడు. -
రిజిస్ట్రేషన్..పరేషాన్
డీఆర్ కార్యాలయంలో ఒక ఉద్యోగి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఆదినారాయణ లాంగ్‌లీవులో వెళ్లారు. హెడ్‌క్లర్క్ జయకుమార్ ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి డెప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో డీఐజీ కార్యాలయం నుంచి వచ్చిన సీనియర్ అసిస్టెంట్ రాముడు హెడ్క్లర్క్తోపాటు సొసైటీ రిజిస్ట్రేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. జూనియర్ అసిస్టెంట్ లలిత్‌కుమార్ చిట్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రెండింటి విధులను నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న డీఆర్ పోస్టులు: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలకమైన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలు జిల్లా రిజిస్ట్రార్‌గా ఎన్.మాధవి విధులు నిర్వహిస్తూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తి కేసీ రాముడితో లంచం తీసుకుంటూ గతేడాది ఏప్రిల్ 24న ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెగ్యులర్ డీఆర్ లేక అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ స్థానానికి ఇన్చార్జ్గా ఆడిట్ డీఆర్ అనిల్‌కుమార్‌ను నియమించారు. ఈయన కూడా ఈ ఏడాది మే 31న పదవీ విరమణ పొందారు. దీంతో కర్నూలు డీఆర్ స్థానంతోపాటు ఆడిట్ డీఆర్ స్థానం ఖాళీ అయింది. నంద్యాల డీఆర్‌గా అబ్రహం విధులు నిర్వహిస్తూ ఆరునెలల క్రితం ఒంగోలు డీఆర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో రెండు డీఆర్, ఒక ఆడిట్ డీఆర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కర్నూలు డీఆర్, ఆడిట్ డీఆర్ ఇన్చార్జ్ బాధ్యతలను డిఐజీ గిరిబాబుకు, నంద్యాల డీఆర్ ఇన్చార్జ్ బాధ్యతలు ప్రొద్దుటూరు డీఆర్ గంగిరెడ్డికి అప్పగించారు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల హల్చల్ డీఐజీ, డీఆర్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హల్చల్ చేస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో అధిక సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు బుద్ధిగా విధులు నిర్వహించాల్సిన వారు రోజూ కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, డీఐజీ గిరిబాబుల పేర్లు వినియోగిస్తూ హడావుడి చేస్తూ బంధువులకు, స్నేహితులకు ఆగమేఘాల మీద పనులు చేసిపెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తూ తమ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. వీరితో పాటు ఓ సబ్ రిజిస్ట్రార్ తనకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాగా తెలుసు.. తన మాట వినకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ ఉద్యోగులను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. తన పేరును ఎవరు వాడుకున్నా సహించేది లేదని ఫిర్యాధిదారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఫిర్యాదిదారులు మాజీ మంత్రి మూలింటి మారెప్ప దృష్టికి తీసుకురావడంతో ఆ ఇద్దరి జూనియర్ అసిస్టెంట్లతో పాటు, ఆ సబ్ రిజిస్ట్రార్‌పై కూడా చర్యలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేయండి అంటూ మారెప్ప డీఐజీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. సాక్ష్యాత్తు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఆ శాఖ బాధ్యతలు ఉండడంతో ఆయన ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
పద్మ అవార్డుల సత్కారం