సచిన్‌ను గంగూలీ వదలట్లేదుగా! | Sourav Ganguly Trolls Sachin Again On Social Media | Sakshi
Sakshi News home page

సచిన్‌ను గంగూలీ వదలట్లేదుగా!

Published Tue, Feb 18 2020 11:41 AM | Last Updated on Tue, Feb 18 2020 11:41 AM

Sourav Ganguly Trolls Sachin Again On Social Media - Sakshi

సచిన్‌ టెండూల్కర్‌- సౌరవ్‌ గంగూలీ’ ఈ ద్వయం గురించి చెబితే చరిత్ర అవుతుంది. రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది. మూడు దశాబ్దాల పాటు టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది ఈ జోడి. ఇద్దరు క్రీజులో ఉన్నారంటే పరుగుల వరద ఖాయం.. గెలుపుపై అందరిలోనూ ధీమా. రిటైర్మెంట్‌ అనంతరం కూడా భారత క్రికెట్‌కు విశేష సేవలను అందిసున్నారు వీరిద్దరు. ఇక సచిన్‌-గంగూలీల మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే. ఒకిరికొకరు మద్దతుగా ఉంటేనే.. అప్పుడప్పుడు సరదాగా వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటారు. 

తాజాగా  లారస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ 2000-2020 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సచిన్‌ బెర్లిన్‌ వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రఖ్యాత భవనం ముందు నిల్చొని దిగిన ఫోటోను సచిన్‌ తన అభిమానులతో సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోకు గంగూలీ తనదైన రీతిలో కామెంట్‌ చేశాడు. ‘సచిన్‌ నేను చెప్పినదాంట్లో తప్పేలేదు’అంటూ దాదా పేర్కొన్నాడు. అయితే గత వారం బుష్‌ ఫైర్‌ చారిటీ మ్యాచ్‌ కోసం సచిన్‌ ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసీస్‌లో పర్యటనకు సంబంధించిన ఓ పోటోను సచిన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆ ఫోటోకు ‘కొందరు అదృష్టవంతులు ఉంటారు.. హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేయ్‌’ అంటూ గంగూలీ సరదగా వ్యాఖ్యానించాడు. తాజాగా సచిన్‌ మరో టూర్‌ ఫోటో షేర్‌ చేసిన నేపథ్యంలో దాదా పై వ్యాఖ్యలు చేశాడు. ఇక వీలుచిక్కినప్పుడల్లా సచిన్‌ను దాదా వదలట్లేదుగా అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి:
బ్యాట్‌ పట్టి.. ఫోర్‌ కొట్టి 
యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్‌
​​​​​​​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement