Lava phones
-
అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థ లావా ఇంటర్నేషనల్ తన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీని నేడు దేశంలో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరాలు, 30 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంది. లావా అగ్ని 5జీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గల 90హెర్ట్జ్ డిస్ ప్లేతో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 8జీబీ ర్యామ్, 10 ప్రీలోడెడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 8ఎస్ 5జీ, మోటో జీ 5జీ, శామ్ సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ వంటి వాటితో పోటీపడనుంది. లావా అగ్ని 5జీ ధర: లావా అగ్ని 5జీ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. నవంబర్ 18 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ రిటైలర్ల ద్వారా దేశంలో అమ్మకానికి వస్తుంది. నేటి నుంచి అమెజాన్, లావా ఇ-స్టోర్ ద్వారా ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. లావా అగ్ని 5జీని ముందస్తుగా బుకింగ్ చేసుకునే కస్టమర్లు ప్రాథమిక మొత్తం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వీరికి ఫోన్ మీద రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. లావా అగ్ని 5జీ ఫీచర్స్: డిస్ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ ర్యామ్, స్టోరేజ్: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బ్యాక్ కెమెరా: 64 ఎంపీ, 5 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ బ్యాటరీ: 5,000 ఎమ్ఎహెచ్ 5జీ: డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఓఎల్టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సి పోర్ట్ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆంబియంట్ లైట్ సెన్సార్, ప్రోమిసిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ (చదవండి: చాపకింద నీరులా.. రోడ్లపై రయ్ రయ్ మంటూ ఎలక్ట్రిక్ ట్రక్లు) -
మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్
స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ "లావా" ఈ సంవత్సరంలో సుదీర్ఘ విరామం తర్వాత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అగ్ని పేరుతో రేపు మధ్యాహ్నం మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. ఈ పండుగ కాలంలో 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు తక్కువ ధరకు అందించాలని భావిస్తుంది. లావా అగ్ని 5జీ ఫోన్ ను రూ.19,999 ధరకు తీసుకొనిరావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ను రెడ్ మీ నోట్ 10 సిరీస్, రియల్ మీ ఫోన్లకు దీటుగా తీసుకొనిరావాలని కంపెనీ చూస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ క్రింది విధంగా ఉన్నాయి. లావా అగ్ని 5జీ ఫీచర్స్(అంచనా): డిస్ప్లే: 6.51 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ ర్యామ్, స్టోరేజ్ : 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బ్యాక్ కెమెరా: 64 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ (చదవండి: బంపర్ ఆఫర్, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి) -
లావా.. జెడ్60ఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీ కంపెనీ లావా తాజాగా జెడ్60ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. 2.5డీ కర్వ్‌తో 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 8.1 ఓరియో, 1.5 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఇరువైపులా 5 ఎంపీ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో రూపొందించారు. ఫోన్ 8.5 మిల్లీమీటర్ల మందం ఉంది. ఫొటోల్లో స్పష్టత కోసం కెమెరాకు షార్ప్ క్లిక్ టెక్నాలజీని వాడారు. మోడల్ ధర రూ.4,949గా నిర్ణయించారు. నవంబర్ 15లోగా ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొంటే వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ వర్తిస్తుంది. జెడ్60 సక్సెస్ కావడంతో జెడ్60ఎస్‌కు రూపకల్పన చేశామని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ ఈ సందర్భంగా తెలిపారు. -
త్వరలో తిరుపతి ప్లాంట్ నిర్మాణం: లావా
తిరుపతి: దేశీ హ్యాండ్సెట్ల తయారీ సంస్థ లావా మొబైల్స్ త్వరలోనే తిరుపతి ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి లే అవుట్ సిద్ధమయిందని, నిర్మాణ పనులను ప్రారంభిస్తామని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ చెప్పారు. మంగళవారం మార్కెట్లోకి లావా జెడ్61 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కంపెనీకి 1,100 మంది పంపిణీదారులున్నారు. ఇప్పటివరకు పట్టణ, సబ్–అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో ఉనికిని చాటుకున్న లావా ఇక నుంచి 10,000 జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చే 12–18 నెలల్లో 40 శాతం మార్కెట్ వాటాను సొంత చేసుకోవాలనేది సంస్థ లక్ష్యం. ఇందులో భాగంగా నోయిడా ప్లాంటులో ఉత్పత్తిని పెంచడం, తిరుపతి ప్లాంట్ నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాం’’ అని గౌరవ్ నిగమ్ వివరించారు. ఆఫ్రికాకు ఎగుమతయ్యే హ్యాండ్సెట్ల తయారీ పూర్తిగా భారత్‌లోనే కొనసాగుతోందని చెప్పారు. లావా జెడ్61 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 18:9 ఫుల్‌వ్యూ హెచ్డీ డిస్ప్లే, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.5,750 కాగా.. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.6,750గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. -
ఆ ఫోన్లపై వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ మొబైల్ ఫోన్ తయారీదారు లావా ఇంటర్నేషనల్, వొడాఫోన్ ఇండియాతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎంపికచేసిన లావా ఫోన్లపై వొడాఫోన్ 900 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. 2017 అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను తన కొత్త, పాత కస్టమర్లందరికీ ఇవ్వనుంది. ఈ ఆఫర్ కింద, ఎంపికచేసిన లావా ఫోన్లను వాడే వొడాఫోన్ యూజర్‌కు నెలకు కనీస రీఛార్జ్ 100 రూపాయలపై 50 రూపాయల డిస్కౌంట్ ఇవ్వనుంది. అలా 18 నెలల పాటు అందించనుంది. దీంతో మొత్తంగా రూ.900 క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఈ ఆఫర్ వర్తించే ఎంపికచేసిన లావా ఫోన్లలో ఏఆర్సీ 101, ఏఆర్సీ 105, ఏఆర్సీ వన్ ప్లస్, స్పార్క్ ఐ7, కేకేటీ 9ఎస్, కేకేటీ పెర్ల్, కేకేటీ 34 పవర్, కేకేటీ 40 పవర్ ప్లస్, కెప్టెన్ కే1 ప్లస్, కెప్టెన్ ఎన్1లు ఉన్నాయి. లావాతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని, లావా మొబైల్స్ వాడే తమ కస్టమర్లకు పాకెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను తీసుకొచ్చామని వొడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అన్వేష్ కోస్లా చెప్పారు. కస్టమర్లకు వొడాఫోన్ ఆఫర్ చేసే క్యాష్‌బ్యాక్ మొత్తం, తమకు అత్యధికంగా అమ్ముడుపోతున్న ఫీచర్ ఫోన్ కెప్టెన్ ఎన్1 ధరకు సమానంగా ఉందని లావా ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్, సీనియర్ వీపీ గౌరవ్ నిగమ్ అన్నారు.