వైభవంగా ప్రారంభమైన పుష్పయాగం | Pushpa yagam begin at tirumala | Sakshi
Sakshi News home page

వైభవంగా ప్రారంభమైన పుష్పయాగం

Published Fri, Oct 31 2014 1:39 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

వైభవంగా ప్రారంభమైన పుష్పయాగం

వైభవంగా ప్రారంభమైన పుష్పయాగం

తిరుమల : అంతర్గత భద్రత, ప్రకృతి వైపరీత్యాల నివారణ, రాజ్యం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో పుష్పప్రియుడైన శ్రీ వేంకటేశుడికి ఏటా చేసే పుష్పయాగం శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 8 టనుల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తున్నారు.  ఈ పుష్పయాగానికి నిన్ననే అంకురార్పణ జరిగింది.

శుక్రవారం మధ్యహ్నాం  ఒంటిగంటకు ప్రారంభమైన పుష్పయాగం సాయంత్రం అయిదు గంటల వరకూ కొనసాగనుంది. పుష్పయాగం కోసం ఎనిమిది టన్నుల మేర 20 రకాలకుపైగా పుష్పాలను టీటీడీ సిద్ధం చేసింది. మరోవైపు పుష్పయాగం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ వేకువ జాము రెండు గంటలకు, అభిషేక సేవను మూడు గంటలకు నిర్వహించారు.

5వ శతాబ్దంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడో రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. అర్ధంతరంగా ఆగిపోయిన ఈ పుష్పయాగాన్ని 1980 నవంబర్ 14న తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement