లక్షల కొద్దీ ఎక్కడి నుంచి తెస్తారు?
⇒ గొర్రె పిల్లల పంపిణీ పథకంపై సర్కారును నిలదీసిన కాంగ్రెస్
⇒ నాలుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న గొర్రె పిల్లల సంఖ్యే 60 లక్షలు
⇒ మరి 84 లక్షల గొర్రెపిల్లలు ఇస్తామని ఎలా చెబుతున్నారు?
⇒ మేత కోసం 10% భూమి అవసరం.. రాష్ట్రంలో ఉన్నది 3 %లోపే
⇒ 19వ లైవ్‌స్టాక్ నివేదిక వివరాలను సభ ముందు పెట్టిన వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో 84 లక్షల గొర్రె పిల్లలను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభు త్వం గొప్పగా చెప్పుకుంటోందని, అన్ని లక్షల గొర్రె పిల్లలను ఎక్కడి నుంచి తీసుకొస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. తెలంగాణ చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా అన్ని గొర్రెలు అందుబాటులో లేవని.. దూర ప్రాంతాల నుం చి తెచ్చే అవకాశమూ తక్కువని స్పష్టం చేసిం ది. 19వ జాతీయ లైవ్‌స్టాక్ (పశు సంపద) నివే దిక ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీసింది. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమ యంలో కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలోనే 84 లక్షల గొర్రె పిల్లలను సరఫరా చేస్తామని చెబుతోందని అదెలా సాధ్యమని ప్ర శ్నించారు. ప్రభుత్వం గొర్రె పిల్లలు కొనాలను కుంటున్న ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణా టకల్లో ఉన్న మొత్తం గొర్రె పిల్లల సంఖ్య 60 లక్షల లోపేనని లైవ్‌స్టాక్ నివేదిక స్పష్టం చేస్తోం దని, అలాంటప్పుడు 84 లక్షల గొర్రె పిల్లలను సమకూర్చడం ఎలా సాధ్యమని నిలదీశారు.
ఇలాగైతే పథకం సాధ్యమెలా?
జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫార్సుల ప్రకారం గొర్రెల మేత కోసం 8 శాతం నుంచి 10 శాతం భూమి ఉండాలని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో 2 నుంచి 3 శాతం లోపే అలాంటి భూ మి ఉందని రాష్ట్ర ప్రభుత్వ గణాంకా లే స్పష్టం చేస్తున్నా యన్నారు. మరి గొర్రెలకు మేత ఎలా సమకూరు స్తారని ప్రశ్నించా రు. తుమ్మ చెట్లపై గొర్రెల పెంపకం దారులకు హక్కు కల్పించాలన్న ప్రభుత్వ ఉత్తర్వు అమలు కావటం లేదని.. మిషన్ కాకతీయ పేరుతో చాలాచోట్ల చెరువుల వద్ద ఉన్న తుమ్మ చెట్లను నరికేస్తున్నారని వివరించారు. గొర్రె పిల్లల పంపిణీ పథకంపై ప్రభుత్వం సరైన కసరత్తు చేయలేదని విమర్శించారు.
ఈ పథకం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగినందున గొర్రెల ధరలను భారీగా పెంచి అమ్మే అవకాశం ఉంద ని, దాన్ని ప్రభుత్వం సరిగా డీల్ చేయాలని అధికారపక్ష సభ్యులు ప్రభాకర్, అంజయ్య సూచించారు. వెటర్నరీ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. గొర్రెల పెంపక సంఘాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని, దుబాయికి వెలసవెళ్లి మృత్యువాత పడ్డ వ్యక్తుల కుటుంబాల్లోని మహిళలకు అవకాశం కల్పించాలని శోభ కోరారు.
మనసుంటే మార్గముంటుంది: తలసాని
గొర్రె పిల్లలను 4 పొరుగు రాష్ట్రాల నుంచే కొంటామని, వాటికి కొరత లేదని మంత్రి తలసాని శ్రీని వాసయాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌వి విమర్శలేనని, మనసుంటే మార్గం ఉం టుందని ప్రభుత్వం నిరూపిస్తుందని చెప్పా రు. గొర్రె పిల్లలను కొనేప్పుడే అక్రమాలు జరగకుండా జియో ట్యాగింగ్ చేయిస్తామ ని, బీమా కూడా చేయిస్తామని తెలిపారు.