Law students
-
ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
-
వీడియో వైరల్: ఏయూ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు రేగింది. ఒక వర్గం విద్యార్థులపై మరో వర్గం విద్యార్థులు దాడి చేశారు. ఒక వర్గం విద్యార్థులు గంజాయి తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇరువర్గాల విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు -
వారధిలా న్యాయ విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదలకు న్యాయం అందించే దిశగా ప్రారంభించిన ‘మిషన్ లీగల్ సర్వీసెస్’ను ఓ ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంలో న్యాయ విద్యార్థులే కీలకమని, మిషన్ లీగల్ సర్వీసెస్‌కు వారు వెన్నెముక లాంటి వారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు చేపట్టిన మిషన్ లీగల్ సర్వీసెస్ కార్యక్రమాన్ని సీజే జస్టిస్ మిశ్రా మంగళవారం ఉదయం ప్రారంభించి మాట్లాడారు. దత్తత గ్రామాల పర్యటనకు ఉద్దేశించిన వాహనాలను ఆయన ప్రారంభించారు. దత్తత గ్రామాల్లో సేవలు... గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తుళ్లూరు, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకుని మిషన్ లీగల్ సర్వీసెస్‌ను ప్రారంభిస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం న్యాయ విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. వారు ప్రజలు, న్యాయవ్యవస్థకు మధ్య వారధిలా పని చేస్తారన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ ద్వారా గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, రైతుల సమస్యలతో పాటు తాగునీటి ఇబ్బందులను గుర్తించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటూ గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే సంబం«ధిత వ్యక్తులకు కోర్ కమిటీ ఉచితంగా న్యాయ సాయం అందిస్తుందన్నారు. చట్టాలున్నా... అవగాహన లేక పేదల హక్కుల రక్షణ విషయంలో పలు చట్టాలున్నా అవగాహన లేకపోవడం వల్ల నిరర్థకం అవుతున్నాయని ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ సమర్థంగా అమలయ్యేలా 6 కమిటీలు ఏర్పాటు చేశామని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి తెలిపారు. ఎనిమిది న్యాయ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు, 41 మంది న్యాయవాదులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
లా విద్యార్థుల రాస్తారోకో
తిరువళ్లూరు: చెన్నైలో ఉన్న లా కళాశాలను కాంచీపు రం తిరువళ్లూరుకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లా విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా తిరువళ్లూరులోని మెజిస్ట్రేట్ కోర్టు వద్ద శుక్రవారం లా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమానికి లా విద్యార్థుల కోఆర్డినేటర్ జార్జిముల్లర్ అద్యక్షత వహించారు. రాస్తారోకో కార్యక్రమానికి తమిళనాడు, ఆంధ్ర లా విద్యార్థులు ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జార్జిముల్లర్ మాట్లాడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం అంబేద్కర్ లా కళాశాలను తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాకు తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న లా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు అంబేద్కర్ లా కళాశాల మార్పు నిర్ణయూన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
లా విద్యార్థుల రగడ
సాక్షి, చెన్నై : బ్రాడ్ వేలోని అంబేద్కర్ లా కళాశాల పురాతనమైనది. మెట్రో రైలు పనులకు ఈ భవనం ఆటంకం కల్పిస్తోంది. దీంతో అక్కడి లా కళాశాలను మరో చోటకు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను న్యాయశాఖ అధికారులు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరుకు ఈ కళాశాలను తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారన్న సమాచారంతో విద్యార్థుల్లో ఆగ్రహం రేగింది. రెండు మూడు రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాల తరలింపు ఖాయం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగరంలో ఉన్న కళాశాలను మరో చోటకు మార్చడంతో ద్వారా శ్రమతో పాటుగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులు మధ్యాహ్నం రోడ్డెక్కారు. ట్రాఫిక్ పద్మవ్యూహం: కళాశాలను తొలగించేందుకు వీలు లేదని, అందుకు తగ్గ పనుల్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది లా విద్యార్థులు బ్రాడ్వే మార్గంలో బైఠాయించారు. ఈ హఠాత్పరిణామంతో ఆ పరిసరాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఈ క్రమంలో పలుమార్లు విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. విద్యార్థులు 4 గంటల పాటుగా బైఠాయించడంతో ఉత్తర చెన్నై పరిసరాల్లో పాటుగా, మెరీనా తీరం, మౌంట్ రోడ్డు పరిసరాలు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కాయి. పలు మారా్గాల్లో వాహనాల్ని టేక్ డైవర్షన్లు తీసుకునే రీతిలో ఏర్పాట్లు చేసినా, చిన్న చిన్న సందుల్లో సైతం వాహనాలు ఆగాయి. ఎక్కడికక్కడ వాహనాలు పలు ప్రాంతాల్లో ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పలేదు. ఓ దశలో విద్యార్థుల్ని బుజ్జగించే ప్రయత్నంలో కొందరు పోలీసు సిబ్బంది దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణ బయలు దేరింది. అదే సమయంలో కొందరు విద్యార్థులు పోలీసులపై తిరగబడ్డట్టు, దాడికి దిగినట్టు సమాచారం. దీంతో విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం బయలు దేరింది. ఆ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 4 గంటల ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు వాహన చోదకులు తంటాలు పడగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది. లాఠీచార్జ్‌పై ఆగ్రహం: లా విద్యార్థులపై లాఠీ చార్జిని న్యాయవాద సంఘాలు, విద్యార్థి సం ఘాలు ఖండిస్తున్నాయి. కనిపించిన వారిని ఇష్టానుసారంగా పోలీసులు చితగ్గొట్టడాన్ని తీవ్రంగా పరిగణించాయి. అరెస్టు చేసిన క్రమంలో, వ్యాను లో ఎక్కుతున్న విద్యార్థులపై సైతం పోలీసులు లాఠీ ఝుళిపించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యార్థి సంఘాలన్నీ ఏకమవుతున్నాయి.