land aquisition act
-
బలవంతపు భూసేకరణపై రాజధాని రైతుల ఆందోళన
విజయవాడ : భూసేకరణ చట్టం అమలుపై రాజధాని ప్రాంత గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటనపై రాజధాని ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపోరాటం ద్వారా భూ సేకరణను అడ్డుకుంటామని రైతులు అంటున్నారు. బలవంతంగా భూసేకరణ చేస్తే జాతీయ స్థాయిలో మరోసారి భూ పోరాటం చేస్తామని ఆ రైతులు సూచించారు. ఏక పక్షంగా రైతుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ నేతలను కలిసేందుకు అమరావతి రైతులు సిద్ధమవుతున్నారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించేందుకు దళితులు నిర్ణయించుకున్నారు. భూ సేకరణ చట్టం అమలు నిర్ణయంపై రాజధాని ప్రాంత గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. -
జూలై 10 తర్వాత భూ సేక'రణమే': ఏపీ మంత్రి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూసమీకరణను జులై 10 వరకు చేపడుతామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతులు వేసిన కేసులన్నీ కోర్టు కొట్టేసిందని, ఆ రైతులంతా భూసమీకరణ ప్యాకేజీకి ఇష్టపడితే భూములు తీసుకుంటామని నారాయణ వెల్లడించారు. లేనిపక్షంలో వచ్చే నెల 10 తర్వాత భూ సేకరణ చట్టాన్ని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. 9.3 ఫారాలు ఇచ్చిన రైతులెవరూ కొత్తగా పంటలు వేయొద్దని కూడా రైతులకు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం మాట వినకుండా పంటలు వేస్తే ఆ రైతులు ఇబ్బందలు ఎదుర్కొంటారని మంత్రి నారాయణ అన్నారు. -
'ధైర్యం ఉంటే భూసేకరణ చట్టం ప్రయోగించండి'
-
ధైర్యం ఉంటే భూసేకరణ చట్టం ప్రయోగించండి
ఏపీ సర్కారుకు ధైర్యం ఉంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి చూడాలని, ఫలితం ఎలా ఉంటుందో చూడాలని మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాలు చేశారు. ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగిస్తామంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతుల పిటిషన్లో న్యాయం ఉందని కోర్టు భావించినందువల్లే వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం ఎందుకు దగా చేసిందని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని డిసెంబర్ నెలలోనే ఎందుకు ఉపయోగించలేదని అడిగారు. మేథాపాట్కర్, అన్నాహజారే, శివరామకృష్ణన్ తదితరులు ఏ పార్టీకి చెందినవారని ఆర్కే నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ప్రభుత్వం గనక భూసేకరణ చట్టం ప్రయోగిస్తే.. న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.