
లక్నో : హిందూ సమాజ్ పార్టీ నాయకుడు కమలేష్ తివారీ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని ఖుర్షిద్ బాగ్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆఫీసులో కూర్చున్న కమలేష్ వద్దకి టీ ఇచ్చే నెపంతో లోపలికి ప్రవేశించిన దుండగులు పదునైన ఆయుధాలతో గొంతుకోసి పారిపోయారు. అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
ఘటనా స్థలంలో ఒక నాటు తుపాకి, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు. కాగా, 2015లో మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కమలేష్ మీద జాతీయ భద్రతా చట్టం కింద యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన కమలేష్‌పై ఉన్న కేసును అలహాబాద్ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ దారుణం జరగడం గమనార్హం. కమలేష్ గతంలో హిందూ మహాసభలో పనిచేశారు. అనంతరం బయటికొచ్చి హిందూ సమాజ్ పార్టీని స్థాపించాడు.
Comments
Please login to add a commentAdd a comment