ప్రైవేట్‌ హాస్టళ్లే టార్గెట్‌! | Laptop Thieves Arrested in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ హాస్టళ్లే టార్గెట్‌!

Published Sat, Feb 9 2019 10:33 AM | Last Updated on Sat, Feb 9 2019 10:33 AM

Laptop Thieves Arrested in hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు

 రాయదుర్గం: సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దొం గిలించే నలుగురు దొంగలను మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను దొంగిలించే ఓ పాత నేరస్తుడిని కూడా నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 17 ల్యాప్‌టాప్‌లు, 25 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌రావు శుక్రవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలం, లెల్లీనగర్‌కు చెందిన దగ్గుల నగేశ్‌ (23) బోరబండలోని అల్లాపూర్‌లో ఉంటున్నాడు. వరంగల్‌ మండలంలోని చింతల్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ హసీఫ్‌ (23) నగరానికి వలస వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ అల్లాపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నివాసముంటున్నాడు.

మహ్మద్‌ ఇమ్రాన్‌ (20) అల్లాపూర్‌లోని ఫ్రెండ్స్‌ కాలనీలో ఉంటూ పాల్‌ సీలింగ్‌ పని చేస్తుంటాడు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ముకీమ్‌ (23) వెల్డర్‌. ఈ నలుగురూ కలిసి ప్రైవేటు హాస్టళ్లలో చేరి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు దొంగలించడం ప్రారంభించారు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. కాగా శుక్రవారం తెల్లవారు జాము 5 గంటలకు మాదాపూర్‌ డీఐ వై. ప్రకాష్‌రెడ్డి, డీఎస్‌ఐ మన్మథరావు, క్రైం పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగేష్, ఇమ్రాన్‌లు యమహా ఎఫ్‌జడ్‌ వాహనంపై కొండాపూర్‌ వైపు వెళ్తున్నారు. వీరితో పాటు మరో బైక్‌ పై మహ్మద్‌ ముకీమ్‌ కూడా వెళ్తున్నాడు.  పోలీసులు వారిని ఆపి వాహన పత్రాలు అడగ్గా నిర్లక్ష్యంగా  సమాధానం ఇచ్చారు. దీంతో  ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు చేస్తూ 2015లో అరెస్ట్‌ అయినట్లు తెలిసింది. మారుతాళాలు ఉపయోగించి ద్విచక్ర వాహనాలను చోరీ చేసేవారిని తేలింది.  నగేష్, హసీఫ్‌ల పై మాదాపూర్‌ పీఎస్‌లో ఏడు కేసులు, కేపీహెచ్‌బీలో రెండు, గచ్చిబౌలిలో రెండు, రాయదుర్గంలో రెండు, మియాపూర్‌ ఐదు కేసులు నమోదయ్యాయి. 2018లో బెయిల్‌ పై విడుదలై మళ్లీ ఇళ్ల లో దొంగతనాలు ప్రారంభించారు. వీరిని అదుపులోకి తీసుకొని మూడు బైక్‌లు, 18 సెల్‌పోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

నార్సింగి పీఎస్‌ పరిధిలో ..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, నర్సారావుపేట మండలం, పెద్ద చెరువు గ్రామానికి చెందిన షేక్‌ రియాజుద్దీన్‌ (33) కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతను ప్రైవేటు హాస్టళ్లలో చేరి ఇతర గదులలో ఉండే విద్యార్థులు, ఉద్యోగుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి తక్కువ ధరకు విక్రయించి జల్సాలు చేయడం ప్రారంభించాడు. నర్సారావుపేట పట్టణంలో పదవ తరగతి వరకు చదివి కారు, గూడ్స్‌ లారీలను నడిపేవాడు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతను   దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు ఇతడి నుంచి 17 ల్యాప్‌టాప్‌లు, 25 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

14 పీఎస్‌ల పరిధిలో 32 కేసులు ..
షేక్‌ రియాజుద్దీన్‌పై ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 14 పోలీస్‌ స్టేషన్ల పరి ధిలో 32 కేసులు నమోదయ్యాయి. పాత గుం టూరులో రెండు, నర్సారావుపేట వన్‌ టౌన్‌లో 4, నర్సారావుపేట టూ టౌన్‌లో 9, రూరల్‌లో రెం డు, తె నాలి త్రీటౌ¯Œ, నాగార్జునసాగర్, కూకట్‌పల్లి, వీకో ట, రాజమండ్రి ప్రకాష్‌నగర్, పంజగుట్ట, నారా యణగూడలో ఒక్కొక్క కేసు, ఎస్‌ఆర్‌ నగర్, సరూర్‌నగర్‌లలో రెండేసి కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్టులో మాదాపూర్, నార్సింగి పోలీస్‌ స్టేషన్ల  సిబ్బంది ఎంతో కృషి చేశారని డీసీపీ అన్నారు.  ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, డీఐ లక్ష్మీనారాయణరెడ్డి, డీఐ వై. ప్రకాష్‌రెడ్డి, డీఎస్‌ఐ మన్మథరావు, ఎస్‌హెచ్‌ఓ రమణగౌడ్, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది తగిన రివార్డులు అందిస్తామన్నారు. 

హాస్టళ్ల నిర్వాహకులుఅప్రమత్తంగా ఉండాలి ..
సైబరాబాద్‌ పరిధిలోని ప్రైవేటు హాస్టళ్లలో చేరే వారి పట్ల వాటి నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు కోరారు. హాస్టళ్లలో చేరడానికి వచ్చే వారి ఐడెంటిటీ ఫ్రూప్, సెల్‌ఫోన్‌ నెంబర్‌ తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ఎలాంటి సమాచారం, ఆధారాలు లేని వారిని హాస్టళ్లలో చేర్చుకోవద్దని, అనుమానం ఉంటే వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement