law degree
-
ఆర్టిస్ట్ టు బారిస్టర్
ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే బుర్ర దెయ్యాల ఫ్యాక్టరీ అవుతుందట!లాక్డౌన్ టైమ్‌లో సతిందర్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది.ఆ ఖాళీ సమయంలో వృథా ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెనడాలో లా డిగ్రీ ఉత్తీర్ణురాలై ప్రశంసలు అందుకుంటోంది సతిందర్... పంజాబ్‌లోని బటాలా పట్టణానికి చెందిన సతిందర్ సట్టి నటి, కవయిత్రి, డ్యాన్సర్, సింగర్, టెలివిజన్ యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. ‘కవిత్వం అనేది విప్లవాత్మకమైన వేదిక’ అని చెప్పే సతిందర్ కవిత్వంలో సామాజిక సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. టీవి యాంకర్‌గా ఎంతోమంది సామాన్యుల అద్భుతగాథలను ‘బోల్ దే’ కార్యక్రమంతో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ‘పంజాబ్ ఆర్ట్స్ కౌన్సిల్’ ఛైర్‌పర్సన్‌గా సతిందర్ నియామకం అయినప్పుడు ‘నలభై ఏళ్లు దాటని వ్యక్తికి ఈ పదవి ఎలా ఇస్తారు’ అని కొందరు పనిగట్టుకొని విమర్శించారు.అయితే తన పనితీరుతో విమర్శించిన వారే ప్రశంసించేలా చేసింది సతిందర్. తాజా విషయానికి వస్తే.... ‘సతిందర్ ఇప్పుడు కెనడాలో బారిస్టర్’ అంటూ వార్తల్లోకి వచ్చింది. 2020లో సతిందర్ కెనడాలో ఉంది. ఆ సమయంలో లాక్డౌన్ ప్రకటించడంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ‘సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?’ అనేదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె దృష్టి లా డిగ్రీపై పడింది. అమృత్‌సర్‌లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సతిందర్ ‘లా’ చేసింది. ఆ డిగ్రీని కెనడియన్ లా డిగ్రీతో అప్‌గ్రేడింగ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇండియాలో ‘లా’ చేసిన వారు కెనడాలో ప్రాక్టిస్ చేయాలంటే అక్కడి ఎన్సీఎ(నేషనల్ కమిటీ ఆన్ అక్రిడియేషన్) గుర్తింపు పొందాల్సి ఉంటుంది. దీని కోసం బారిస్టర్ ఎగ్జామ్స్‌కు హాజరు కావాలి. అయిదుకు పైగా ఎగ్జామ్స్ ఉంటాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోతే కెనడా లా స్కూల్లో సంవత్సరం పాటు చదవాల్సి ఉంటుంది.పరీక్షలకు ప్రిపేర్ కావడానికి గుర్ప్రీత్, జస్వంత్ మంగత్లాంటి న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుంది. చాలామంది కఠినంగా భావించే ఆ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి బారిస్టర్ లైసెన్స్ పొందింది సతిందర్. లైసెన్స్ అవార్డింగ్ సమయంలో అక్కడి న్యాయ అధికారులు సతిందర్ బహుముఖ ప్రతిభ గురించి ప్రశంసించడం విశేషం. -
తోమర్ ఇక ఇంటికేనా!
న్యూఢిల్లీ: అవినీతి, అన్యాయం, మోసం,లంచం వంటి అంశాలపై సమరశంఖం పూరించి ప్రత్యేక పార్టీని నెలకొల్పి విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్.. తన ప్రభుత్వం విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తన పార్టీకి కలంకం తీసుకొచ్చిన న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, అరెస్టు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మోసం చేసిన తోమర్ ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు కూడా సమాచారం. శుక్రవారం దీనిపై నిర్ణయం కూడా తీసుకోనున్నట్లు కీలక సమాచారం. బీహార్‌లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా.. అది నకిలీదని పేర్కొంటూ సదరు యూనివర్సిటీ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. న్యాయశాఖ మంత్రి తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు తోమర్ ను అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ సర్కార్ విమర్శల పాలయింది. కేజ్రీవాల్ కు ఈ అంశ తల నొప్పిగా మారింది. ఇక వేరే దారి లేక తోమర్ ను పార్టీ నుంచి పూర్తిగా సాగనంపాలని ఆప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
తోమర్ లా డిగ్రీ నకిలీది
హైకోర్టుకు తెలిపిన వర్సిటీ న్యూఢిల్లీ: రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య వ్యవహారంలో ఇబ్బంది ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు మరో సంకటం. కేజ్రీవాల్ మంత్రివర్గంలోని న్యాయ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన విద్యార్హత సర్టిఫికెట్ నకిలీదనే విషయం దుమారం రేపుతోంది. తోమర్ తాను బిహార్‌లోని తిల్కమాంఝి భాగల్పూర్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినట్లు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. ఈ సర్టిఫికెట్ నకిలీదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టు వర్సిటీ వివరణ కోరింది. తోమర్ సర్టిఫికెట్ సంఖ్య3687. అయితే ఇదే నంబరుతో 1999లో సంజయ్ అనే వ్యక్తికి తాము బీఏ పట్టా ఇచ్చామని వర్సిటీ సోమవారం హైకోర్టుకు తెలిపింది. తోమర్ సర్టిఫికెట్ నకిలీదని పేర్కొంది. తోమర్ కేజ్రీవాల్‌ను కలిసి సర్టిఫికెట్ అసలైందని చెప్పారు.