సాక్షి, నిజామాబాద్‌అర్బన్: సాధారణ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంపైనే ప్రధాన దృష్టి పెట్టింది పోలీసు శాఖ. ఈ నియోజక వర్గంలోనే సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటి నుం చే నివారణ చర్యలు విస్తృతం చేస్తున్నారు. నగరంలోని జం ట హత్యలు జరగడం, కొన్ని ప్రాంతాల్లో సమస్యత్మకంగా ఉండడంతో పోలీసు శాఖ ప్రధాన దృష్టి పెట్టింది. రాత్రివేళల్లో తనిఖీలు ఆపరేషన్ చబూతర్ పేరిట కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఇదివరకే రౌడీషీటర్‌లను బైండోవర్ చేశారు. గతంలో వివిధ కేసుల్లో ఉన్న వారు వివాదాలకు కారణమవుతున్న వారిని గుర్తించిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌లకు పిలిపించి కౌన్సెలింగ్ కూడా చేస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాలు అనేకం
అర్బన్ నియోజక వర్గంలో ఆరు పోలీస్‌స్టేషన్‌లు ఉన్నాయి. 2 లక్షల 25 వేల 444 మంది ఓటర్లు ఉన్నారు. 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 37 సమస్యాత్మక కేంద్రాలు, 38 అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 23 పోలింగ్ కేంద్రాలు రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 14 పోలింగ్ కేంద్రాలు మూడో టౌన్ పరిధిలో 10, 4వ టౌన్‌పరిధిలో 12, 5వ టౌన్ పరిధిలో 3, ఆరో టౌన్ పరిధిలో 6, రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడు సమస్మాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. గతంలోనూ ఎన్నికలు జరిగిన దుబ్బ, మాలపల్లి, ఖిల్లా, ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అలజడులు జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిని దృష్టికి పెట్టుకొని ఎన్నికల నిర్వాహణ అధికారుల సహాయంతో పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది.
ప్రత్యేక బలగాల ఏర్పాటు
పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి వెళ్లే వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నలువైపులా గట్టిబందోబస్తు ప్రత్యేక బలగాలతో పోలీసుశాఖ బందోబస్తు నిర్వహించనుంది. గ్రూపులుగా ఉండకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు పోలీసుశాఖ దిశానిర్దేశం చేసింది. బందోబస్తు నిర్వహణపై సమావేశాలు కూడా నిర్వహించారు.
పకడ్బందీగా బందోబస్తు
అర్బన్ పరిధిలో ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించాం. అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలతో బందోబస్తు ఉంటుంది. ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్ వేసుకోవచ్చు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తాం.
–శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment