విభజనను వ్యతిరేకిస్తు హైకోర్టులో పిటిషన్ | Lawyer Petition files on High Court due to State Bifurcation on Article 3 | Sakshi
Sakshi News home page

విభజనను వ్యతిరేకిస్తు హైకోర్టులో పిటిషన్

Published Tue, Feb 18 2014 2:00 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Lawyer Petition files on High Court due to State Bifurcation on Article 3

ఆర్టికల్ 3ని సవాల్ చేస్తు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు స్వీకరించింది. ఆ అంశంపై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆర్టికల్ 3 ప్రకారం విభజిస్తు కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది.

 

కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు సీమాంధ్రలో ప్రజలు ఆందోళనకు దిగారు. అయిన సీమాంధ్రుల ఆందోళనలపై కేంద్రం ఎటువంటి స్పందన లేకుండా ముందుకు వెళ్తుంది. దాంతో పలువురు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా న్యాయవాది పీవీ కృష్ణయ్య మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement