Lashkar-e-Toiba terrorist
-
కశ్మీర్లో లష్కరే కీలక కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా కీలక కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్ హతమయ్యాడు. కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరించే ఇతడి మృతి దక్షిణ కశ్మీర్లో లష్కరేకు కోలుకోలేని దెబ్బగా భద్రతా దళాలు పేర్కొన్నాయి. సోమవారం కార్డన్ సెర్చ్ సందర్భంగా ఉగ్రవాదులు దాగున్న ఇంటికి నిప్పంటుకుంది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒకరిని లష్కరే తోయిబా కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్గా, మరొకరిని రయీస్ దార్గా గుర్తించారు. 2015 నుంచి లష్కరేలో పనిచేస్తున్న సత్తార్‌కు గ్రెనేడ్ దాడులు, లక్షిత హత్యలు వంటి 20కి పైగా ఉగ్ర ఘటనలతో సంబంధముంది. కొన్నేళ్లుగా బలగాల కళ్లుగప్పి తిరుగుతున్న సత్తార్ పై రూ.10 లక్షలు, రయీస్‌పై రూ.5 లక్షల రివార్డున్నట్టు కశ్మీర్ ఐజీపీ వీకే బిర్ధి చెప్పారు. -
కశ్మీర్లో ఉగ్ర దాడి.. పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో పోలీసు అధికారి ఒకరు నేలకొరగగా, సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. ఈ ఘటన పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో తనిఖీల సమయంలో చోటుచేసుకుంది. వీరమరణం పొందిన పోలీసును స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన జావిద్ అహ్మద్ దార్గా గుర్తించారు. క్షతగాత్రుడైన జవానును ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించి, పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఉగ్రదాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాజకీయ పార్టీలు ఖండించాయి. మరోఘటన.. షోపియాన్ జిల్లా బస్కచాన్ ప్రాంతంలో చేపట్టిన కార్డన్ సెర్చ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన షోపియాన్ జిల్లా నౌపొరా వాసి అహ్మద్ భట్ హతమయ్యాడు. -
ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్‌లిస్టుపై... మోకాలడ్డిన చైనా
ఐక్యరాజ్యసమితి: చైనా మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఐరాసలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 అల్–ఖైదా శాంక్షన్స్ కమిటీ కింద మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా గురువారం ప్రతిపాదించాయి. దీన్ని చైనా అడ్డుకుంది. 26/11 ముంబై దాడుల ఉదంతంలో పాత్రధారి అయిన మీర్ తలపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకాలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్లు రుజువు కావడంతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ ఏడాది జూన్‌లో మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్ని కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో బుధవారం ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశానికి దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం ఎస్సీఓ, యాంటీ టెర్రర్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్, ఉగ్రవాద దాడుల్లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణని కూడా ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు -
జమ్మూలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ శివార్లలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్సై) ఒకరు నేలకొరిగారు. కశ్మీపోర్‌లీసులు, సీఆర్పీఎఫ్ కలిసి జమ్మూ శివార్లలోని పంథాచౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి నాకా బందీ చేపట్టాయి. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి, బలగాలపైకి కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పుల్లో ఏఎస్సై బాబూరామ్ నేలకొరగ్గా, ఒక దుండగుడు హతమయ్యాడు. మిగతా వారు కాల్పులు జరుపుతూ బైక్ వదిలి పరారయ్యారు. వెంబడించిన బలగాలు..దుండగులు దాగున్న ధోబీ మొహల్లా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పదేపదే హెచ్చరికలు చేశాయి. పాంపోర్ ప్రాంతానికి వారి సంబంధీకులను అక్కడికి తీసుకువచ్చి, వారి ద్వారా లొంగిపోవాలని కోరినా వినలేదు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తెల్లవారే దాకా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మిగతా ఇద్దరు దుండగులు చనిపోయారు. మృతులను లష్కరే తోయిబాకు చెందిన సకీబ్ బషీర్ ఖాన్‌దే, ఉమర్ తారిఖ్ భట్, జుబైర్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు. ముగ్గురిదీ పాంపోర్ జిల్లా ద్రంగ్‌బల్ ప్రాంతమే. వీరిలో ఖాన్‌దే ఏడాదిన్నర నుంచి కమాండర్‌గా ఉంటూ అనేక నేరాలకు పాల్పడినట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఎల్వోసీ వెంట పాక్ కాల్పులు అసువులు బాసిన జేసీవో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. ఎలాంటి కవ్వింపులేకుండా జరిపిన ఈ కాల్పులకు భారత్ బలగాలు దీటుగా స్పందించాయి. పాక్ వైపు భారీగా నష్టం వాటిల్లిందని సైన్యం తెలిపింది. పాక్ కాల్పుల్లో నాయిబ్ సుబేదార్ రజ్వీందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని సైనిక వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రజ్వీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజ్వీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. -
ఎన్కౌంటర్లో లష్కరే కమాండర్ హతం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ అబు ముసైబ్ హతమయ్యాడు. గురువారం ఉదయం బండిపొర జిల్లాలోని హజిన్ ప్రాంతంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. హజిన్ ప్రాంతంలో పార్రే మొహల్లా అనే గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రత బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రత సిబ్బంది సోదాలు చేస్తుండగా, లష్కరే తోయిబా కమాండర్ వారిపై కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అబు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో స్పెషల్ ఆపరేషన్ గ్రూపు సైనికుడు ఒకరు గాయపడ్డారు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు.