అతిపెద్ద వజ్రం దొరికింది..
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో అరుదైన వజ్రం బయటపడింది. బొత్స్వానాలోని ఓ గనిలో ఏ 1111 క్యారట్ల అత్యంత నాణ్యమైన పెద్ద వజ్రం దొరికింది. గత శతాబ్ద కాలంలో దొరికిన వజ్రాల్లో ఇదే పెద్దది కావడం విశేషం.
1905లో దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా సమీపంలో 3106 క్యారట్ల పెద్ద వజ్రం బయటపడింది. పరిమాణంలో ఇది అత్యంత పెద్దది కాగా, తాజా వజ్రం రెండోదని మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రపంచంలోనే నాణ్యత, పరిమాణంలో ఇది రెండో పెద్ద వజ్రమని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా దీని విలువ ఎంతన్నది నిర్ధారించాల్సివుంది. అయితే ప్రపంచంలో చాలా విలువైన వజ్రమని వర్తకులు, మైనింగ్ నిపుణులు చెప్పారు. ఈ వజ్రాన్ని సానబెట్టి తుది మెరుగులు దిద్దిన తర్వాత విలువను అంచనా వేయనున్నారు.