land Controversy
-
కింగ్‌కోఠి ప్యాలెస్‌పై రగడ
సాక్షి, హైదరాబాద్: నిజాం నవాబ్ పాలించిన ‘కింగ్‌కోఠి’ ప్యాలెస్ వివాదాల్లో చిక్కుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్యాలెస్ వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలివానలా పరిణమించింది. సదరు స్థలం తమదంటే తమదంటూ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ స్థలంలోకి జేసీబీలతో చొరబడ్డ 38 మందిపై సోమవారం నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకీ వివాదం? కింగ్‌కోఠి నజ్రీబాగ్లోని ‘కింగ్‌కోఠి’ ప్యాలెస్‌ను నగరానికి చెందిన ‘నిహారిక ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేటు లిమిటెడ్’ నుంచి కశ్మీర్‌కు చెందిన ‘ఐరిస్ హాస్పిటాలిటీ’ వారు 2019 జనవరి 28న సేల్‌డీడ్ చేసుకున్నారు. అనంతరం మహ్మద్ ఫరీదుద్దీన్ అనే వ్యక్తిని వాచ్‌మన్‌గా నియమించిన ‘ఐరిస్ హాస్పిటాలిటీ’ వాళ్లు.. తిరిగి కశ్మీర్‌కు వెళ్లిపోయారు. ఇటీవల వాచ్‌మన్ ఫరీదుద్దీన్ మృతి చెందడంతో స్థలాన్ని పరిశీలించేందుకు డైరెక్టర్ అర్జున్ ఆమ్లా కశ్మీర్ నుంచి ఈ నెల 4న నగరానికి వచ్చారు. ఆ సమయంలో టోలిచౌకికి చెందిన సయ్యద్ అక్తర్ తన మనుషులతో ప్యాలెస్‌లోకి చొరబడినట్లు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నిహారిక ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేటు లిమిటెడ్’కు సంబంధించిన ‘ఎంఎస్ అగర్వాల్ రియాల్టీ డెవలపర్స్’కు చెందిన రాజేష్ అగర్వాల్, జి.దినేష్‌కుమార్, మరికొందరి డైరెక్టర్ల పేర్లు సయ్యద్ అక్తర్ తెలపడంతో.. వీరిపై ఈ నెల 8న నారాయణగూడ పోలీసులు సెక్షన్ 452, 506, 109, 120బి కింద కేసు నమోదు చేశారు. తాజాగా 38 మందిపై కేసులు.. తాము కొనుగోలు చేసిన స్థలంలో వేరేవాళ్లు రావడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ‘ఐరిస్ హాస్పిటాలికీ’కి సంబంధించిన డైరెక్టర్లు తమ అనుచరులతో కలిసి జేసీబీతో ప్యాలెస్ లోపలికి చొరబడ్డారు. ఈ విషయాన్ని అక్కడున్న వారు పోలీసులకు తెలపగా.. హుటాహుటిన అబిడ్స్ ఏసీపీ కే.వెంకట్‌రెడ్డి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు, క్రైం ఇన్స్పెక్టర్ ముత్తినేని రవికుమార్, ఎస్సైలు సంఘటన స్థలానికి వచ్చారు. లోపలికి చొరబడ్డ సుమారు 38 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరంతా ‘ఐరిస్ హాస్పిటాలిటీ’కి చెందిన వారని తెలిసింది. దీంతో 38 మందిపై ‘ఎంఎస్ అగర్వాల్ రియాల్టీ డెవలపర్స్’కు చెందిన రాజేష్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్యాలెస్‌కు సంబంధించిన స్థలం మొత్తాన్ని నగరానికి చెందిన ‘నిహారిక ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేటు లిమిటెడ్’ వారు ఎవరి నుంచి కొన్నారు? వీరు కశ్మీర్‌కు చెందిన ‘ఐరిస్ హాస్పిటాలిటీ’కి ఏ విధంగా అమ్మారు? అనే విషయాలపై స్పష్టత లేకుండాపోయింది. ఇదే వ్యవహారంపై 2019లో సీసీఎస్ పోలీసు స్టేషన్‌తో పాటు ముంబైలోని వర్లి పోలీసు స్టేషన్లో రాజేష్ అగర్వాల్ ఈ ల్యాండ్ తనదేనంటూ కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేయగా..ఆయా పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. -
ఖాళీ స్థలం విషయంలో వివాదం
చేవెళ్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రహారీ, అంగడిబజారు కాలనీకి మధ్యలో ఉన్న వ్యవసాయశాఖకు కేటాయించిన గోదాం స్థలం విషయంలో వివాదం నెలకొంది. కాలనీవాసులు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు గురువారం పనులు చేస్తుండగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వచ్చి అడ్డుకున్నారు. దీంతో నాయకులు కల్పించుకొని అందరి సమక్షంలో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పారు. వివరాలు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాలకు అంగడి బజారు కాలనీకి మధ్య కొన్నేళ్ల క్రితం వ్యవసాయశాఖ అధికారులు గోదాం నిర్మించారు. అది శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా ఉంది. దీంతో అది కాలనీవాసులకు, అటు పాఠశాల విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఖాళీ స్థలంలోంచి పాములు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో స్థానిక నాయకులు నిర్మాణాన్ని కూల్చివేసి చదును చేశారు. ఖాళీ స్థలం ఉండడంతో తమకు కమ్యూనిటీ హాల్ కావాలని కోరగా సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇటీవల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి పాఠశాల సందర్శనకు వెళ్లినప్పుడు.. ఖాళీ స్థలం విద్యార్థుల మరుగుదొడ్లకు ఆనుకొని ఉందని, దీనిని ఆటస్థలంగా కేటాయిస్తే ఉపయోగంగా ఉంటుందని కోరారు. దీంతో ఎంపీపీ తన సొంత డబ్బులు వినియోగించి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీనికి ప్రహారీ నిర్మించి ఇస్తే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని బుధవారం పనులు చేసేందుకు సామగ్రిని ఎంపీపీ తెప్పించారు. ఈనేపథ్యంలో కాలనీవాసులు ఇది తమకు అనుకూలంగా ఉందని, ఇది అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారని గురువారం కాలనీవాసులు పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వచ్చి పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ స్థలం విషయంలో అటు ఎంపీపీ, ఇటు సర్పంచ్ వేర్వేరుగా హామీలు ఇవ్వడంతో ఈ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అక్కడికి వచ్చిన ఎంపీటీసీ వసంతం, ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, వార్డుసభ్యులు ఇరుర్గాలకు నచ్చజెప్పారు. దీనిపై పెద్దలంతా కలిసి పంచాయతీ ఆధ్వర్యంలో మాట్లాడి స్థలం ఎవరికి కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అప్పటి వరకు నిరీక్షించాలని ఉపాధ్యాయులను, విద్యార్థులను పంపించారు. అయితే, ఈ స్థలం విషయంలో ‘ఎంపీపీ వర్సెస్ సర్పంచ్’ అన్నట్లుగా స్థానికంగా సోషల్ మీడియలో జోరుగా ప్రచారం జరిగింది. చివరకు స్థలం ఎవరికి కేటాయిస్తారనే విషయం ఉత్కంఠగా మారింది. -
ప్రాణం తీసిన భూ వివాదం
సాక్షి, నర్సాపూర్‌రూరల్: భూవివాదంలో దాయదుల మధ్య ఘర్షనలో ఒకరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. నర్సాపూర్ సిఐ సైదులు, ఎస్సై సందీప్‌రెడ్డిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్టిపల్లి గ్రామానికి చెందిన శివ్వన్నగారి శ్రీనివాస్‌గౌడ్ (43)పై భూవివాదంపై దాయదులు వీరగౌడ్, చంద్రకళ, నిఖిల్‌గౌడ్, మధుగౌడ్‌లు కలిసి దాడికి పాల్పడ్డారు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ స్పృహాకోల్పోవడంతో అతన్ని స్థానికులు నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృత్యువాత పడ్డాడు. మృతుని తండ్రి సత్యగౌడ్ పిర్యాదు మేరకు బుధవారం కేసునమోదు చేసుకొన్నారు. గురువారం గ్రామంలో సంఘటన జరిగిన ప్రదేశంలో సీఐ సైదులు, ఎస్సై సందీప్‌రెడ్డిలు అన్ని కోణాలో విచారణ చేపట్టిన అనంతరం దాయదులు వీరగౌడ్, చంద్రకళ, నిఖిల్‌గౌడ్, మధుగౌడ్‌లు కలిసి శ్రీనివాస్‌గౌడ్‌ను కిందిపడేసి పిడిగుద్దులు గుద్దడంతోనే ప్రాణాలు వీడిచినట్లు తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్ మృతదేహన్ని పరిక్షించిన వైద్యులు సైతం చాతి తదితతర బాగలో గుద్దులు తగలడంతోనే మృతిచెందినట్లు నిర్థారించినట్లు చెప్పారు. ఈమేరకు పై నలుగురిపై హత్య కేసు నమోదు చేసి శవానికి పోస్టుమార్టు నిర్వహించిన అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం నాలుగు గంటలకు మృతుడు శ్రీనివాస్‌గౌడ్ అంత్యక్రియలు నిర్వహించారు. భార్య గర్భిణి మృతుడు శ్రీనివాస్‌గౌడ్ ఎప్పుడు ఎవ్వరి జోలికి వెల్లకుండ ప్రశాంతంగా ఉండాడంతోపాటు అందరితో కలుపుగొలుగా ఉండేవాడు, గత రెండేళ్ళ క్రితం శ్రీనివాస్‌గౌడ్ భర్య పురిటినొప్పుల సమయంలో మృత్యువాత పడింది, దీంతో ఏడాది క్రితం నర్సాపూర్ మండల విద్యాధికారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రూపను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రూప గర్భవతి, మందు భార్యకు ఇద్దురు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు విదిచేసిన అన్యాయన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. బుధవారం రాత్రి నుంచి గురువారం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు గ్రామంలో విషాధచాయలు అలుముకొన్నాయి. -
గంటలో ఐజీ ఫోన్ చేస్తడు
సాక్షి, పెద్దపల్లి/హైదరాబాద్: ‘‘నేను.. జూపల్లి కృష్ణారావు మినిస్టర్‌ను మాట్లాడుతున్నా.. ఏం మాట్లాడుతున్నవ్...తమాషా చేస్తున్నవా...గంటలో ఐజీ ఫోన్ చేస్తడు.. ప్రభుత్వమంటే ఏంటో చూపిస్తా..’’అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ సీఐని బెదిరించిన ఫోన్ సంభాషణ వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని భూవివాదం విషయంలో మంచిర్యాల జిల్లా తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డిని బెదిరించిన ఈ ఆడియో కలకలం రేపుతోంది. ‘‘ఏయ్ నీ పేరేంటి.. నీది ఏ స్టేషన్... చెప్పేది విను... ఈ నంబర్‌ను డీజీకి ఫార్వర్డ్ చేస్తా.. ఏం ఆధారాలున్నాయో చెప్పు..’’అని ఆ ఆడియోలో మంత్రి అన్నా రు. శనివారం మంత్రి ఓఎస్డీ వీరారెడ్డికి సీఐ ఫోన్ చేసిన సందర్భంగా ఇది చోటుచేసుకొంది. ముందు వీరారెడ్డి మాట్లాడినా.. సంభాషణ మధ్యలో అకస్మాత్తుగా మంత్రి వచ్చారు. భూ వివాదంలో జోక్యం చేసుకొని స్టే ఇప్పించారని, అవతలి వ్యక్తులకు మద్ద తు పలుకుతున్నారంటూ వీరారెడ్డితో సీఐ వాగ్వాదానికి దిగారు. ‘‘ఆ భూమి మాది కాదని ఆర్డర్ అయినా ఇప్పించండి.. ఇదేం ధ ర్మం... న్యాయం’’అని సీఐ వాదనకు దిగారు. ఈ సమయంలో మంత్రి ఫోన్ తీసుకొన్నారు. ఈ విషయం తెలియక.. సీఐ కూడా కాస్త గట్టిగానే మాట్లాడారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన జూపల్లి తాను మంత్రి జూపల్లి కృష్ణారావును మాట్లాడుతున్నానంటూ మండిపడ్డారు. సూసైడ్ చేసుకుంటాం.. ధర్మారంలోని తన సోదరి కొత్త లక్ష్మికి చెందిన స్థల వివాదంలో అవతలి పార్టీ వారికి వీరారెడ్డి మద్దతు పలుకుతున్నారని, రోజుల తిరబడి తిప్పుకుంటున్నారంటూ సీఐ ఫోన్లో ఆవేదన వ్యక్తంచేశారు. మీ డీజీకి నంబర్ ఫార్వర్డ్ చేస్తానని జూపల్లి చెప్పడంతో.. ‘‘నేను కూడా డీజీకి వివరిస్తా. ఏదైతే అదే అవుతుంది. సూసైడ్ చేసుకొని చస్తం.. ఏం చేస్తాం’’అని సీఐ పేర్కొన్నారు. సీఐపై మంత్రి ఓఎస్డీ ఫిర్యాదు మంత్రి ఓఎస్డీ వీరారెడ్డి సీఐ జనార్దన్‌రెడ్డిపై ఆదివా రం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు, భూమి వ్యవహారానికి సంబంధించిన విషయాలను వివరించారు. తనను సీఐ భయబ్రాంతులకు గురిచేశాడని, వివిధ చానళ్ల లో వస్తున్న కథనాలు అవాస్తవమని, వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. జనార్దన్‌రెడ్డి గత నెల 30 నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇదీ వివాదం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 262 నెంబర్లో నూనె నర్సయ్య అనే వ్యక్తికి 13 గుంటల పట్టా భూమి ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇందులోంచి కోమటిరెడ్డి హన్మంతరెడ్డి అనే వ్యక్తికి ఆరు గుంటల పావు స్థలం విక్రయించాడు. రెండు సంవత్సరాల క్రితం నర్సయ్య మరణించగా ఆయన కుమారుడు నూనె శ్రీనివాస్ పేరిట మిగతా భూమిని మార్పిడి చేశారు. తర్వాత హన్మంతరెడ్డి కూడా ఆరున్నర గుంటల భూమిని తన కూతురు కొత్త లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇటీవలే మరణించాడు. కాగా 2016లో శ్రీనివాస్ ధర్మారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బద్దం మల్లారెడ్డికి ఇందులో నుంచి రెండు గుంటల భూమిని విక్రయించగా.. ఆ భూమికి హద్దులుగా సిమెంట్ పిల్లర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తన సోదరుడు తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డి సహాయంతో లక్ష్మి తన బందువులతో కలిసి వెళ్లి సరిహద్దు రాళ్లను ధ్వంసం చేశారు. ఈ వివాదంలో ఇరువర్గాలపై ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. లక్ష్మి ఆ భూమిలో ఇంటి నిర్మాణం చేసింది. దీంతో శ్రీనివాస్ మంత్రి జూపల్లిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంత్రి పేషీ నుంచి పలుమార్లు ఇరువర్గాలను పిలిపించి విచారణ చేశారు. దీనిపైనే వివాదం నెలకొంది. -
కత్తులతో దాడి చేసుకున్న అన్నదమ్ములు
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, వెంకట్రావు ఇద్దరూ అన్నదమ్ములు. సోదరుల మధ్య ఇంటి స్థలం విషయంలో వివాదం చెలరేగడంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.కోటేశ్వరరావు, ఆయన మామ లక్ష్మయ్యలు కత్తిపోట్లకు గురి కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూముల బదలాయింపులపై అసెంబ్లీలో చర్చ