విభజనను వ్యతిరేకిస్తు హైకోర్టులో పిటిషన్
ఆర్టికల్ 3ని సవాల్ చేస్తు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు స్వీకరించింది. ఆ అంశంపై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆర్టికల్ 3 ప్రకారం విభజిస్తు కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది.
కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు సీమాంధ్రలో ప్రజలు ఆందోళనకు దిగారు. అయిన సీమాంధ్రుల ఆందోళనలపై కేంద్రం ఎటువంటి స్పందన లేకుండా ముందుకు వెళ్తుంది. దాంతో పలువురు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా న్యాయవాది పీవీ కృష్ణయ్య మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.