Late Night Party
-
షారుఖ్ బర్త్‌డే పార్టీని అడ్డుకున్న పోలీసులు
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తన 53వ జన్మదిన వేడుకలను జరుపుకున్న షారుఖ్.. బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో రాత్రి పార్టీ ఏర్పాటు చేశారు. తనకు సన్నిహితులైన కొందరు మిత్రులను ఆ పార్టీకి పిలిచారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద శబ్దాలతో కూడిన సంగీతం ఆగక పోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నగరంలోని రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటి గంట తర్వాత పనిచేయరాదనే నిబంధనలున్నాయంటూ కార్యక్రమాన్ని ఆపుచేయించారు. -
అర్ధరాత్రి పార్టీ.. యువతిని ఎత్తుకెళ్లిన క్యాబ్ డ్రైవర్
అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుని, తిరిగి ఇంటికి క్యాబ్‌లో వెళ్తున్న ఓ యువతిని ఆ క్యాబ్ డ్రైవర్ అపహరించి, ఆమెపై శారీరకంగా దాడి చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ విశ్మకర్మ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగింది. బాధితురాలు మరో ఇద్దరు రూం మేట్లతో కలిసి నగరంలోని ఓ క్లబ్లో పార్టీకి వెళ్లింది. పార్టీ ముగుస్తోందనగా ఆ ముగ్గరిలో ఒకరు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. కానీ, ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో క్యాబ్ వివరాలు ఆమెకు రాలేదు. దాంతో క్లబ్ బయటకు వచ్చి క్యాబ్ కోసం చూశారు. ఆ సమయంలో తనను తాను ఉబర్ డ్రైవర్‌గా చెప్పుకొన్న ఓ వ్యక్తి వాళ్ల వద్దకు వచ్చాడు. యువతులలో ఇద్దరు వెనక కూర్చోగా, మరో యువతి ముందు సీట్లో కూర్చుంది. తమను మురళీపురా ప్రాంతానికి తీసుకెళ్లమంటే ఎటునుంచో తిప్పి.. చివరకు విశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతానికి తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. హర్మద హైవే మీద మిలన్ థియేటర్ సమీపంలో టైరు పంక్చర్ అయిందంటూ పక్కకు ఆపాడు. వెనకాల కూర్చున్న ఇద్దరినీ దిగమన్నాడు. వాళ్లు దిగగానే కారులో ఉన్న మరో యువతితో పరారైనట్లు విశ్వకర్మ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ కన్వర్ పాల్ సింగ్ తెలిపారు. కొంతదూరంలో ఒక హోటల్ కనిపించడంతో అక్కడకు వెళ్తుండగా.. పోలీసు పెట్రోల్ యూనిట్ వాళ్లను ఆపి ప్రశ్నించింది. దాంతో వాళ్లు ఏడుస్తూ మొత్తం విషయం చెప్పారు. పెట్రోలింగ్ పోలీసులు గాలిస్తూ వెళ్లగా.. చివరకు దౌలత్పురా ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్ కింద క్యాబ్ పార్క్ చేసి కనిపించింది. పోలీసులను చూడగానే డ్రైవర్ అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలి ముఖం మీద గాయాలు కనిపించాయి. దాంతో ఆమెను లైంగికంగా వేధించేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలిసింది. నిందితుడి ఆచూకీ కోసం నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. -
నెట్లో ఆలింగనం ఫొటో
ఈ మధ్య ఇంటర్నెట్లో ఆలింగన దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ తారల సాన్నిహిత్య దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కారణం పార్టీలు, పబ్‌ల సంస్కృతి పెరగడమే. ఆ మధ్య సంచలన నటుడిగా పేరొందిన శింబు, హన్సికలు ప్రేమలో పడి నైట్‌క్లబ్‌ల్లో ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఇంటర్నెట్లో ప్రచారమై కలకలం రేపాయి. ఆ తరువాత వారి లవ్ బ్రేక్ అప్ అయ్యింది. తాజాగా ధనుష్, త్రిష ఆలింగన దృశ్యాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ధనుష్, త్రిష ఇప్పటి వరకు ఏ చిత్రంలోనూ కలసి నటించలేదు. అయినా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. త్రిష తరచూ ధనుష్‌తో ఫోన్లో మాట్లాడుతారనే ప్రచారం ఉంది. ఇటీవల ధనుష్, త్రిష నైట్‌పార్టీలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఇరువురు మనసులు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఒకరికొకరు గట్టిగా ఆలింగనం చేసుకుని ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆలింగనాల సంస్కృతి ఇప్పుడు సర్వసాధారణంగా మారింది కాబట్టి లైట్‌గా తీసుకోవడమే బెటర్. -
ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సీతమ్మ
-
స్వేచ్ఛానుభూతి
బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని రాత్రి ఒంటి గంట వరకు పొడిగించడంతో నగర వాసులు కొత్త అనుభవాన్ని చవి చూశారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శుక్రవారం ‘స్వేచ్ఛ’ లభించినట్లుగా అనుభూతిని పొందారు. అయితే బార్ల యజమానుల్లో నెలకొన్న గందరగోళం, ప్రజల్లో అవగాహనా లోపం వల్ల తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. చాలా వరకు బార్లు యధావిధిగా 11 గంటలకే మూతపడ్డాయి. రాత్రి సమయం పొడిగింపుపై అవగాహన కలిగిన మందు బాబులు మాత్రం జల్సా చేశారు. తొలి రోజు బాగా వ్యాపారం జరుగుతుందనే అంచనాతో ఉత్సాహంతో ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని పలువురు బార్ యజమానులు తెలిపారు. సమయం పొడిగింపు గురించి తెలియని చాలా మంది అర్ధ రాత్రికే ఇంటికి చేరుకున్నారని చెప్పారు. అయితే మున్ముందు ‘మంచి రోజులు’ ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని చాలా మంది బార్ల యజమానులు తమ రెగ్యులర్ కస్టమర్లకు సమయం పొడిగింపుపై ఎస్ఎంఎస్ల ద్వారా ‘అవగాహన’ కల్పించారు. కాగా అనేక మంది మందు ప్రియులు తొలి రోజున బాగా ఎంజాయ్ చేయడానికి ‘లేట్ నైట్ పార్టీ’పై మిత్రులకు ఫేస్ బుక్‌లో ఆహ్వానాన్ని పోస్ట్ చేశారు. హడావుడి తప్పింది వివిధ రంగాల్లోని యువత సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. కాసేపు గడిపాక బార్లకు దారి తీస్తుంటారు. గంటల తరబడి బార్లలో కాలక్షేపం చేసే వారికి 11 గంటల గడువు మింగుడు పడకుండా ఉండేది. వారంతా ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాత్రి పొద్దు గడిచే కొద్దీ బార్ల వైపు మళ్లే వారు కొందరైతే, మిత్రులందరినీ కలుపుకొని వెళ్లే వారు మరికొందరు. ఇలాంటి స్వేచ్ఛా జీవులకు పొడిగింపు సమయం వరంలా పరిణమించింది. రాత్రి 11 గంటల వరకు డ్యూటీలలో ఉండే వారు సైతం కొత్త పొడిగింపు వేళలతో సంబర పడిపోతున్నారు. హోటళ్లను 11 గంటలకే మూసివేయడంతో చాలా మంది కడుపు మాడ్చుకునో లేక ఇంటిలో తయారు చేసుకునే అల్పాహారంతోనో కడుపు నింపుకునే వారు. అలాంటి వారికి ఇప్పుడు కోరిన ఆహారం లభిస్తుంది. హోటళ్లు, తిను బండారాల కేంద్రాలు మాత్రం వారమంతా రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయి. మరో వైపు బర్త్ డే పార్టీలు జరుపుకొనే వారికి కూడా ఈ పొడిగింపు సమయం సంబరాన్ని కలిగిస్తోంది. సాధారణంగా బార్లలో ఇలాంటి పార్టీలు జరుపుకొనే వారు 11 గంటల లోగా సంబరాలను ముగించాల్సి ఉంటుంది. అంటే...గంటకు ముందే పుట్టిన రోజు జరుపుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడా ఇబ్బంది తప్పిందని అనేక మంది ఉత్సాహ పడుతున్నారు.