leader murdered
-
అనంతపురం: కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త శ్రీధర్ దారుణహత్య
-
అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేత హత్య
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షెక్షానుపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత బోయ శ్రీధర్(40)ను దుండగులు హతమార్చారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ పోస్టుమార్టంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. షెక్షానుపల్లి సర్పంచ్ బోయ లింగన్న కుమారుడైన శ్రీధర్ 2014లో తన భార్య మల్లికను ఎంపీటీసీగా గెలిపించుకున్నాడు. ఆ సమయంలో కక్ష పెంచుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మనోహర్‌నాయుడు 2015లో జరిగిన తన సోదరుడి హత్య కేసులో శ్రీధర్‌ను ఇరికించాడు. గ్రామంలో గొడవలు చెలరేగకుండా ఉండేందుకు పెద్దల సూచన మేరకు శ్రీధర్ కుటుంబంతో సహా శెట్టూరు వెళ్లిపోయాడు. అక్కడే ఓ ఎరువుల దుకాణం పెట్టుకొని జీవనం సాగించేవాడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో షెక్షానుపల్లి సర్పంచ్‌గా శ్రీధర్ తండ్రి లింగన్న గెలుపొందాడు. అప్పటినుంచి శ్రీధర్‌పై టీడీపీ నేత మనోహర్‌నాయుడు పగతో రగిలిపోయేవాడు. ఆదివారం అనంతపురంలో జరిగిన ఎరువుల కంపెనీ ప్రతినిధుల సమావేశంలో శ్రీధర్ పాల్గొన్నాడు. అది ముగిసిన అనంతరం.. ఆదివారం రాత్రి బైక్‌పై ఒంటరిగా తిరుగు ప్రయాణమయ్యాడు. ఇదిలాఉండగా, కాలువపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కళ్యాణదుర్గం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని శ్రీధర్‌గా గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. బలమైన ఆయుధాలతో శ్రీధర్‌పై దాడిచేసి హతమార్చినట్లుగా సోమవారం పోస్టుమార్టంలో బయటపడింది. తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీడీపీ నేత మనోహర్‌నాయుడు తన అనుచరులతో కలిసి శ్రీధర్‌ను కారులో వెంబడించి.. వేట కొడవళ్లతో దాడికి దిగి దారుణంగా చంపేశాడని లింగన్న కన్నీటిపర్యంతమయ్యాడు. ఎవరికీ అనుమానం రాకూడదనే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని తెలిపాడు. శ్రీధర్ హత్య దారుణం: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కక్షలకు దూరంగా ప్రశాంతంగా జీవిస్తున్న శ్రీధర్‌ను వెంటాడి హతమార్చడం దారుణమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో శ్రీధర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి.. ఓదార్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
పార్టీ ఆఫీసులో చొరబడి.. గొంతు కోశారు..
లక్నో : హిందూ సమాజ్ పార్టీ నాయకుడు కమలేష్ తివారీ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని ఖుర్షిద్ బాగ్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆఫీసులో కూర్చున్న కమలేష్ వద్దకి టీ ఇచ్చే నెపంతో లోపలికి ప్రవేశించిన దుండగులు పదునైన ఆయుధాలతో గొంతుకోసి పారిపోయారు. అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఘటనా స్థలంలో ఒక నాటు తుపాకి, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు. కాగా, 2015లో మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కమలేష్ మీద జాతీయ భద్రతా చట్టం కింద యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన కమలేష్‌పై ఉన్న కేసును అలహాబాద్ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ దారుణం జరగడం గమనార్హం. కమలేష్ గతంలో హిందూ మహాసభలో పనిచేశారు. అనంతరం బయటికొచ్చి హిందూ సమాజ్ పార్టీని స్థాపించాడు. -
నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన ఇందాల్ పాశ్వాన్ అనే నాయకుడి హత్య నలందాలో అల్లర్లకు కారణమైంది. గడిచిన వారం రోజుల్లో ఇటువంటి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. అసలేం జరిగిందంటే... సన్నిహితుల కుటుంబానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన ఇందాల్‌కు స్థానిక యువకులతో మంగళవారం వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతడు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇందాల్ హత్యతో ఉలిక్కిపడ్డ అతడి సన్నిహితులు.. నిందితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి బుధవారం నిప్పంటించారు. అంతేకాకుండా అతడి కొడుకు(13)ను తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మృతిచెందాడు. దీంతో నలందాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గత శనివారం వైశాలీ ఏరియాలో పింటూ సింగ్ అనే బ్యాంకు ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అనంతరం కాల్చి చంపేశారు. గయలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. గంజన్ ఖేమ్కా అనే పారిశ్రామికవేత్త కూడా ఇదే పద్ధతిలో హత్యకు గురయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కక్షతోనే దుండగులు ఇందాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు చెప్పడం కొసమెరుపు. #Bihar: Local RJD leader was shot dead in Deepnagar police limits, in Nalanda, yesterday. Locals attacked and set fire to the house of the accused. SDPO, Nalanda says, "He was shot dead due to personal enmity. We are investigating the matter." pic.twitter.com/1NCNNEp9UA — ANI (@ANI) January 2, 2019 -
‘హిందూ’ నేత హత్య
రాష్ట్రంలో మరో హిందూ మున్నని నేతను దుండగులు హత్యచేశారు. తిరునెల్వేలి జిల్లా శంకరన్ కోవిల్ పట్టణానికి చెందిన జీవరాజ్ (37)ను శుక్రవారం అర్ధరాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. మృతునికి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : హిందూ మున్నని పట్టణ కార్యదర్శి గా వ్యవహరిస్తున్న జీవరాజ్‌ను 3 నెలల క్రితం సస్పెండ్ చేశారు. అదే ప్రాంతంలో మునీశ్వర్ ఆలయూన్ని నిర్మించిన జీవరాజ్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దళారిగా కూడా ఉన్నారు. పెద్ద భార్య అయ్యమ్మాళ్కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కరడికుళానికి చెందిన షర్మిలాదేవీ (28)ని ఆరు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. పడమర పాట్టాత్తూరులో జీవా ఇటీవలే కొత్తగా నిర్మించుకున్న సొంత ఇంటిలో ఇద్దరు భార్యలతో నివసిస్తున్నాడు. శుక్రవారం భర్తపై అలిగిన అయ్యమ్మాళ్ అదే ఊరిలోని తన పుట్టింటికి వెళ్లింది. పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా, సమీపంలోనే ఉన్న మునీశ్వర్ ఆలయం వాకిట్లో మంచం వేసుకుని జీవరాజ్ నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి దుండగులు ఆలయం ముందున్న లైట్లను పగులకొట్టి, జీవా కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో వెంటబడి విచక్షణా రహితంగా నరికారు. తండ్రి కేకలతో వెలుపలకు వచ్చిన కుమారుడు వల్లరసు రక్తపుమడుగులో పడివున్న జీవాను చేసి సృ్పహ తప్పిపోయాడు. తెల్లవారు జీవా రెండో భార్య, తెల్లవారుజామున భర్త మృతదేహాన్ని చూసి తల్లడిల్లింది. శంకరన్ ఆలయం ఉన్నకళుగుమలై రోడ్డులో ఉన్న మరో సామాజికవర్గం, హిందూమున్నని నేతల మధ్య వైషమ్యాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గం ఉన్నచోట వినాయకుని గుడి, పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. గత వినాయకచవితి రోజున మరో సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఊరేగింపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శంకరన్‌కోవిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో హతుడిపై అనేక కేసులు ఉన్నాయి. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. రాష్ట్రంలో హిందూ ముద్ర వేసుకున్న నేతల హత్యల పరంపర కొనసాగుతోంది. వేలూరు జిల్లాలో ఒకరిని హత్యచేయగా, మరో సంఘటనలో ఒకరు తప్పించుకున్నారు. తిరుచ్చిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడిటర్ రమేష్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మరో ఇద్దరిపై కూడా హత్యాయత్నాలు జరిగాయి. గత ఏడాదిలో హిందువులే లక్ష్యంగా హత్యలు సాగడంపై పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే తాజా హత్యలో హిందూ నేపథ్యమా, ఇద్దరు భార్యల గొడవా, రియల్ ఎస్టేట్ తగాదాలా అని పోలీసులు విచారిస్తున్నారు.