అర్ధరాత్రి పార్టీ.. యువతిని ఎత్తుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ | cab driver abducts girl after latenight party | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి పార్టీ.. యువతిని ఎత్తుకెళ్లిన క్యాబ్ డ్రైవర్

Published Sat, Oct 8 2016 12:04 PM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM

అర్ధరాత్రి పార్టీ.. యువతిని ఎత్తుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ - Sakshi

అర్ధరాత్రి పార్టీ.. యువతిని ఎత్తుకెళ్లిన క్యాబ్ డ్రైవర్

అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుని, తిరిగి ఇంటికి క్యాబ్‌లో వెళ్తున్న ఓ యువతిని ఆ క్యాబ్ డ్రైవర్ అపహరించి, ఆమెపై శారీరకంగా దాడి చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ విశ్మకర్మ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగింది. బాధితురాలు మరో ఇద్దరు రూం మేట్లతో కలిసి నగరంలోని ఓ క్లబ్‌లో పార్టీకి వెళ్లింది. పార్టీ ముగుస్తోందనగా ఆ ముగ్గరిలో ఒకరు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. కానీ, ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో క్యాబ్ వివరాలు ఆమెకు రాలేదు. దాంతో క్లబ్ బయటకు వచ్చి క్యాబ్ కోసం చూశారు. ఆ సమయంలో తనను తాను ఉబర్ డ్రైవర్‌గా చెప్పుకొన్న ఓ వ్యక్తి వాళ్ల వద్దకు వచ్చాడు. యువతులలో ఇద్దరు వెనక కూర్చోగా, మరో యువతి ముందు సీట్లో కూర్చుంది. తమను మురళీపురా ప్రాంతానికి తీసుకెళ్లమంటే ఎటునుంచో తిప్పి.. చివరకు విశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతానికి తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

హర్మద హైవే మీద మిలన్ థియేటర్ సమీపంలో టైరు పంక్చర్ అయిందంటూ పక్కకు ఆపాడు. వెనకాల కూర్చున్న ఇద్దరినీ దిగమన్నాడు. వాళ్లు దిగగానే కారులో ఉన్న మరో యువతితో పరారైనట్లు విశ్వకర్మ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ కన్వర్ పాల్ సింగ్ తెలిపారు. కొంతదూరంలో ఒక హోటల్ కనిపించడంతో అక్కడకు వెళ్తుండగా.. పోలీసు పెట్రోల్ యూనిట్ వాళ్లను ఆపి ప్రశ్నించింది. దాంతో వాళ్లు ఏడుస్తూ మొత్తం విషయం చెప్పారు. పెట్రోలింగ్ పోలీసులు గాలిస్తూ వెళ్లగా.. చివరకు దౌలత్‌పురా ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్ కింద క్యాబ్ పార్క్ చేసి కనిపించింది. పోలీసులను చూడగానే డ్రైవర్ అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలి ముఖం మీద గాయాలు కనిపించాయి. దాంతో ఆమెను లైంగికంగా వేధించేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలిసింది. నిందితుడి ఆచూకీ కోసం నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement