యాదాద్రిలో ఆంతరంగికంగానే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం
► ‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గురువారం ఉదయం 6 గంటల, 49 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది.
►క్యూలైన్ల ద్వారా భక్తులకు స్వామివారి దర్శనాకి అనుమతిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో గీత పేర్కొన్నారు.
►యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా వెండి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీనరసింహ స్వామి వారు దర్శనమిచ్చారు.
►మాస్క్, బౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పూలతో అధికారులు అలంకరించారు.
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట : వైకుంఠ (ముక్కోటి) ఏకాదశికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు ముస్తాబు చేశారు. ఈ సారి కూడా ముక్కోటి పూజలు అంతరంగికంగానే జరగనున్నాయి. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో శ్రీస్వామి వారికి చేసే పూజల్లో రద్దీ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి క్యూలైన్లలో వెళ్లే విధంగా యాదాద్రి, పాతగుట్ట ఆలయాల్లో వీలు కల్పించారు. బాలాలయంలో లక్ష్మీనరసింహుడి వైకుంఠద్వార దర్శనానికి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో సరిపడా పులిహోర, లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. పాతగుట్ట ఆలయం వద్ద కూడా ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. యాదాద్రీశుడి బాలాలయంలో గురువారం నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు.
అలంకార సేవలు ఇవే..
బాలాలయంలో నిర్వహించే అధ్యయనోత్సవాల్లో శ్రీస్వామి వారి అలంకార సేవలు నిర్వహిస్తారు. 13న ఉదయం గరుఢ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకార సేవ, సాయంత్రం మత్సా్యయవతారంలో విష్ణుమూర్తి అలంకర సేవ, 14న ఉదయం వేణుగోపాల స్వామి అలంకారం, సాయంత్రం గోవర్ధనగిరిధారి అలంకారం, 15న ఉదయం శ్రీరామావతారం, సాయంత్రం శ్రీవెంకటేశ్వరస్వామి అలంకారం, 16న ఉదయం వెన్న కృష్ణుడు అలంకారం, సాయంత్రం కాళీయవర్ధనుడి అలంకారం, 17న ఉదయం వటపత్రసాయి అలంకారం, సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారం, 18న ఉదయం శ్రీనరసింహస్వామి అలంకారంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. కాగా.. ముక్కోటి ఏకాదశికి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు.