గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కత్తులతో దాడి చేసుకున్న అన్నదమ్ములు
Published Wed, Jul 27 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, వెంకట్రావు ఇద్దరూ అన్నదమ్ములు. సోదరుల మధ్య ఇంటి స్థలం విషయంలో వివాదం చెలరేగడంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.కోటేశ్వరరావు, ఆయన మామ లక్ష్మయ్యలు కత్తిపోట్లకు గురి కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement