laptop thieves
-
ప్రైవేట్ హాస్టళ్లే టార్గెట్!
రాయదుర్గం: సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దొం గిలించే నలుగురు దొంగలను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 సెల్ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను దొంగిలించే ఓ పాత నేరస్తుడిని కూడా నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 17 ల్యాప్‌టాప్‌లు, 25 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.వెంకటేశ్వర్రావు శుక్రవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలం, లెల్లీనగర్కు చెందిన దగ్గుల నగేశ్ (23) బోరబండలోని అల్లాపూర్‌లో ఉంటున్నాడు. వరంగల్ మండలంలోని చింతల్ గ్రామానికి చెందిన మహ్మద్ హసీఫ్ (23) నగరానికి వలస వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ అల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముంటున్నాడు. మహ్మద్ ఇమ్రాన్ (20) అల్లాపూర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో ఉంటూ పాల్ సీలింగ్ పని చేస్తుంటాడు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన మహ్మద్ ముకీమ్ (23) వెల్డర్. ఈ నలుగురూ కలిసి ప్రైవేటు హాస్టళ్లలో చేరి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు దొంగలించడం ప్రారంభించారు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. కాగా శుక్రవారం తెల్లవారు జాము 5 గంటలకు మాదాపూర్ డీఐ వై. ప్రకాష్‌రెడ్డి, డీఎస్ఐ మన్మథరావు, క్రైం పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగేష్, ఇమ్రాన్లు యమహా ఎఫ్‌జడ్ వాహనంపై కొండాపూర్ వైపు వెళ్తున్నారు. వీరితో పాటు మరో బైక్ పై మహ్మద్ ముకీమ్ కూడా వెళ్తున్నాడు. పోలీసులు వారిని ఆపి వాహన పత్రాలు అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు చేస్తూ 2015లో అరెస్ట్ అయినట్లు తెలిసింది. మారుతాళాలు ఉపయోగించి ద్విచక్ర వాహనాలను చోరీ చేసేవారిని తేలింది. నగేష్, హసీఫ్ల పై మాదాపూర్ పీఎస్‌లో ఏడు కేసులు, కేపీహెచ్బీలో రెండు, గచ్చిబౌలిలో రెండు, రాయదుర్గంలో రెండు, మియాపూర్ ఐదు కేసులు నమోదయ్యాయి. 2018లో బెయిల్ పై విడుదలై మళ్లీ ఇళ్ల లో దొంగతనాలు ప్రారంభించారు. వీరిని అదుపులోకి తీసుకొని మూడు బైక్‌లు, 18 సెల్పోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పీఎస్ పరిధిలో .. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, నర్సారావుపేట మండలం, పెద్ద చెరువు గ్రామానికి చెందిన షేక్ రియాజుద్దీన్ (33) కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతను ప్రైవేటు హాస్టళ్లలో చేరి ఇతర గదులలో ఉండే విద్యార్థులు, ఉద్యోగుల సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి తక్కువ ధరకు విక్రయించి జల్సాలు చేయడం ప్రారంభించాడు. నర్సారావుపేట పట్టణంలో పదవ తరగతి వరకు చదివి కారు, గూడ్స్ లారీలను నడిపేవాడు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతను దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు ఇతడి నుంచి 17 ల్యాప్‌టాప్‌లు, 25 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 14 పీఎస్‌ల పరిధిలో 32 కేసులు .. షేక్ రియాజుద్దీన్‌పై ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 14 పోలీస్ స్టేషన్ల పరి ధిలో 32 కేసులు నమోదయ్యాయి. పాత గుం టూరులో రెండు, నర్సారావుపేట వన్ టౌన్లో 4, నర్సారావుపేట టూ టౌన్లో 9, రూరల్‌లో రెం డు, తె నాలి త్రీటౌ¯Œ, నాగార్జునసాగర్, కూకట్పల్లి, వీకో ట, రాజమండ్రి ప్రకాష్‌నగర్, పంజగుట్ట, నారా యణగూడలో ఒక్కొక్క కేసు, ఎస్ఆర్ నగర్, సరూర్‌నగర్‌లలో రెండేసి కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్టులో మాదాపూర్, నార్సింగి పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఎంతో కృషి చేశారని డీసీపీ అన్నారు. ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, డీఐ లక్ష్మీనారాయణరెడ్డి, డీఐ వై. ప్రకాష్‌రెడ్డి, డీఎస్ఐ మన్మథరావు, ఎస్హెచ్ఓ రమణగౌడ్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది తగిన రివార్డులు అందిస్తామన్నారు. హాస్టళ్ల నిర్వాహకులుఅప్రమత్తంగా ఉండాలి .. సైబరాబాద్ పరిధిలోని ప్రైవేటు హాస్టళ్లలో చేరే వారి పట్ల వాటి నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు కోరారు. హాస్టళ్లలో చేరడానికి వచ్చే వారి ఐడెంటిటీ ఫ్రూప్, సెల్‌ఫోన్ నెంబర్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ఎలాంటి సమాచారం, ఆధారాలు లేని వారిని హాస్టళ్లలో చేర్చుకోవద్దని, అనుమానం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. -
ల్యాప్‌టాప్ బుక్ చేస్తే ఏం వచ్చిందో తెలుసా?
ఆన్లైన్లో మంచి ల్యాప్‌టాప్ చూసుకుని, దాని కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే.. తీరా ఇంటికి పార్సిల్ వచ్చిన తర్వాత ఆ బాక్సులో ల్యాప్‌టాప్‌కు బదులు అందమైన మెటల్ ఫ్రేములో అమర్చిన టైల్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక గ్యాంగు జోక్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఎట్టకేలకు తేలింది. ఆ గ్యాంగుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇలా హై ఎండ్ ల్యాప్‌టాప్‌లను వాళ్లు చోరీ చేసి, అమ్మేసుకుంటున్నారు కూడా. ల్యాప్‌టాప్‌లను చోరీ చేసి, వాటి స్థానంలో సిరామిక్ టైల్స్‌ను ఉంచుతున్నారు. వాటి బరువు కూడా ఏమాత్రం తేడా రాకుండా ఉండేందుకు వాటిని మెటల్ ఫ్రేములలో బిగిస్తున్నారు. ఇలాంటి గ్యాంగులు ఇప్పటివరకు 45 ల్యాప్‌టాప్‌లు చోరీ చేయగా, వాటిలో 28 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆదేశ్ కుమార్ (25), శైలేంద్రకుమార్ (22), సుబోధ్ రాయ్ (34), మిథున్ కుమార్ (22), సనోజ్ కుమార్ (22), జయేష్ పటేల్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. ఒక కార్గో కంపెనీ యజమాని సందీప్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసు స్టేషన్లో డిసెంబర్ 18న కేసు నమోదు చేశామని, తమ వాహనంలో తాము డిసెంబర్ 5న 140 ల్యాప్‌టాప్‌లు లోడ్ చేసి, డెలివరీకి పంపామని, తీరా అవి బయటకు వెళ్లేసరికి వాటిలో 38 ల్యాప్‌టాప్‌లు, వాటి చార్జర్లు కనిపించలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లోపలి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానంతో కల్కాజీ ఏసీపీ అమిత్ గోయల్ దర్యాప్తు చేయగా, డ్రైవర్ ఆదేశ్ కుమార్ మీద మొదట అనుమానం వచ్చింది. అతడిని విచారించగా మిగిలిన గ్యాంగు మొత్తం బయటపడింది. వీళ్లలో జయేష్ పటేల్ పది ల్యాప్‌టాప్‌లు తీసుకుని ముంబై వెళ్లాడని, అతడిని పట్టుకోడానికి గాలింపు జరుగుతోందని డీసీపీ చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులే అతడి టార్గెట్
నెల్లూరు: బస్సుల్లో ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న ఇద్దరు దొంగలను నాల్గోనగర పోలీసులు గురువారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 29 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ నిందితుల వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన బిట్రగుంట సురేష్ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బెంగళూరులోని సటిక్స్–ఎన్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. అప్పటికే వ్యసనాలకు బానిసవడంతో సంపాదన సరిపోయేది కాదు. ఉద్యోగానికి సరిగా వెళ్లకపోవడంతో కంపెనీ అధికారులు అతన్ని మందలించడంతో ఉద్యోగం మానివేశాడు. తక్కువ సమయంలో నగదు సంపాదించి తానే సొంతగా కంపెనీ పెట్టాలని దొంగగా అవతారమెత్తాడు. రాత్రి వేళల్లో చిత్తూరు నుంచి బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు ఎక్కి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు పక్కసీటు సమీపంలోనే కూర్చొనేవాడు. వారితో మాటలు కలిపి వివరాలను సేకరించేవాడు. వారు నిద్రలో జారుకున్న వెంటనే ల్యాప్‌టాప్‌లను అపహరించి మార్గమధ్యలో బస్సు దిగేసేవాడు. ఆ ల్యాప్‌టాప్‌లను అమ్మి సొమ్ము చేసుకునేవాడు. చిత్తూరు పోలీసులు అనుమానంతో అతని కదలికపై నిఘా పెట్టారు. ల్యాప్‌టాప్‌ల చోరీ కేసులో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2014లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ల్యాప్‌టాప్‌లను నెల్లూరు బాలాజీనగర్‌లోని తన బావ లక్ష్మణ్‌రాజు ద్వారా అమ్మడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో నెల్లూరులో ల్యాప్‌టాప్ దొంగతనాలు అధికం కావడంతో నాల్గోనగర పోలీసులు నిఘా ఉంచారు. గురువారం సురేష్ తన బావతో కలిసి ల్యాప్‌టాప్‌ను అమ్మేందుకు ఆచారివీధిలోని అభిరామ్ హోటల్ వద్ద వెళుతుండగా నాల్గోనగర పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరాలు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 9 లక్షలు విలువ చేసే 29 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, నాల్గోనగర ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య, ఎస్ఐలు అలీసాహెబ్, రఘునాథ్ హెడ్‌కానిస్టేబుల్స్ పోలయ్య, సురేష్‌కుమార్, కానిస్టేబుల్స్ మహేంద్రనాథ్‌రెడ్డి, వేణు, రాజేంద్ర, శ్రీకాంత్, శివకష్ణను ఎస్పీ అభినందించారు. రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బి. శరత్‌బాబు, నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, నాల్గోనగర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.