జూలై 10 తర్వాత భూ సేక'రణమే': ఏపీ మంత్రి | land aquisition starts from july 10, says minister narayana | Sakshi
Sakshi News home page

జూలై 10 తర్వాత భూ సేక'రణమే': ఏపీ మంత్రి

Published Tue, Jun 23 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

జూలై 10 తర్వాత భూ సేక'రణమే': ఏపీ మంత్రి

జూలై 10 తర్వాత భూ సేక'రణమే': ఏపీ మంత్రి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూసమీకరణను జులై 10 వరకు చేపడుతామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతులు వేసిన కేసులన్నీ కోర్టు కొట్టేసిందని, ఆ రైతులంతా భూసమీకరణ ప్యాకేజీకి ఇష్టపడితే భూములు తీసుకుంటామని నారాయణ వెల్లడించారు. లేనిపక్షంలో వచ్చే నెల 10 తర్వాత భూ సేకరణ చట్టాన్ని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు.

9.3 ఫారాలు ఇచ్చిన రైతులెవరూ కొత్తగా పంటలు వేయొద్దని కూడా రైతులకు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం మాట వినకుండా పంటలు  వేస్తే ఆ రైతులు ఇబ్బందలు ఎదుర్కొంటారని మంత్రి నారాయణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement