lard venkateswara
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల , నడక దారి భక్తులకు నాలుగు గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మరోవైపు ఉచిత, రూ.100, రూ.500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రూ.50ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. కాగా తిరుమలలో ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,292 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శానానికి పది గంటల సమయం పడుతుండగా, నడక దారి భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు రూ.100, రూ.500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు అందిన సమచారం ప్రకారం ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం -165 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ - 78 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - 109 ఖాళీగా ఉన్నాయి. -
వైభవంగా పుష్పయాగం
-
వైభవంగా ప్రారంభమైన పుష్పయాగం
తిరుమల : అంతర్గత భద్రత, ప్రకృతి వైపరీత్యాల నివారణ, రాజ్యం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో పుష్పప్రియుడైన శ్రీ వేంకటేశుడికి ఏటా చేసే పుష్పయాగం శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 8 టనుల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ పుష్పయాగానికి నిన్ననే అంకురార్పణ జరిగింది. శుక్రవారం మధ్యహ్నాం ఒంటిగంటకు ప్రారంభమైన పుష్పయాగం సాయంత్రం అయిదు గంటల వరకూ కొనసాగనుంది. పుష్పయాగం కోసం ఎనిమిది టన్నుల మేర 20 రకాలకుపైగా పుష్పాలను టీటీడీ సిద్ధం చేసింది. మరోవైపు పుష్పయాగం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ వేకువ జాము రెండు గంటలకు, అభిషేక సేవను మూడు గంటలకు నిర్వహించారు. 5వ శతాబ్దంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడో రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. అర్ధంతరంగా ఆగిపోయిన ఈ పుష్పయాగాన్ని 1980 నవంబర్ 14న తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది.