న్యూఢిల్లీ: వ్యాపం స్కాంలో మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వ్యాపం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి లక్ష్మీకాంత్తో పాటు ఆయన సహాయకుడు ఓ ప్రకాశ్ శుక్లాపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది.
వ్యాపం స్కాంలో సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తం 52 మందిపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. నేరిపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2012లో జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపం స్కాంలో సంబంధంఉన్న వారు 40 మందికి పైగా అనుమానాస్పద స్థితిలో మరణించారు.
మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
Published Wed, Jul 22 2015 8:28 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement