నాకు సచిన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు..: గంగూలీ | Ganguly Reveals Sachin Tendulkar Lashed Out At Him After 1997 West Indies Series | Sakshi
Sakshi News home page

నాకు సచిన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు..: గంగూలీ

Published Tue, Apr 28 2020 10:06 AM | Last Updated on Tue, Apr 28 2020 11:14 AM

Ganguly Reveals Sachin Tendulkar Lashed Out At Him After 1997 West Indies Series - Sakshi

న్యూఢిల్లీ: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ ఆడిన రోజుల్లో ఎప్పుడైనా అతనిలో కోపం చూసిన క్షణాలు చాలా అరుదు. ఎటువంటి వివాదాలు, ఎటువంటి హెచ్చరికలు లేకుండానే సచిన్‌ తన క్రీడా జీవితాన్ని ఆస్వాదించాడు. అయితే సచిన్‌ టెండూల్కర్‌ ఆగ్రహాన్ని తాను చూశానని అంటున్నాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. భారత జట్టుకు సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోప పడటమే కాకుండా తనకు వార్నింగ్‌ కూడా ఇచ్చాడని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ఇటీవల సచిన్‌ టెండూల్కర్‌ 48వ ఒడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో అతనితో ఉన్న కొన్ని జ్ఞాపకాలను గంగూలీ షేర్‌ చేసుకున్నాడు. (పాక్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై నిషేధం)

1997 వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్‌ గెలవాల్సిన ఒక టెస్టు మ్యాచ్‌ను కోల్పోవడంతో గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేశాడట సచిన్‌. ‘ ఆనాటి మూడో టెస్టులో విండీస్‌ తమకు 120 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. ఇది చాలా స్పల్ప లక్ష్యం. కానీ మేము 81 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయ్యాం. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయాం. ఫలితంగా సిరీస్‌ను విండీస్‌ గెలుచుకుంది. గెలుపు అంచుల వరకూ వెళ్లి ఓడిపోవడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సచిన్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ క్రమంలోనే సచిన్‌ తన కోపాన్ని నాపై చూపాడు. ప్రతీ రోజూ మైదానం చుట్టూ పరుగెత్తితేనే భవిష్యత్తు ఉంటుందని హెచ్చరించాడు. నువ్వు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే రోజూ ఉదయమే పరుగెత్తాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇది నాకు కరెక్టే అనిపించింది’ అని గంగూలీ తెలిపాడు. (బీసీసీఐ ఆదాయ మార్గాల అన్వేషణ..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement