Laureus Sports
-
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నీరజ్ చోప్రా.. భారత్ నుంచి మూడో ఆటగాడిగా
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మొత్తం ఏడు విభాగాల్లో వివిధ క్రీడలకు చెందిన ఆటగాళ్లను లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ చేశారు. కాగా 2022 లారెస్ స్పోర్ట్స్ వరల్డ్ బ్రేక్‌త్రూ అవార్డుకు నీరజ్ చోప్రా సహా మరో ఐదుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. రష్యన్ టెన్నిస్ స్టార్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ డానియెల్ మెద్వెదెవ్, స్పానిష్ ఫుట్‌బాలర్ పెడ్రీ, బ్రిటన్ టెన్నిస్‌స్టార్ ఎమ్మా రాడుక్కాను, వెనిజులా అథ్లెట్ యులిమర్ రోజస్ తోపాటు ఆసీస్ స్విమ్మర్ అరియార్నే టిట్మస్‌లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 మంది స్పోర్ట్స్ జర్నలిస్టులు ప్రతిష్టాత్మక అవార్డుకు ఏడు కేటగిరీ నుంచి ఆటగాళ్లను నామినేట్ చేశారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఏప్రిల్‌లో అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే నీరజ్ చోప్రా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు ఇటీవలే పద్మశ్రీ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు నామినేషన్స్ కు భారత్ తరఫున ఎంపికైన మూడో అథ్లెట్ నీరజ్ చోప్రా కావడం గమనార్హం. ఇంతకు ముందు ఈ అవార్డు నామినేషన్స్ కు 2019లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఎంపికవ్వగా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా లారెస్ స్పోర్ట్స్ అవార్డ్ నామినేషన్స్‌కు సెలెక్ట్ అయ్యాడు. 2000–2020 కాలానికి గానూ ప్రకటించిన లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ గెలుచుకోవడం విశేషం. A special feeling to be nominated along with some exceptional athletes for the Laureus World Breakthrough of the Year award. Congratulations to @DaniilMedwed, @pedri, @EmmaRaducanu, @TeamRojas45 and Ariarne Titmus on their nominations. #Laureus22 🇮🇳 pic.twitter.com/16pUMmvQBE — Neeraj Chopra (@Neeraj_chopra1) February 2, 2022 -
సచిన్‌ను గంగూలీ వదలట్లేదుగా!
‘సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ’ ఈ ద్వయం గురించి చెబితే చరిత్ర అవుతుంది. రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది. మూడు దశాబ్దాల పాటు టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది ఈ జోడి. ఇద్దరు క్రీజులో ఉన్నారంటే పరుగుల వరద ఖాయం.. గెలుపుపై అందరిలోనూ ధీమా. రిటైర్మెంట్ అనంతరం కూడా భారత క్రికెట్‌కు విశేష సేవలను అందిసున్నారు వీరిద్దరు. ఇక సచిన్-గంగూలీల మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే. ఒకిరికొకరు మద్దతుగా ఉంటేనే.. అప్పుడప్పుడు సరదాగా వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటారు. తాజాగా లారస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సచిన్ బెర్లిన్ వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రఖ్యాత భవనం ముందు నిల్చొని దిగిన ఫోటోను సచిన్ తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోకు గంగూలీ తనదైన రీతిలో కామెంట్ చేశాడు. ‘సచిన్ నేను చెప్పినదాంట్లో తప్పేలేదు’అంటూ దాదా పేర్కొన్నాడు. అయితే గత వారం బుష్ ఫైర్ చారిటీ మ్యాచ్ కోసం సచిన్ ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసీస్‌లో పర్యటనకు సంబంధించిన ఓ పోటోను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోకు ‘కొందరు అదృష్టవంతులు ఉంటారు.. హాలిడేస్‌ను ఎంజాయ్ చేయ్’ అంటూ గంగూలీ సరదగా వ్యాఖ్యానించాడు. తాజాగా సచిన్ మరో టూర్ ఫోటో షేర్ చేసిన నేపథ్యంలో దాదా పై వ్యాఖ్యలు చేశాడు. ఇక వీలుచిక్కినప్పుడల్లా సచిన్‌ను దాదా వదలట్లేదుగా అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: బ్యాట్ పట్టి.. ఫోర్ కొట్టి యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్ -
యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్
‘ఇన్నేళ్లుగా దేశమంతా ఉంచిన భారాన్ని సచిన్ మోశారు. ఇప్పుడు మేం ఆయన్ను మోశాం’ ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011 ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా అపూర్వ విజయం తర్వాత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను తోటి ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం అంతా ఊరేగిన సందర్భంలో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి ఆరోజు పలికిన మాటలు ఇవి. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసిన యావత్ ప్రపంచం ఆనందభాష్పాలకు లోనయింది. అంతేకాకుండా ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని సెల్యూట్ చేశాడు. తాజాగా లారస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డు కూడా ఆ అరుదైన ఘట్టానికి సలాం చేసింది. బెర్లిన్: టీమిండియా దిగ్గజ ఆటగాడు, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక లారస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డు మాస్టర్ బ్లాస్టర్‌ను వరించింది. బెర్లిన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సచిన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నాడు. గత 20 ఏళ్లలో ప్రపంచ క్రీడల్లో అత్యంత అపురూప ఘట్టాలన్నింటిలో బెస్ట్ మూమెంట్‌కు ఈ అవార్డును అందించడం కోసం పోటీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించేందుకు ఆన్లైన్ పోల్ నిర్వహించారు. ఈ పోటీలో 19 మంది పోటీ పడగా అత్యధిక ఓట్లు రావడంతో సచిన్ విజేతగా నిలిచాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం తర్వాత సచిన్‌ను సహచర ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతా ఊరేగించారు. క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ నేషన్ (దేశాన్ని భుజాలపై ఊరేగించారు) అనే క్యాప్షన్‌తో ఓటింగ్ నిర్వహించారు. ఈ మూమెంట్‌కే ప్రస్తుతం అవార్డు దక్కింది. కాగా, 2017లో స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని లారస్ ప్రారంభించింది. గత 20 ఏళ్లలో జరిగిన ఘట్టాలన్నింటిలో బెస్ట్ మూమెంట్‌ను ఎంపిక చేసి, ఈ ఏడాది పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డు సచిన్‌కు రావడం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం ఆనందం వ్యక్తం చేస్తోంది. చదవండి: ఈ సారథ్యం నాకొద్దు! ఆడకుండా.. నన్ను కిడ్నాప్ చేశారు -
‘క్రికెట్ దేవుడిని మరోసారి గెలిపించండి’
సచిన్ టెండూల్కర్... భారత్‌లో క్రికెట్ బతికున్నంతవరకు ఈ పేరును ఎవరు మరిచిపోరు. క్రికెట్ ఒక మతంగా భావించే మన దేశంలో సచిన్‌ను దేవుడితో పోల్చడం సహజం. మాస్టర్ బ్లాస్టర్ తన క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులను కొల్లగొట్టాడు. కాగా ప్రఖ్యాత లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020కు సంబంధించి సచిన్ టెండుల్కర్ షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సచిన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోహ్లి, పలువరు ఆటగాళ్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ దేవుడికి ఓటు వేసి గెలిపించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 2011 వరకు మాస్టర్ తన 19 ఏళ్ల కెరీర్లో ఎన్ని రికార్డులు సాధించినా దేశానికి మరోసారి ప్రపంచకప్ సాధించిపెట్టలేదనే చిన్న వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ మాస్టర్‌కు చివరి ప్రపంచకప్ అని బాగా ప్రచారం జరిగింది. ఆరోసారి ప్రపంచకప్ ఆడనున్న సచిన్ ఎలాగైనా దేశానికి కప్పును తీసుకురావాలని భావించాడు. అప్పటికే జట్టు కూడా ధోని నాయకత్వంలో వరుస విజయాలకు తోడు ప్రపంచకప్ స్వదేశంలో జరగనుడడంతో అన్నీ అనుకూలంగా మారాయి. దీంతో టోర్నీ మొదలయ్యాక టీమిండియా అప్రతిహాత విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో భారత్ శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో సగర్వంగా రెండోసారి ప్రపంచకప్‌ను అందుకుంది. దీంతో మాస్టర్ అప్పటి తన 19 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో భావోద్వేగానికి గురవుతూ మైదానంలోకి చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వచ్చిన సన్నివేశం క్రికెట్ ప్రేమికులు ఎప్పటికి మరిచిపోరు. అందులోనూ తన హోంగ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ కప్ సాధించడంతో సచిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు యువరాజ్, హర్బజన్, శిఖర్ ధవన్ తమ భుజాలపై సచిన్‌ను ఎత్తుకొని గ్రౌండంతా కలియతిరిగడం, తమ అభిమాన ఆటగాడిని తమ భుజాలపై మోసుకెళ్లడం మాకు గొప్ప విషయమని ఆల్‌రౌండర్ యువరాజ్ పేర్కొన్నాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సచిన్ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను బతికి ఉన్నది ఈ క్షణం కోసమే. క్రికెట్ అనే ఆటను ఏంచుకోవడానికి కారణం కూడా ఇదే' అంటూ సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు. 2011కు ముందు ఐదు(1992,96,99,2003,2007)ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ వ్యక్తిగతంగా అన్నింట్లో స్థిరమైన ప్రదర్శననే కనబరిచాడు.దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో సచిన్ మొత్తం 674 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అప్పటివరకు సచిన్ బ్యాటింగ్ తీరు చూసి కచ్చితంగా ఈసారి టీమిండియా కప్పు కొట్టబోతుందని చాలామంది ధీమా వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా సచిన్ ఫైనల్లో తక్కువ స్కోరుకే అవుట్ కావడం, ఆసీస్ గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మాస్టర్‌కు ఓటు వేసి గెలిపించాలనుకుంటే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి https://www.laureus.com/sporting-moments/2020/carried-on-the-shoulders-of-a-nation -
ఫెడరర్ డబుల్ ధమాకా
మోంటేకార్లో (మొనాకో): టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు... రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’... ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. మరో టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ చేతుల మీదుగా అతను ఈ పురస్కారాలను అందుకున్నాడు. ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం రేసులో క్రిస్టియానో రొనాల్డో (పుట్‌బాల్), మో ఫరా (అథ్లెటిక్స్), లూయిస్ హామిల్టన్ (ఫార్ములావన్), రాఫెల్ నాదల్ (టెన్నిస్) కూడా ఉన్నప్పటికీ ఫెడరర్‌నే ఈ అవార్డు వరించింది. 36 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్’ 2016లో ఎదురైన గడ్డు పరిస్థితులు, వరుస వైఫల్యాలు, గాయాలను అధిగమించి... 2017లో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు ఏడు ట్రోఫీలను గెలిచాడు. దీంతో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ (ఈ ఏడాది) సాధించాడు. ఈ వెటరన్ చాంపియన్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు రావడం కొత్తేమీ కాదు. జోరుమీదున్న కెరీర్ తొలినాళ్లలోనే 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు లారెస్ ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నాడు. తాజాగా అతని ఖాతాలో మరో రెండు చేరడంతో మొత్తం ఆరు పురస్కారాలతో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా ఫెడరర్ మాట్లాడుతూ ‘ప్రతిష్టాత్మక అవార్డును మళ్లీ అందుకోవడం ఆనందంగా ఉంది. పునరాగమంలో ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. గతేడాది నాకెంతో కలిసొచ్చింది. నా కలల్ని సాకారం చేసుకునేందుకు సహకరించింది. నా కెరీర్లో నేను ఎదుర్కొన్న క్లిష్టమైన ప్రత్యర్థి రాఫెల్ నాదలే. అతనో అద్భుతమైన ఆటగాడు’ అని అన్నాడు. ప్రస్తుతానికైతే రిటైర్మెంట్పై ఆలోచించడం లేదన్నాడు. ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అందుకుంది. అమెకిది నాలుగో అవార్డు. గతంలో 2003, 2010, 2016లో మూడుసార్లు ఈ పురస్కారం అందుకుంది. గతేడాది ఆరంభంలో వారాల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘బెస్ట్’ బోల్ట్, సిమోన్ బైల్స్
మొనాకో: క్రీడా ‘ఆస్కార్’గా పేరొందిన ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ పురస్కారాల్లో జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్, అమెరికా సంచలన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మెరిశారు. మొనాకోలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో... 2016 సంవత్సరానికిగాను ఉసేన్ బోల్ట్, సిమోన్ బైల్స్ వరుసగా ఉత్తమ క్రీడాకారుడు, క్రీడాకారిణి పురస్కారాలను దక్కించుకున్నారు. గతేడాది రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ మూడు స్వర్ణాలు, సిమోన్ బైల్స్ నాలుగు స్వర్ణాలు సాధించారు. ఓవరాల్‌గా బోల్ట్కిది నాలుగో లారెస్ అవార్డు. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు ఈ పురస్కారాన్ని గెల్చుకున్న ఫెడరర్, సెరెనా విలియమ్స్ (టెన్నిస్), కెల్లీ స్లేటర్ (సర్ఫింగ్) సరసన బోల్ట్ చేరాడు.