Laxmikant Sharma
-
తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. చిలకలగూడ పీఎస్‌లో హాజరు
హైదరాబాద్: యూ ట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీంతో తీన్మార్ మల్లన్న చిలకలగూడ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. కాగా తనను తీన్మార్ మల్లన్న బెదిరిస్తున్నాడని లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక క్యూస్ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: వ్యాపం స్కాంలో మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వ్యాపం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి లక్ష్మీకాంత్‌తో పాటు ఆయన సహాయకుడు ఓ ప్రకాశ్ శుక్లాపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. వ్యాపం స్కాంలో సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తం 52 మందిపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. నేరిపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2012లో జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపం స్కాంలో సంబంధంఉన్న వారు 40 మందికి పైగా అనుమానాస్పద స్థితిలో మరణించారు.