Law and orders problem
-
శాంతిభద్రతల కోసమే రేవంత్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్నికల సమయంలో వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగానే రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న సభ లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందువల్ల అధికారిక సీలు అందుబాటులో లేకపోయిందని వివరించారు. అదుపులోకి తీసుకునే ముందు బయటకు రావాలని రేవంత్‌ను పలుమార్లు పిలిచామని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో గేట్లు పగులగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని, వారికి రేవంత్ అరెస్ట్‌కు దారి తీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు కోరగా నిరాకరించారని ఆమె తెలిపారు. పోలీసులు చట్ట విరుద్ధంగా రేవంత్‌ను నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి అవకాశం ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
‘అర్బన్’పై ప్రధాన దృష్టి
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: సాధారణ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంపైనే ప్రధాన దృష్టి పెట్టింది పోలీసు శాఖ. ఈ నియోజక వర్గంలోనే సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటి నుం చే నివారణ చర్యలు విస్తృతం చేస్తున్నారు. నగరంలోని జం ట హత్యలు జరగడం, కొన్ని ప్రాంతాల్లో సమస్యత్మకంగా ఉండడంతో పోలీసు శాఖ ప్రధాన దృష్టి పెట్టింది. రాత్రివేళల్లో తనిఖీలు ఆపరేషన్ చబూతర్ పేరిట కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఇదివరకే రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. గతంలో వివిధ కేసుల్లో ఉన్న వారు వివాదాలకు కారణమవుతున్న వారిని గుర్తించిన పోలీసులు పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ కూడా చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు అనేకం అర్బన్ నియోజక వర్గంలో ఆరు పోలీస్స్టేషన్లు ఉన్నాయి. 2 లక్షల 25 వేల 444 మంది ఓటర్లు ఉన్నారు. 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 37 సమస్యాత్మక కేంద్రాలు, 38 అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 23 పోలింగ్ కేంద్రాలు రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 14 పోలింగ్ కేంద్రాలు మూడో టౌన్ పరిధిలో 10, 4వ టౌన్‌పరిధిలో 12, 5వ టౌన్ పరిధిలో 3, ఆరో టౌన్ పరిధిలో 6, రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడు సమస్మాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. గతంలోనూ ఎన్నికలు జరిగిన దుబ్బ, మాలపల్లి, ఖిల్లా, ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అలజడులు జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిని దృష్టికి పెట్టుకొని ఎన్నికల నిర్వాహణ అధికారుల సహాయంతో పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక బలగాల ఏర్పాటు పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి వెళ్లే వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నలువైపులా గట్టిబందోబస్తు ప్రత్యేక బలగాలతో పోలీసుశాఖ బందోబస్తు నిర్వహించనుంది. గ్రూపులుగా ఉండకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని పోలీస్స్టేషన్లకు పోలీసుశాఖ దిశానిర్దేశం చేసింది. బందోబస్తు నిర్వహణపై సమావేశాలు కూడా నిర్వహించారు. పకడ్బందీగా బందోబస్తు అర్బన్ పరిధిలో ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించాం. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలతో బందోబస్తు ఉంటుంది. ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్ వేసుకోవచ్చు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తాం. –శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ -
శాంతిభద్రతలపై చర్చకు హాజరుకాని బాబు
* తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నశాంతిభద్రతలపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో గదికే పరిమితం * అక్కడి నుంచే విపక్షంపై ఎదురుదాడికి టీడీపీ సభ్యులకు దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై శాసన సభలో శుక్రవారం కీలకమైన చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా తన చాంబర్‌కే పరిమితమయ్యారు. తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అంశంపైనే చర్చ జరుగుతున్న సమయంలో ఆయన సభలో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఉదయం ప్రశ్నోత్తరా లు, ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయం లో సభలోనే ఉన్న సీఎం అనంతరం చాంబర్‌కు వెళ్లిపోయా రు. వ్యవసాయ బడ్జెట్ తరువాత సాధారణ బడ్జెట్ పద్దులపై చర్చను ప్రారంభించడం, అనంతరం అనధికారిక బిజినెస్ కార్యక్రమం కింద దుమ్ముగూడెం నుంచి సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒక అనధికార తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ కార్యక్రమాల్లో పేర్కొన్నారు. శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు బదులు రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చను చేపట్టేందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చూస్తున్నా, అందులోని శాంతిభద్రతల అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఉంది. శాఖాపరంగా తాను పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అంశంపై చర్చ ప్రారంభమయ్యాక బాబు సభలోకి వస్తారని ఎమ్మెల్యేలు ఎదురుచూసినా రాలేదు. చర్చ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలపై చంద్రబాబు పేరిట ఒక ప్రకటనను ప్రభుత్వం సభలో పంపిణీ చేయించింది. అందులో వైసీపీ చేసిన న్యాయ విచా రణ డిమాండ్ లేకపోగా, గత దశాబ్దకాలంలో అనేక రాజకీయ హత్యలకు తెదేపా నేతలు గురయ్యారంటూ ఎమ్మెల్యే పరి టాల రవీంద్ర హత్యను ప్రస్తావించారు. గత మూడు నెలల్లో రాజకీయ హత్యలకు గురై కుటుంబ పెద్దలను కోల్పోయిన అనేక కుటుంబాల గురించి, వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం తీసుకొనే చర్యల గురించి పేర్కొనలేదు. రేపు మాట్లాడతా... సభ శనివారానికి వాయిదా పడిన అనంతరం చంద్రబాబును మీడియా ప్రతినిధులు కొందరు సభలోని పరిణామాలపై స్పందించాలని కోరారు. అయితే తాను ఇప్పుడు ఏమీ చెప్పనని, రేపు సభలోనే మాట్లాడతానని ఆయన చెప్పారు. సీఎం ప్రకటన సారాంశం ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ప్రశాంతంగా ఉంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నేరస్థులను సమర్థంగా ఎదుర్కొనే చర్యలను పోలీసు శాఖ చేపడుతోంది. తీవ్రవాదాన్ని సమర్థం గా ఎదుర్కొనేందుకు అభివృద్ధి, సానుకూల పోలీసింగ్ అనే రెండు వ్యూహాలతో సాగుతోంది. నక్సల్ కార్యకలాపాలు తగ్గే లా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘ సరిహద్దు ఉండటం, ప్రతికూల వాతావరణం, అననుకూల భౌగోళిక పరిస్థితులతో మావోయిస్టుల ప్రభావం పడుతోంది. 2014లో 1 హత్యతో సహా ఆరు నేరాలకు పాల్పడ్డారు. 2013లో 4 హత్యలతో సహా 18 నేరాలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి, ఉపాధి అవకాశాల మెరుగుకు ప్ర భుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మతకలహాల నే వి లేకుండా రాష్ట్రం శాంతియుతంగా ఉంది. రాజకీయపరమైన హింసకు సంబంధించి ఈ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేశా క శాంతిభద్రతల పరరిక్షణకు పోలీసులకు స్పష్టమైన ఆదేశా లు జారీచేసింది. పదేళ్లుగా అనేక రాజకీయ హత్యలు జరిగా యి. పరిటాల రవితో సహ టీడీపీ కార్యకర్తలను రాయలసీమ ప్రాంతంలోని ఫ్యాక్షనిస్టులు నిర్దాక్షిణ్యంగా అంతమొందించారు. రవి హత్య తరువాత కూడా సాక్ష్యాలనేవి లేకుండా హత్యలు కొనసాగాయి. ఇలాంటి రాజకీయపరమైన హింసా కార్యక్రమాలను ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదు’’ అని చంద్రబాబు ప్రకటనలో పేర్కొన్నారు.