Article 3
-
సవరణ రాజ్యాంగ వ్యతిరేకం: జైపాల్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని, ఆర్టికల్ 3 ప్రకారం వెళ్లకుండా పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడం నిరంకుశత్వమని కేంద్రమాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం తేవడం కోసం చేపట్టిన ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్‌తోనే పూర్తయ్యిందని, ఆ తరువాత తెచ్చిన ఈ సవరణ చెల్లదని శనివారం వ్యాఖ్యానించారు.‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని లోక్‌సభలో సవరించిన తీరు దురదృష్టకరం. ఆర్టికల్ 3, 4 కింద చేపట్టిన బిల్లు ప్రక్రియ పూర్తయ్యింది. మళ్లీ సవరణ చేసే శక్తి ప్రభుత్వానికి గానీ, పార్లమెంటుకు గానీ లేదు. మళ్లీ ఆ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 కిందనే ఆరంభించాలి. రాష్ట్రాల సరిహద్దులు మార్చేందుకు పార్లమెంటుకు సర్వాధికారం ఉంది. కానీ ప్రక్రియ పూర్తయిన తరువాత సవరణలు చేయడం రాజ్యాంగబద్ధం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది’. ముంపు గ్రామాలు వచ్చిన తర్వాత మళ్లీ మండలాలెందుకు ? ముంపు గ్రామాలను మాత్రమే యూపీఏ సీమాంధ్రకు ఇచ్చింది. తాజా సవరణలో మండలాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. కొన్ని గ్రామాలను ముంపునకు తీసుకుంటారట? మిగిలిన వాటిని నిర్వాసితుల పునరావాసానికి తీసుకుంటారట. ఇదేం న్యాయం?. రాజ్యసభలో తెచ్చి పాస్ చేయకముందే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. -
టీఆర్ఎస్తో సత్సంబంధాలున్నాయ్: జైరాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య ఉన్నతస్థాయిలో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. రాజకీయ అంశాల్లో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2004లో యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామిగా ఉందని, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు గురించి ప్రస్తుతం తనకేమీ తెలియదని పేర్కొన్నారు. ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనతోనూ అన్నారని చెప్పారు. జైరాం బుధవారం వరంగల్‌లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాం. చట్టం పక్కాగా ఉంది. రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చు(మాజీ సీఎం కిరణ్‌ను ఉద్దేశించి). తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ వల్లే సాకారమైంది. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. తెలంగాణను ఏర్పాటు చేస్తూనే సీమాంధ్ర ప్రయోజనాలను కూడా రక్షించాం. కేంద్రంలో ప్రతిపక్ష బీజేపీ తెలంగాణ విషయంలో స్పష్టతతో వ్యవహరించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తొలుత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లేఖ ఇచ్చి.. తర్వాత పొంతన లేకుండా మాట్లాడారు. కాంగ్రెస్‌లోనూ చిరంజీవి వంటి నేతలు వ్యతిరేకించినా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాం. నిర్వాసితులకు దేశంలోనే మెరుగైన ప్యాకేజీ... పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు భవిష్యత్తులో రెండు రాష్ట్రాలకు ఉంటాయని జైరాం స్పష్టంచేశారు. జాతీయ జల సంఘం అనుమతి వచ్చినందునే సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులకు దేశంలోనే మెరుగైన పునరావాస ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని.. జలయజ్ఞం పథకం సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దీన్ని రూపొందించిందని చెప్పారు. -
ఆర్టికల్ 3 సవరణపై హైకోర్టు విచారణ
కౌంటర్ల దాఖలుకు కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం విభజన బిల్లుపై లగడపాటి పిటిషన్ విచారణకు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన అధికరణ 3కు 1955లో తీసుకొచ్చిన ఐదో సవరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఈ పిల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లకు మరో రెండు వారాల్లో తిరుగు సమాధానం (రిప్లై) ఇవ్వాలని పిటిషనరైన న్యాయవాది పీవీ కృష్ణయ్యను ఆదేశించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 3కు విరుద్ధమంటూ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ లగడపాటి రాజగోపాల్, మాజీ ఎంపీ సీహెచ్ శ్రీహరిరావు దాఖలు చేసిన మరో పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లలో ఒకరు ఎంపీ కాబట్టి, తన అభిప్రాయాలను అక్కడే లేవనెత్తాలని సూచించింది. -
విభజనను వ్యతిరేకిస్తు హైకోర్టులో పిటిషన్
ఆర్టికల్ 3ని సవాల్ చేస్తు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు స్వీకరించింది. ఆ అంశంపై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆర్టికల్ 3 ప్రకారం విభజిస్తు కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు సీమాంధ్రలో ప్రజలు ఆందోళనకు దిగారు. అయిన సీమాంధ్రుల ఆందోళనలపై కేంద్రం ఎటువంటి స్పందన లేకుండా ముందుకు వెళ్తుంది. దాంతో పలువురు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా న్యాయవాది పీవీ కృష్ణయ్య మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రజలే రెండుగా విడిపోయారు: చంద్రబాబు
-
ప్రజలే రెండుగా విడిపోయారు: చంద్రబాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన విభజన విషయంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సంప్రదాయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించ కూడదన్నారు. ఇది తెలుగు జాతికి సంబంధించిన సమస్య కాదని, దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటే దేశంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరితో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, కనీసం అసెంబ్లీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం వెళితే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఇరు ప్రాంతాలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సూచించారు. విషబీజాలు నాటడంతో ప్రజలే రెండుగా విడిపోయారని పేర్కొన్నారు. విభజన సమస్యను సానుకూలంగా, ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని చంద్రబాబు కోరారు. -
కిరణ్‌లాంటి వారుంటారనే ఆర్టికల్ 3: పొన్నాల
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకోడానికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలాంటి వారు ఉంటారని ముందుగా ఊహించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపర్చారని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం ఆయన పార్లమెంటు వెలుపల ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ, రాజ్యాంగ ప్రక్రియలు ఉంటాయని, రాజకీయ ప్రక్రియలో ఆందోళనలు, దీక్షలు, అనుకూల, వ్యతిరేక అగ్రనేతలను మెప్పించడాలూ ఉంటాయన్నారు. అందులో భాగంగానే సీఎం కిరణ్ దీక్ష చేసినట్లుగా అభివర్ణించారు. రాజ్యాంగ ప్రక్రియలో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పార్టీలను సంప్రదించాకే ఆ బిల్లును రూపొందించారని చెప్పారు. బిల్లుపై అసెంబ్లీ, శాసన మండలి అభిప్రాయాలను కేంద్రానికి పంపడం, మళ్లీ జీవోఎం సమీక్షించి పార్లమెంటులో పెట్టడం సాధారణ ప్రక్రియేనని తెలిపారు. అలాగే హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా అడగడం సహేతుకం కాదన్నారు. -
సీఎం ఆదేశాలు పట్టించుకోవద్దు
* సీఎస్‌కు ఉప ముఖ్యమంత్రి లేఖ సాక్షి, హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వివాదాల పేరిట ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యోచిస్తున్నట్టుగా తెలుస్తోందని, ఈ విషయమై మంత్రివర్గం అనుమతి లేకుండా ఆయన ఇచ్చే ఆదేశాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోరాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కోరారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా ప్రభుత్వం తరఫున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం చట్ట, న్యాయ విరుద్ధమని సోమవారం సీఎస్‌కు మూడు పేజీల లేఖ రాశారు. ‘‘ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కరే కాదు. మంత్రివర్గ సమిష్టి నిర్ణయాల మేర కే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని సుప్రీంకోర్టు పలు కేసుల్లో స్పష్టం చేసింది. 2006లో రామేశ్వర ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసుతో పాటు 1977లో కర్ణాటక ప్రభుత్వం వర్సెస్ కేంద్రం కేసుల కు సంబంధించిన సుప్రీం తీర్పులు ఈ విషయూన్ని తేటతెల్లం చేస్తున్నారుు. కాబట్టి చట్టవిరుద్ధ ఆదేశాలను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిది. ఆర్టికల్ 3 ప్రకారం విభజన జరుగుతున్నందున కేంద్ర, రాష్ర్ట సంబంధాల పరిధిలోకి ఈ అంశం రాదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు వీలులేదు. అలా చేస్తే రాజ్యాంగ విరుద్ధమవుతుంది. ఇలాంటి అంశాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రివర్గ సభ్యుడిగా కోరుతున్నా. కేబినెట్ అనుమతి లేని అంశాలపై సీఎం లేదా మంత్రులిచ్చే ఆదేశాలను పట్టించుకోవద్దు. సీఎం కూడా కేబినెట్లో సభ్యుడు మాత్రమే. ఆయన తలపెడుతున్న న్యాయవిరుద్ధ చర్యల్లో మీరు భాగస్వాములు కావొద్దు’’ అని డిప్యూటీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు. -
అందరికీ న్యాయం జరగాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం రాత్రి 8.45 నిమిషాలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ న్యాయం జరగాలని, ఇరు ప్రాంతాల వారితో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసే విధంగా రాష్ట్రపతిగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తెలుగు ప్రజలను రాజకీయ లబ్ధికోసం విడదీస్తున్న వ్యవహారంలో మొదటి ముద్దాయి సోనియాగాంధీయేనని విమర్శించారు. సీట్ల కోసమే ఈ విభజనను చేపడుతున్నారన్నారు. ఇరు ప్రాంతాల సమస్యలకు పరిష్కారం చూపకుండా విడదీస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. వ్యక్తులు కాదు వ్యవస్థ శాశ్వతమని, ఆ వ్యవస్థలో హద్దు మీరితే సమాజానికే ప్రమాదమని బాబు హెచ్చరించారు. ఆర్టికల్ 3ను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజలను రెచ్చగొడితే సీట్లు వస్తాయనే ఆలోచనలో టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీలు ఉన్నాయని బాబు అన్నారు. రాష్ట్ర విభజన విధ్వంసానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీలే కారణమన్నారు. దేశంలో జరిగిన విభజన సందర్భాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఆమోదం పొందాకే ఆ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజిస్తుండడం దారుణమన్నారు. నిన్న మొన్న వచ్చిన పార్టీలన్నీ రాజకీయం కోసమేనని, టీడీపీ మాత్రం తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు. ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని వస్తున్న డిమాండ్లను చూస్తే అది ఎవరికీ ఆమోదయోగ్యమైన విధంగా లేదని స్పష్టమవుతోందన్నారు. విద్యా, విద్యుత్, నీళ్ళు, ఉద్యోగాలకు సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టమైన ప్రతిపాదనలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పై చర్చకు రమ్మని ఛాలెంజ్ చేస్తే ఒకరు ఫాం హౌస్‌లో పని ఉందని ముందుకు రాలేదన్నారు. -
రాష్ట్ర విభజన, ఆర్టికల్-3పై ఎవరేమన్నారు?
అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని, రాజ్యాంగంలోని మూడో అధికరణ దుర్వినియోగాన్ని నిరోధించాలని, ఏ రాష్ట్రాన్నయినా ఏకపక్షంగా విభజించేందుకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3 సవరణ కోసం మద్దతివ్వాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు నవంబర్ 16వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా పర్యటించారు. పార్టీ ప్రతినిధుల బృందంతో న్యూఢిల్లీ నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి.. ఆయా పార్టీల అధ్యక్షులు, అగ్రనాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయా నాయకుల స్పందనలు ఇవీ... ఏ రాష్ట్ర విభజనకైనా మేం వ్యతిరేకం ‘‘భాషాప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన ఏ రాష్ట్రం విభజననైనా సరే సీపీఎం గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకసారి విభజన ప్రక్రియను ఆరంభించినట్టయితే, తేనెతుట్టెను కదిలించినట్టవుతుందని మేం మొదట్నుంచీ చెప్తున్నాం. అది మున్ముందు కూడా కొనసాగుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు, ఇంకా ఈ అంశం చర్చకొచ్చే ఇతరత్రా వేదికలన్నింటిపైనా వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని మేం గట్టిగా కోరతాం.’’ - సీతారాం ఏచూరి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు (న్యూఢిల్లీ, 16 నవంబర్ 2013) ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్టీలో చర్చిస్తాం ‘‘రాష్ట్రాలను ఏకపక్షంగా విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారమిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్-3 దుర్వినియోగం కాకుండా చూసే అంశంపై తప్పనిసరిగా పార్టీలో చర్చిస్తాం. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటుపై మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. పునరాలోచన ప్రసక్తే లేదు.’’ - సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి (న్యూఢిల్లీ, 16 నవంబర్) సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ‘‘ఆర్టికల్ 3 సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తా. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలు చేయాలంటూ ఫజల్ అలీ కమిషన్ సూచించిన అంశం కొత్త విషయం. దీన్ని సైతం పార్టీ దృష్టికి తీసుకెళ్తా. మాది చిన్న రాష్ట్రాల విధానం. అయినా ఈ అంశాలను తప్పక పార్టీ దృష్టికి తీసుకెళ్తా.’’ - రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు (17 నవంబర్ 2013) పార్లమెంటులో అడ్డుకుంటాం... ‘‘ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలని చూస్తే ఇటు లోక్‌సభలోనూ అటు రాజ్యసభలోను అడ్డుకుంటాం.’’ - మమతాబెనర్జీ, బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత(కోల్‌కతా, 20 నవంబర్) విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం ‘‘ఏపీ విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం. ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకుండా సవరించాలి. - ఉద్ధవ్‌ఠాక్రే, శివసేన అధ్యక్షుడు (ముంబై, 25 నవంబర్, ) జగన్ లేవనెత్తిన అంశాలు కీలకమైనవి ‘‘ఎన్సీపీ 9 నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి జగన్ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకు వెళ్లరాదని, మూడో అధికరణ సవరణ విషయాన్ని ప్రస్తావించారు. మా వర్కింగ్ కమిటీలో వీటిపై సీరియస్‌గా చర్చిస్తాం.’’ - శరద్‌పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, (ముంబై, 25 నవంబర్) ప్రజలను సంప్రదించాల్సింది.. ‘‘ఆంధ్రప్రదేశ్ విషయంలో.. విభజన నిర్ణయం తీసుకోవటానికి ముందు రాష్ట్ర ప్రజలను సంప్రదించి ఉండాల్సింది. సంకుచిత రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించటం సరికాదు.’’ - నవీన్‌పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి, (భువనేశ్వర్, 24 నవంబర్) తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం ‘‘చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. పైగా కొత్త సమస్యలు తలెత్తుతాయి. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. ఆర్టికల్-3 ప్రకారమే కాదు.. ఏవిధంగా విభజించినా సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకిస్తుంది.’’ - అఖిలేష్‌యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, (లక్నో, 06 డిసెంబర్) బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటాం ‘‘ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును మా పార్టీ పార్లమెంట్లో అడ్డుకుంటుంది’’ - ములాయంసింగ్‌యాదవ్, సమాజ్‌వాది పార్టీ అధినేత (ఢిల్లీ, 9 డిసెంబర్) సవరణకు మద్దతిస్తా ‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఈ తరహాలో విభజించడం తెలివైన నిర్ణయం కాదు. ఆర్టికల్ 3 సవరణ కోసం పెడుతున్న వాయిదా తీర్మానానికి మద్దతునిస్తాం. - దేవెగౌడ, మాజీ ప్రధాని, (ఢిల్లీ, 9 డిసెంబర్ ) అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం ‘‘రాష్ట్రాల అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం. రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరముంది.’’ - నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి (పాట్నా, 13 డిసెంబర్ ) తీర్మానం తీసుకోవాల్సిందే: బాదల్ ‘‘ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి ఆ రాష్ట్రం నుంచి తీర్మానం తప్పకుండా తీసుకున్నపుడే విభజన అంశాన్ని పరిశీలించాలి.’’ - ప్రకాశ్‌సింగ్‌బాదల్, పంజాబ్ సీఎం, (ఢిల్లీ, 13 డిసెంబర్ ) -
‘ఆర్టికల్ 3’పై చర్చిద్దాం
లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒత్తిడి వెల్‌లోకి వెళ్లి పట్టుబట్టిన జగన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడుతున్న కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందంటూ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పోడియం వద్దకు వెళ్లి, వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టేలా చూసేందుకు ఆందోళన సాగించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి ఆయనతో పాటు పోడియం వద్దకు చేరుకుని ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’ (ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచండి) అనే నినాదం రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. సభ జరిగిన మూడుసార్లూ, ఈ ముగ్గురు నేతలూ ఇదే తరహాలో ఒత్తిడి తెచ్చారు. సమైక్యాంధ్ర, లోక్‌పాల్ బిల్లు తదితర అంశాలపై వివిధ పార్టీలు ఉభయ సభల్లోనూ పెద్దపెట్టున ప్రభుత్వంపై విరచుకుపడటంతో వరుసగా ఐదోరోజూ వాయిదాల పరంపరే కొనసాగింది. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్, పన్నెండేళ్ల కిందట పార్లమెంటుపై జరిగిన దాడిలో అమరులైన వారికి, ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులర్పించేందుకు సంతాప ప్రకటన చదివారు. సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించి వారికి నివాళులర్పించారు. తర్వాత ప్రశ్నోత్తరాలను చేపట్టబోతుండగా, విపక్ష నేత సుష్మా స్వరాజ్ లేచి, ప్రశ్నోత్తరాల సస్పెన్షన్‌కు తమ పార్టీ ఇచ్చిన నోటీసును ప్రస్తావించారు. లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ గంగూలీ తీరును తప్పుపడుతూ ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడుతుండగానే, టీడీపీ సభ్యులు ముగ్గురు, ఇతర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు ప్రారంభించారు. ఈలోగా వాయిదా తీర్మానంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లారు. సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే సుష్మా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అప్పటికి ఇతర పార్టీల సభ్యులూ వెల్‌లోకి వచ్చారు. సుష్మా తర్వాత మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ జస్టిస్ గంగూలీ విషయంలో తాను సుష్మా అభిప్రాయాలను సమర్థిస్తున్నాన్నారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ యూపీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు నిరసనలు కొనసాగుతుండగానే మంత్రులు బొగ్గు నియంత్రణాధికా సంస్థ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ దశలో జగన్, మేకపాటి, ఎస్పీవై రెండోసారి పోడియం వద్దకు వెళ్లి ఆందోళన సాగించారు. అదే సమయంలో స్పీకర్ అవిశ్వాస తీర్మాన నోటీసులను ప్రస్తావించారు. మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కొనకళ్ల నారాయణరావు, ఇతరులు; ఆర్.సాంబశివరావు, ఇతరులు; వైఎస్ జగన్మోహనరెడ్డి, ఇతరుల నుంచి తనకు మూడు నోటీసులు అందినట్లు చెప్పారు. సభ సాధారణ స్థితిలో లేకుంటే, తమ తమ స్థానాల్లో లేచి నిలబడే సభ్యులను లెక్కించలేనని, నిబంధనల ప్రకారం 50 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లుగా సరిచూసుకోనిదే నోటీసులకు అనుమతించలేనని చెప్పారు. అందువల్ల సభ్యులంతా తమ తమ స్థానాలకు వెళ్లాల్సిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మూడోసారి సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లి ఆందోళన సాగించారు. స్పీకర్ మరోసారి అవిశ్వాస నోటీసులను ప్రస్తావించి, సభ్యులంతా తమ తమ స్థానాలకు వెళ్లాలని కోరినా, సభ్యులెవరూ శాంతించలేదు. దీంతో ఆమె సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ ముందుకు లోక్‌పాల్ బిల్లు లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభ ముందుకు తెచ్చింది. గత డిసెంబర్లో బిల్లును ప్రవేశపెట్టినా, ఆమోదానికి నోచుకోకపోవడంతో, సవరణ బిల్లును తెచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ దీనిని వ్యతిరేకించడంతో చర్చకు అవకాశం లేకుండాపోయింది. సభ సమావేశం కాగానే మంత్రి నారాయణసామి లోక్‌పాల్, లోకాయుక్త-2011 సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై ఆయన మాట్లాడుతుండగానే, ప్రస్తుత రూపంలో దానిని ఆమోదిస్తే పోలీసు రాజ్యానికి దారితీస్తుందని ఎస్పీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకంటే ముందు ధరల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు. సభను రెండుసార్లు వాయిదా వేసినా, పరిస్థితి సద్దుమణగకపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, లోక్‌పాల్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లోనే దీనిని ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు మొదలవగానే, సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ పార్లమెంటుపై దాడిలో అమరులైన వారికి నివాళుల ప్రకటన చేశారు. అనంతరం ఇటీవల ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించిన సచిన్ టెండూల్కర్‌కు అభినందనల అంశాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడటం పూర్తవగానే వివిధ పార్టీల సభ్యులు తాము లేవనెత్తిన అంశాలపై ప్రశ్నలు సంధించడంతో గందరగోళం నెలకొంది. రెండుసార్లు సభను వాయిదా వేసినా, పరిస్థితి చక్కబడలేదు. లోక్‌సభ బిల్లులోని అంశాలను మంత్రి నారాయణసామి చదివే ప్రయత్నం చేయగా, ఎస్పీ సభ్యుడు నరేశ్ అగ్రవాల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ దీనిని తోసిపుచ్చి, బిల్లును ప్రతిపాదించాలని నారాయణసామిని కోరారు. ఆయన మళ్లీ బిల్లులోని అంశాలను చదవబోతుండగా సభలో నినాదాలు హోరెత్తాయి. దీంతో కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. అమరులకు జగన్ నివాళులు పార్లమెంటుపై దాడి సంఘటనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్‌తో పాటు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అమరుల చిత్రపటాల ముందు మౌనం పాటించి నివాళులర్పించారు. అవిశ్వాసానికి మద్దతిస్తామన్న ఎస్పీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శుక్రవారం ప్రకటించింది. యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌పాల్ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తోంది. తమతో సంప్రదించకుండానే లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడంపై ఆగ్రహంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, అవిశ్వాసానికి అనుకూలంగా తన వైఖరిని మార్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్‌పాల్ బిల్లు, ‘అవిశ్వాసం’... ఈ రెండింటిలో దేనికి సిద్ధపడతారో తేల్చుకోవాలంటూ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినట్లు పలు చానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. తెలంగాణ విషయమై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే, తాము దానిని సమర్థిస్తామని ఎస్పీ నేత రామ్‌గోపాల్ చెప్పారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై నోటీసులను సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతి లభించాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ఈ నోటీసులపై ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ ఎంపీలతో కలుపుకొని 13 మంది మాత్రమే సంతకాలు చేశారు. లోక్‌సభలో శుక్రవారం వరుసగా ఐదోరోజూ వివిధ అంశాలపై విపక్షాలు రభసకు దిగడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. -
వైఎస్ జగన్ వాదనలో బలముంది: బీహార్ ముఖ్యమంత్రి
పాట్నా:రాష్ట్రాల విభజనకు ఆర్టికల్ 3 ని సవరించాలంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలో బలం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రాల విభజన విషయంలో ప్రస్తుతం ఉన్న పద్దతిని మార్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శాసన సభను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. విభజన విధానాన్ని మార్చాలంటూ కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి, తమ పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. గతంలో బీహార్‌ను కూడా విభజించే సమయంలో పాత పద్దతినే అనుసరించారన్నారు. రాష్ట్రాలను విభజించేటప్పుడు శాసన సభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని నితీష్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో సాధారణ మెజారిటీ ఉన్న పార్టీలు విభజనలకు పాల్పడటం తగదని ఆయన తెలిపారు. -
పాట్నాలో జగన్‌కు ఘన స్వాగతం
పాట్నా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. పాట్నా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా జగన్ ఇక్కడకు వచ్చారు. కాసేపట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఆయన కలవనున్నారు. సమైక్యాంధ్ర కోసం నితీష్ సహకారాన్ని ఆయన కోరనున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని తెలియచేశారు. ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని కోరారు. -
ఆర్టికల్ ౩ దుర్వినియోగం
-
ఆర్టికల్-3 సవరణకు కలసిరండి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని ఆర్టికల్-3 సవరణకు కలసిరావాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. విశాలాంధ్ర మహాసభ నాయకుడు చేగొండి రామజోగయ్య, ఏపీఎన్జీవో మాజీ కార్యదర్శి సత్యనారాయణ, డాక్టర్ ఎల్వీకే రెడ్డి, ఐటీ జేఏసీ నేతలు పోతుల శివ, పుత్తా శివశంకర్ తదితరులతో కలసి వేదిక నేతలు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, వి.లక్ష్మణరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేస్తూ ఆర్టికల్-3కి సవరణ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దిశగా దేశంలోని పలు రాజకీయ పార్టీలను కలసి మద్దతు కూడగట్టడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. పార్టీ విధానాలతో సంబంధం లేకుండా ఆర్టికల్-3 సవరణకు అన్ని పార్టీలు కలసి రావాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించాల్సింది పోయి కొన్ని పార్టీలు విమర్శలు చేయడాన్ని తప్పబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేస్తున్న వారిని విమర్శిస్తే ప్రజల్లో పలచనకావడం తప్ప వచ్చే ప్రయోజనం లేదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి వీలుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న ఉద్యమ సంస్థలు, మేధావులు, విద్యార్థులను కలుపుకొని జస్టిస్ లక్ష్మణరెడ్డి నేతృత్వంలో ‘సమైక్య ఉద్యమ సమన్వయ సమితి’ పేరిట కమిటీ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో.. డిసెంబర్ రెండో వారంలో చలో ఢిల్లీ, శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో చలో అసెంబ్లీ కార్యక్రమాల ను ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమైక్యతను కోరుతూ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి త్వరలో అఫిడవిట్లు స్వీకరించనున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి కోదండరాం నేతృత్వంలో అన్ని పార్టీలు, సంఘాలు కలసి పనిచేస్తున్న విధంగా ఏపీఎన్జీవోలు సమైక్య ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవోలు విఫలమైన పక్షంలో ఆ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. -
ఆర్టికల్-3 సవరించాల్సిందే: వైఎస్ జగన్
-
ఆర్టికల్-3 సవరించాల్సిందే: వైఎస్ జగన్
దాని సవరణ దిశగా మా పోరాటానికి కలసిరండి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌కు జగన్ బృందం విజ్ఞప్తి రాజకీయ లబ్ధి కోసం ఆర్టికల్-3 దుర్వినియోగమవుతోంది చట్ట సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతోనే నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అదే విధానాన్ని అవలంబించాలి దీని కోసం ఆర్టికల్-3 సవరణకు కృషి చేయాలని వినతి తమది చిన్న రాష్ట్రాల విధానమని చెబుతూనే ఈ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళతానన్న రాజ్‌నాథ్ దేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేసే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని పార్టీ నాయకుల బృందం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు గట్టిగా విజ్ఞప్తి చేసింది. ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా ఆ ప్రతిపాదనను అసెంబ్లీలోనూ, పార్లమెంట్‌లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించడం తప్పనిసరి చేయాలని ఉద్ఘాటించింది. ఈ ప్రతిపాదనను అమలు చేసే దిశగా ఆర్టికల్ 3ను సవరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ సవరణ కోసం తాము చేపట్టిన పోరాటానికి బీజేపీ కలసిరావాలని రాజ్‌నాథ్ సింగ్‌ను జగన్మోహన్రెడ్డి కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే రాజకీయ లబ్ధి దృష్టితో ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేయవచ్చని, ఇది ఎంతమాత్రం మంచి సంప్రదాయం కాదని, దీనిపై వెంటనే చర్చ జరగాలని అన్నారు. మరో ఆరు మాసాల్లో పదవీకాలం ముగుస్తున్న కేంద్ర ప్రభుత్వం, అదీ మైనారిటీలో ఉన్న ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముంగిట ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ఎంత అసమంజసమో చూడాలన్నారు. దీనికి స్పందించిన రాజ్‌నాథ్, ఆర్టికల్ 3 సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తానని, అలాగే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలు చేయాలంటూ ఫజల్ అలీ కమిషన్ సూచించిన అంశం కొత్త విషయమని, దీన్ని సైతం పార్టీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. తమది చిన్న రాష్ట్రాల విధానమని అంటూనే ఆయన ఈ అంశాలను పార్టీ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని పేర్కొన్నట్టు తెలిసింది. ఐదు పేజీల వినతిపత్రం.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ వచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు ఎం.వి.మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, బాలశౌరి, గట్టు రామచంద్రరావుతో కలసి ఆదివారం జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. అశోకారోడ్‌లోని రాజ్‌నాథ్ నివాసంలో రాత్రి 6.10 నుంచి 7.10 వరకు గంటపాటు జరిగిన చర్చల్లో రాజ్‌నాథ్‌తోపాటు బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు తోడ్పడాలని, ఆర్టికల్ 3 సవరణకు కలసిరావాలని కోరుతూ తొలుత జగన్ బృందం ఐదుపేజీల వినతిపత్రాన్ని రాజ్‌నాథ్‌కు అందజేసింది. విభజన వ్యతిరేక పోరాటంలో దేశంలోని అన్ని ప్రధాన పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో జగన్ బృందం శనివారం సీపీఐ, సీపీఎం అగ్ర నేతలతో సమావేశమై రాష్ట్ర సమైక్యత, ఆర్టికల్ 3 సవరణ అంశాలపై విస్తృతంగా చర్చించిన సంగతి విదితమే. తాజాగా రాజ్‌నాథ్‌తో భేటీ కావడంతో మొత్తం మూడు ముఖ్యమైన పార్టీలను జగన్ బృందం కలిసినట్టయింది. తమ పార్టీ అధినేతతో జగన్ బృందం చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, రాష్ట్ర విభజన తాలూకు పలు అంశాలను ప్రస్తావించడంతోపాటు ఆర్టికల్ 3 సవరణ ఆవశ్యకతను జగన్ బృందం నొక్కిచెప్పిందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీది ప్రత్యేక పరిస్థితి... రాజ్‌నాథ్‌తో భేటీలో జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ పూర్వాపరాలను, ఆర్టికల్ 3 దుర్వినియోగానికి ఉన్న ఆస్కారాన్ని వివరించారు. తెలిసిన సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీకి ఓ వైఖరి ఉండవచ్చునని, అయితే రాష్ట్రానిది ఓ ప్రత్యేక పరిస్థితి అని వారు ఆయనకు చెప్పారు. భాషాప్రయుక్త ప్రాతిపదికన మొదటి ఎస్సార్సీ చేసిన సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఓ షరతు కూడా పెట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం శాసనసభలు మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలను ఆమోదిస్తేనే విలీనం జరగాలన్న షరతు మేరకే రెండు శాసనసభలు తీర్మానాలు చేశాయని, ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ అవతరించిందని తెలిపారు. రెండు రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలను మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించిన తర్వాతే ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని అదే మెజారిటీతో చేయాల్సి ఉన్నా దానికి భిన్నంగా విభజనను చేపడుతున్నారంటూ కేంద్రం చేస్తున్న తప్పును ఎత్తిచూపారు. సమాఖ్య భావనకు విరుద్ధం.. రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోందని, అయినా సరే అధికార కాంగ్రెస్ పార్టీ దాన్నేం పట్టించుకోకుండా ఇష్టానుసారం తన ప్రణాళికను అమలు చేస్తూ ముందుకెళ్తోందని జగన్మోహన్రెడ్డి బృందం రాజ్‌నాథ్‌కు తెలియజేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న 75 శాతం మంది ప్రజలవాణిని ప్రతిబింబించని విభజన బిల్లును పార్లమెంట్లో గట్టిగా వ్యతిరేకించాలని కోరింది. నిజమైన సమాఖ్య భావనకు సదరు బిల్లు విరుద్ధమైనదని, దీన్ని తిరస్కరించాలని విన్నవించింది. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీలన్నీ కలసి నిలవాల్సిన తరుణమిదని పేర్కొంది. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సమస్య ఏమాత్రం కాదని, మున్ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ ప్రభుత్వమైనా స్వప్రయోజనాల కోసం ఎక్కడైనా ఇలాంటి విభజనకే దిగే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చింది. ప్రజాస్వామ్యానికి, విలువలతోకూడిన రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే రాజకీయ పార్టీలు ఈ సమస్యను చూస్తూ కూర్చోరాదని, ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తులో మరెక్కడా పునరావృతం కాకుండా చూడటానికి ఆర్టికల్ 3 సవరణకు పట్టుబట్టాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేతులు కలపాలని జగన్ బృందం కోరింది. నేడు హైదరాబాద్‌కు జగన్! రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశ రాజధానిలో రెండ్రోజులపాటు వామపక్షాలు, బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపిన జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరుతారు. -
ఆర్టికల్ 3పై పార్టీలో చర్చిస్తాం
-
ఆర్టికల్ 3 దుర్వినియోగం చేస్తున్నారు:మైసురా
-
రాష్ట్ర విభజన పై రాజ్యాంగ భాష్యం